Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. లేడీ సింగం పోస్టుమార్టంలో సంచలన విషయం
ADVERTISEMENT 

లేడీ సింగం పోస్టుమార్టంలో సంచలన విషయం

National Sakshi User Sakshi Sakshi Time May 20, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
si.jpg

గువాహటి: లేడీ సింగంగా పేరు తెచ్చుకున్న అసోం ఎస్సై జున్మోని రభా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు వెలువడటంతో కొత్తకోణం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినప్పటికీ..  జున్మోని శరీరంపై వెనకభాగంలో అనేక గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడికావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.




రెండు వైపుల అనేక పక్కటెముకలకు ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించారు. అంతేగాక బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్మోని రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు మోచేతి,చేతులపై గాయాలు గుర్తులు కనిపించినట్లు తేలింది.

కుటుంబ సభ్యుల అనుమానం

మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రభా.. మంగళవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జున్మోని రభా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేట్ కారులో వెళ్తుండగా  నాగోన్‌ జిల్లాలోఈ ఘోరం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై రభా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్లానింగ్ తోనే ఈ హత్య జరిగిందని జున్మోని రభా తల్లి సుమిత్రా రభా ఆరోపిస్తున్నారు. నిజాన్ని తెలుసుకోవడానికి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణబ్‌ దాస్‌ను సీన్‌ రీ క్రియేట్‌ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య గౌహతి నుండి గురువారం సాయంత్రం నాగోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదంపై టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం అతన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాస్‌ను నాగాన్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ముందు హాజరుపరిచారు.

చదవండి: సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల నియామకం.. 34కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య

అయితే ఘటన జరిగినప్పుడు తాను గువాహటి నుంచి వస్తున్నట్లు ప్రణబ్‌ దాస్‌ తెలిపారు. రోడ్డుకు ఎడమ పక్కన కారు పార్క్‌ చేసి ఉందని, ఇంతలో ఓ ట్రక్లు ఎదురుగా దూసుకొచ్చి కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు బ్లాక్‌ జీన్స్‌ ధరించిన ఓ వ్యక్తి కారు నుంచి దిగి కిందకు వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు.  ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపు తాను అక్కడే ఉండగా.. పోలీసులు మాత్రం తనను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆరోపించారు.

నిందితుడి లోంగుబాటు

ఎస్సై జన్మోని రభా మృతి కేసులో ప్రధాన నిందితుడైన పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ అస్సాం పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయాడు.  రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను సుమిత్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుమిత్‌ను జఖలబంధ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు సుమిత్‌ అదుపులో ఉన్నాడని అతన్ని విచారించిన అనంతరం కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

స్పందించిన సీఎం

జన్మోని మరణంపై ఎట్టకేలకు సీఎం హిమాంత బిస్వా శర్మ నోరు విప్పారు. పోలీసు మృతిపై సీఐడీతోపాటు.. మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తే కేసును సీబీకి అప్పగించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది సున్నితమైన విషయమని, ఈ ఘటనలో చాలా కోణాలు ఉన్నాయన్నారు. దీనికి మొత్తం పోలీస్‌ శాఖపై అంటిపెట్టడం సరైనది కాదన్నారు. 

కాబోయే భర్తను అరెస్ట్‌ చేయించి

ఒకప్పుడు ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నాడని కాబోయే భర్తను అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యింది రభా. నేరుస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఆమెను దబాంగ్‌ కాప్‌ అని కూడా పిలిచేవారు. అయితే డేరింగ్‌ పోలీస్‌ అధికారిగా పేరు సంపాదించిన ఆమెను పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి.  జున్మోని రభాకు ఎంత పేరుందో అంతకుమించిన వివాదాలు కూడా ఉన్నాయి.

ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని జున్మోని రభాపై అభియోగాలు రావడంతో  కాబోయే భర్తతోపాటు ఆమె కూడా అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో మజులీ జిల్లాకోర్టు జ్యూడిషీయల్‌ కస్టడీ విధించడంతో విధుల నుంచి సస్పెండ్‌ అయ్యారు. అనంతరం సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి డ్యూటీలో జాయిన్‌ అయ్యారు.

ఎమ్మెల్యేతో వివాదం

గత ఏడాది జనవరిలో భుయాన్ నియోజకవర్గంలో చట్టవిరుద్ధంగా అమర్చిన యంత్రాలతో బోట్లను నడుపుతున్నారనే ఆరోపణలపై కొందరు బోట్ మెన్ లను రభా అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడీయో టేప్‌ లీక్‌ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ...ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వాలంటూ రభాకు సూచించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
assam
Sub Inspector of Police (SI)
Road Accident
Himanta Bisva Sharma
postmortem report
injuries
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

అమ్మ ఊరు వెళ్లిందన్నారు కదా.. ఎప్పుడు వస్తుంది?

అమ్మ ఊరు వెళ్లిందన్నారు కదా.. ఎప్పుడు వస్తుంది?

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్సుపైకి దూసుకొచ్చిన లారీ

ఆర్టీసీ బస్సుపైకి దూసుకొచ్చిన లారీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.