Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ఆగ్రహం
ADVERTISEMENT 

ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ఆగ్రహం

National Sakshi User Sakshi Sakshi Time Mar 9, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Draupadi-Murmu.jpg

రాష్ట్రపతి సదస్సు, ప్రయాణ మార్గాన్ని ఎందుకు మార్చారు?  

బ్లూ బుక్‌ నిబంధనలు ఎందుకు పాటించలేదు?  

వాష్‌ రూమ్‌లో నీటి సౌకర్యం కల్పించకపోవడం ఏమిటి?

అన్నింటిపైనా వివరణ ఇవ్వండి.. బెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బెంగాల్‌ సర్కారుకు కేంద్రం ఆదేశం 

న్యూఢిల్లీ/కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రొటోకాల్‌ నిబంధనలు ఉల్లంఘించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రపతి పాల్గొనాల్సిన సంతాల్‌ గిరిజన సదస్సు వేదికను, ఆమె ప్రయాణ మార్గాన్ని హఠాత్తుగా మార్చడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి ప్రొటోకాల్‌కు సంబంధించిన ‘బ్లూ బుక్‌’ నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలంటూ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ‘‘సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీల్లో ఎవరూ రాష్ట్రపతికి స్వాగతం పలక్కపోవడం బ్లూ బుక్‌ రూల్స్‌కు విరుద్ధం.

రాష్ట్రపతికి కేటాయించిన వాష్‌ రూమ్‌లో నీటి సౌకర్యం కూడా లేదు. ఆమె ప్రయాణానికి చెత్తాచెదారంతో నిండిన మార్గాన్ని ఎంపిక చేశారు. వీటిపై వివరణ ఇవ్వండి. ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు బాధ్యులైన డార్జిలింగ్‌ జిల్లా మేజి్రస్టేట్, సిలిగురి పోలీసు కమిషనర్, అదనపు జిల్లా మేజి్రస్టేట్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి’’ అని ఆదేశించారు.

బెంగాల్‌ పర్యటనకు వెళ్లిన ముర్ముకు శనివారం సీఎం మమతా బెనర్జీ గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకలేదు. షెడ్యూల్‌ ప్రకారం బదాన్‌నగర్‌లో జరగాల్సిన దళిత సదస్సును చివరి నిమిషంలో బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్టు సమీపంలోకి మార్చేశారు. సరైన సమాచారం లేక జనం ఆశించినంతగా హాజరు కాలేదు. ఈ పరిణామాలపై ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

ప్రొటోకాల్‌ను ఉల్లంఘించలేదు: మమత
రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరగలేదని మమత తేల్చిచెప్పారు. రాష్ట్రపతి సదస్సులో లోపాలుంటే ప్రైవేట్‌ నిర్వాహకులు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియానే బాధ్యత వహించాలన్నారు. ‘‘రాజ్యాంగం పట్ల, రాష్ట్రపతి పట్ల మాకు ఎనలేని గౌరవముంది. రాష్ట్రపతిని మా తల్లిగా భావిస్తాం. ముర్మును మేం అవమానించలేదు. ఆమెకు సిలిగురి మేయర్‌ స్వాగతం పలికారు’’ అని చెప్పారు. ‘‘రాష్ట్రపతిని అవమానించే అలవాటు బీజేపీదే. గతంలో ఒక సభలో రాష్ట్రపతి నుంచుని ఉంటే ప్రధాని మోదీ మాత్రం కురీ్చలో కూర్చున్నారు’’ అని మమత విమర్శించారు. బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అడ్వానీతో పాటు మోదీ కూర్చుని ఉండగా వారి పక్కన ముర్ము నుంచున్న ఫొటోను ప్రదర్శించారు.  
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Draupadi Murmu
West Bengal
protocol issue
Mamata banarjee
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

15 ఏళ్ల జాతీయస్థాయి క్రీడాకారిణి అదృశ్యం

15 ఏళ్ల జాతీయస్థాయి క్రీడాకారిణి అదృశ్యం

మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్‌

మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాతో ప్రపంచ శాంతి 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.