Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!
ADVERTISEMENT 

భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

National Sakshi User Sakshi Sakshi Time Mar 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Air-passengers.jpg

2024లో బాగా తగ్గిన వైనం 

కెనడాకు 41 శాతం తగ్గుదల

బ్రిటన్‌కు 27, అమెరికాకు 13 శాతం

రష్యా, ఇతర దేశాలవైపు చూపు

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌లకు వెళ్తున్న వారి సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, జర్మనీ, ఉజ్బెకిస్తాన్‌లకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం విశేషం! మొత్తంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోంది. 2023లో 8,92,989 మంది భారత విద్యార్థులు (Indian Students) విదేశీ బాట పట్టగా 2024లో ఏకంగా 7,59,064కు తగ్గారు! అంటే దాదాపు 15 శాతం తగ్గుదల!!

ఆ మూడు దేశాల్లో...  
2024లో ఉన్నత విద్య కోసం వెళ్లిన అమెరికా, కెనడా, బ్రిటన్‌లకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య 27 శాతం తగ్గినట్టు ఇమిగ్రేషన్‌ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఒక్క ఏడాదిలోనే ఏకంగా 1,64,370 తగ్గుదల! 2023లో కెనడాకు 2,33,532 మంది భారత విద్యార్థులు వెళ్లగా 2024లో 1,37,608కు తగ్గారు. అంటే 41 శాతం తగ్గుదల. బ్రిటన్‌కు 27 శాతం, అమెరికాకు 13 శాతం తగ్గుదల నమోదైంది. కఠినమైన వీసా నిబంధనలు, అధిక ఆర్థిక డిమాండ్లు, ఎక్కువ తిరస్కరణలు, దౌత్య సమస్యల వంటివి ఇందుకు కారణమని గణాంకాలు చెబుతున్నాయి.

ఉద్రిక్తతలు... 
ప్రధానంగా కెనడాతో భారత్‌కు దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగడంతో ఉన్నత విద్యకు ఆ దేశాన్ని ఎంచుకునే భారతీయుల సంఖ్య బాగా తగ్గింది. సిక్కు వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య, అందులో భారత ప్రమేయం ఉందని కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలతో 2023 నుంచి పరిస్థితి దిగజారుతూ రావడం ఇందుకు కారణమైంది. వీటికి తోడు కెనడా తన వీసా, స్టూడెంట్‌ పర్మింట్‌ నిబంధనలను కఠినతరం చేసింది. 

చ‌ద‌వండి: తెలుగు అమ్మాయి సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా? 

బ్రిటన్‌లో నిబంధనలే అడ్డంకిగా మారాయి. పీజీ రీసెర్చ్, ప్రభుత్వ నిధులతో నడిచే పథకాల్లోని వారు మినహా ఇతర విదేశీ విద్యారులు (Foreign students) తమ కుటుంబీకులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ 2023లో నిబంధనలు తెచ్చింది. దాంతో ఉన్నత చదువులకోసం యూకేను ఎంచుకునే విద్యార్థుల సంఖ్య తగ్గింది. 

ఆ దేశాలవైపు చూపు 
కొత్త దేశాలపై భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 2024లో అత్యధిక మంది విద్యార్థులు రష్యాకు వెళ్లారు! 2023తో పోలిస్తే 34 శాతం పెరుగుదల నమోదైంది. 2024లో జర్మనీకి 34,702 విద్యార్థులు పెరిగారు. ఉజ్బెకిస్తాన్‌కు 9,915 మంది, బంగ్లాదేశ్‌కు 8,864 మంది అధికంగా వెళ్లారు. కోవిడ్‌ తర్వాత విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం ఇది రెండోసారి. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Indian students
Study Abroad
higher studies
United States of America
Canada
Britain
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

కెనడా, ఖతార్‌ మ్యాచ్‌.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!

కెనడా, ఖతార్‌ మ్యాచ్‌.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!

హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!

హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!

కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!

కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!

‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం కావాలి!

‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం కావాలి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.