Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆర్టీఐ సమాచారంలో షాకింగ్‌ లెక్కలు
ADVERTISEMENT 

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆర్టీఐ సమాచారంలో షాకింగ్‌ లెక్కలు

National Sakshi User Sakshi Sakshi Time Mar 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Mumbai.jpg

 రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదేళ్లలో 3,03,531 రోడ్డు ప్రమాదాలు   

  1.22 లక్షల మంది మృత్యువాత.. గాయపడ్డవారు 2.58 లక్షలు  

ఆర్టీఐ సమాచారంతో  వెలుగులోకి వివరాలు   

సాక్షి ముంబై: రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 1.22 లక్షల మంది మృత్యువాత పడగా 2.58 లక్షల మంది తీవ్రంగా గాయపడినట్లు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. ఇటు ట్రాఫిక్‌ పోలీసులు అటు ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓ) అధికారులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే డ్రైవర్లపై క్రమశిక్షణ పేరట ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఓ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. 

కానీ ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ల దుస్ధితిని ఎవరూ పట్టించుకోవడం లేదని, తప్పంతా తమమీదే మోపడం అన్యాయ మని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా వెళుతున్న వాహనం ముందు ఆకస్మాత్తుగా గుంతలు ప్రత్యక్షం కావడం, రిపేరు వచ్చి రోడ్డుపై లేదా పక్కన నిలిపి ఉంచిన వాహనాల వల్ల అత్యవసరంగా బ్రేక్‌ వేయాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. దీని వల్ల వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.  

పోలీసులదాకా వచ్చేవి కొన్నే... 
కాగా పెద్ద ప్రమాదాలకు సంబంధించిన కేసులే పోలీసు స్టేషన్లలో నమోదవుతున్నాయి. వాటి వల్లే ప్రమాదాల సంఖ్య తెలుసుకునే అవకాశముంటుంది. చిన్నచిన్న ప్రమాదాల విషయంలో బాధితుడు, కారకుల మద్య సయోధ్య కుదిరి కేసు పోలీసులదాకా వెళ్లని సందర్భాలు లక్షల్లో ఉంటాయి. ఇలా 2016 నుంచి 2024 డిసెంబరు వరకు గడచిన తొమ్మిదేళ్లలో 3,03,531 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,22,270 మంది మృతి చెందగా 2,58,723 మంది గాయపడినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను బట్టి తెలిసింది.  

ముంబైదే మొదటిస్థానం... 
రోడ్డు ప్రమాదాల్లో దేశ ఆరి్ధక రాజధాని ముంబై నగరం మొదటి స్ధానంలో ఉండగా మృతుల సంఖ్యకు సంబంధించి పుణే జిల్లా అగ్రస్ధానంలో ఉంది. ముంబైలో 23,519 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 3,802 మృత్యువాత పడ్డారు. ఇక అతి తక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన జిల్లాగా సోలాపూర్‌ నిలిచింది. ఈ జిల్లాలో 1,925 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 694 మంది మరణించారు. అలాగే సింధుదుర్గ్‌ జిల్లాలో 1,982 ప్రమాదాలు జరగ్గా 652 మంది బలయ్యారు.  

ఎన్ని చర్యలు చేపట్టినా... 
స్టేట్, నేషనల్‌ హై వే లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీఓ అధికారుల అనేక విధాలుగా ప్రయతి్నస్తున్నారు. ప్రమాదకర మలుపులవద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, ఏదైనా పల్లె, గ్రామం మొదట్లో స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటుతోపాటు . జాతీయ, రాష్ట్ర రహదారులతోపై వేగ నియంత్రణ కోసం అక్కడక్కడా స్పీడ్‌గన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వారిపై జరిమానా విధిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినాసరే రోడ్డు ప్రమాదాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
shocking
RTI
Increasing
Road Accident
Maharashtra
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.