Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఎగరకముందే.. చెక్‌ పెట్టేస్తారు!
ADVERTISEMENT 

ఎగరకముందే.. చెక్‌ పెట్టేస్తారు!

National Sakshi User Sakshi Sakshi Time Jul 23, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
plane.jpg

విమానయాన రంగంలో కఠిన తనిఖీలు

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా

తీవ్ర లోపాలుంటే విమానం నిలిపివేత

ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న డీజీసీఏ

మనం వాడే బండిని క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయిస్తాం. బ్రేకులు సరిగా పడుతున్నాయా, టైర్లలో గాలి ఉందా, సరిపడా ఇంధనం ఉందా అని రోజూ చెక్‌ చేస్తాం. అలాంటిది గాల్లో ఎగిరే విమానం అయితే? మనం మన వాహనాన్ని చెక్‌ చేసినట్టే విమానాన్ని ఒక్క పైలట్‌ చెక్‌ చేస్తే సరిపోతుందా? అస్సలు కాదు.. కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు విమానయాన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, థర్డ్‌ పార్టీ ఏజెన్సీల నిఘా కళ్లు ప్రతి క్షణం పర్యవేక్షిస్తుంటాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఈ సంస్థలు ఒక ప్రణాళిక ప్రకారం విమానాలు, విమానాశ్రయాలు, సర్వీసింగ్‌ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడమేకాదు.. ఆకస్మిక తనిఖీలూ చేసి ఉల్లంఘనలపై 
ఉక్కుపాదం మోపుతున్నాయి. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఈ ఏడాది జూన్  12న ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం తాలూకా చేదు జ్ఞాపకాలు భారతీయుల మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 275 మందికిపైగా ప్రాణాలను బలి తీసుకున్న ఘోర దుర్ఘటన నేపథ్యంలో దేశంలో అమలవుతున్న విమానయాన నిబంధనలు, భద్రత అంశం చర్చకు వచ్చింది. విమానయానంతో ముడిపడి ఉన్న ప్రభుత్వ కీలక సంస్థల పనితీరుపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎయిర్‌ ఇండియా ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా, సాంకేతిక సమస్యనా అన్నది పక్కన పెడితే.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌), ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) వంటి ప్రభుత్వ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాయి. ఇందుకు ఈ సంస్థలు చేపట్టిన తనిఖీలే నిదర్శనం. 2023 జనవరి నుంచి 2025 ఏప్రిల్‌ వరకు 9,423 తనిఖీలు చేపట్టాలన్నది ప్రణాళిక కాగా రికార్డు స్థాయిలో 13,753 తనిఖీలు చేపట్టడం గమనార్హం. 

రెక్కలు కట్టేస్తారు..: డీజీసీఏ బృందం అన్ని విమాన సంస్థలకు చెందిన విమానాల తనిఖీ చేపడుతుంది. విమానం సురక్షితంగా ప్రయాణం సాగించే స్థాయిలో ఫిట్‌గా ఉందా లేదా అని పరీక్షిస్తారు. లోపాలు, ఉల్లంఘనలు బయటపడితే డీజీసీఏ హెచ్చరికలు జారీ చేస్తుంది. తీవ్ర లోపాలు, ఉల్లంఘనలైతే విమానాలకు భద్రతా ధ్రువీకరణను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అంటే విమానం ఎగరకుండా నిరోధిస్తారు. ఫిట్‌గా ఉందని తేలాకే సస్పెన్షన్  ఎత్తేస్తారు. అంతేకాదు, నిబంధనలను పాటించకపోతే భారీ పెనాల్టీలు విధిస్తారు. 2023 నుంచి 2025 జూలై 20 వరకు 597 విమానాలు సస్పెన్షన్ కు గురయ్యాయంటే ఏ స్థాయిలో తనిఖీలు నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. 

ఆకస్మిక తనిఖీలు..: విమానం, సిబ్బంది, ఆపరేటర్లు భూమిపై ఉన్నప్పుడు విమానయాన నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి డీజీసీఏ అధికారులు అప్రకటిత (ర్యాంప్‌ ఇన్ స్పెక్షన్ ్స) తనిఖీలు నిర్వహిస్తారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ఎంట్రీ ఇస్తారు. ఇలా భారత్‌లోని విమానాశ్రయాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న దేశ, విదేశీ విమానాలకు సంబంధించి 2023 జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 1,188 ర్యాంప్‌ ఇన్ స్పెక్షన్ ్స జరిగాయి. ఈ తనిఖీల్లో 338 లెవెల్‌–2 స్థాయి లోపాలను గుర్తించారు. 

ప్రతి ప్రయాణానికి ముందు విమానానికి తనిఖీలు తప్పనిసరి. విమానం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి పైలట్స్, నిర్వహణ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తారు. అంతా బాగుంది అని నిర్ధారించుకున్నాకే విమానం గాల్లోకి లేస్తుంది. లేదంటే సర్వీస్‌ రద్దు అవుతుంది. 

విమానం వెలుపల: విమానం నిర్మాణం, బాహ్య, నియంత్రణ ఉపరితలాలపై ఏదైనా నష్టం, లీకేజీ, అరిగిపోయాయా అని చూస్తారు.
అంతర్గత తనిఖీలు: కాక్‌పిట్‌లోని పరికరాలు, రేడియోలు, విద్యుత్‌ పరికరాలు, ఇతర ముఖ్యమైన భాగాల పనితీరును ధ్రువీకరిస్తారు.
పత్రాల ధ్రువీకరణ: లైసెన్సులు, రిజిస్ట్రేషన్, బీమా వంటి అన్ని అవసర పత్రాలు ఉన్నాయా లేదా అని చెక్‌ చేస్తారు.
ఇంధనం స్థాయిలు: తగినంత ఇంధనం, చమురు, తగు పాళ్లలో, నాణ్యంగా ఉన్నాయని నిర్ధారించుకుంటారు.నియంత్రణ వ్యవస్థలు: విమాన నియంత్రణలు, బ్రేక్స్, ఇతర క్లిష్ట వ్యవస్థలు పనిచేస్తున్న తీరు, కార్యకలాపాలను పరీక్షిస్తారు.
వాతావరణ పరిశీలన: విమానం ఎగరడానికి, దిగడానికి అనుకూల వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తారు. వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్నాకే విమానం వెళ్తుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
DGCA
inspections
aviation sector
Airports Authority of India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సడిలేని సూపర్‌సానిక్‌

సడిలేని సూపర్‌సానిక్‌

రూ. 2.5 లక్షల లంచం :  సోదాల్లో రూ. 37 లక్షలు, భారీగా బంగారం,వెండి

రూ. 2.5 లక్షల లంచం : సోదాల్లో రూ. 37 లక్షలు, భారీగా బంగారం,వెండి

విమాన ప్రయాణికులకు ఊరట

విమాన ప్రయాణికులకు ఊరట

బ్లాక్‌బాక్సు లేని  40 ఏళ్ల విమానం 

బ్లాక్‌బాక్సు లేని  40 ఏళ్ల విమానం 

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంపై డీజీసీఏ చర్యలు

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంపై డీజీసీఏ చర్యలు

జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్‌ అంబులెన్స్‌

జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం.. కూలిన ఎయిర్‌ అంబులెన్స్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.