Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. శబరిమలైలో మరో ట్విస్ట్‌.. యోగదండం మిస్సింగ్‌!
ADVERTISEMENT 

శబరిమలైలో మరో ట్విస్ట్‌.. యోగదండం మిస్సింగ్‌!

National Sakshi User Sakshi Sakshi Time Oct 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ayyappa.jpg

పతనంతిట్ట: శబరిమలై బంగారం అంశంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. శబరిమల గర్భగుడిలో ఉండాల్సిన అమూల్యమైన యోగదండాన్ని(పవిత్ర దండం) బంగారు పూత కోసం తీసుకెళ్లిన, తిరిగి ఇవ్వలేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పురాతన యోగదండాన్ని 2018లో బంగారు పూత కోసం తీసుకెళ్లారు. ఆ తర్వాత, కొత్తగా తయారు చేసిన యోగదండం తిరిగి తీసుకువచ్చారు. కానీ, అసలు యోగదండాన్ని మాయం చేశారు. ఈ యోగదండం వివరాలు ఎన్నడూ ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్‌లో ఎంట్రీ కాలేదని సమాచారం.

2018లో..
2018లో ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) శబరిమల గర్భగుడిలోని అయ్యప్పస్వామి యోగదండానికి బంగారు పూత పూయించాలని నిర్ణయించింది. అక్కడే ఉండే రుద్రాక్ష మాలకు కూడా బంగారు పూత పూయించేందుకు తరలించారు. అయితే, ఈ వస్తువులను ఆలయం నుంచి బయటకు తీసుకెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలోని ఒక సీనియర్ అధికారి ఈ వస్తువులను బయటకు తీసినప్పుడు తూకం, అధికారిక మహజర్ (తనిఖీ రికార్డు)లో నమోదు చేయలేదని వెల్లడించారు .

ఇప్పటికీ దేవస్వం బోర్డు అధికారులకు యోగదండం, రుద్రాక్షకు ఎంత బంగారం పూశారు? అసలు వెండి భాగాలను తిరిగి ఉపయోగించారా? అనే సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. వాటిని తిరిగి ఇచ్చినప్పుడు వాటి బరువుకు సంబంధించిన రికార్డులు కూడా లేవు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, యోగదండం అత్యంత పురాతనమైనది. కనిపించకుండా పోయిన రుద్రాక్ష మాల కూడా దశాబ్దాల క్రితం నాటిది అని తెలుస్తోంది. 

ఇదీ.. యోగదండం విశిష్టత
మండల-మకరవిళక్కుతోపాటు.. నెలవారీ పూజలు, ప్రత్యేక సందర్భాలలో జరిగే పూజల తర్వాత.. హరివరాసనాన్ని ఆలపించి, ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత అయ్యప్ప యోగనిద్రలో ఉంటారని భక్తుల విశ్వాసం. ఆలయాన్ని మూసివేసే ముందు.. అయ్యప్ప వద్ద యోగదండం పెడతారు. ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాలను స్వామిని అలంకరిస్తారు. భస్మాభిషేకంతో విగ్రహాన్ని మూసివేస్తారు. సాధారణంగా ఏకముఖీ రుద్రాక్ష అనేది అత్యంత ఖరీదైనది. ఇప్పుడు కనిపించకుండా పోయినది ఏకంగా ఏకముఖీ రుద్రాక్షలతో చేసిన మాల. అదేవిధంగా యోగదండం అనేది అత్యంత పురాతనమైనది. దీని వెల అమూల్యమని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
sabarimala
tourism
travancore devaswom board
kerala
Sabarimala Ayyappa Temple
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.