Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. పాలిటిక్స్‌ ఫుల్‌టైమ్‌ కాదు
ADVERTISEMENT 

పాలిటిక్స్‌ ఫుల్‌టైమ్‌ కాదు

National Sakshi User Sakshi Sakshi Time Apr 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dehli.jpg

నేనొక యోగిని మాత్రమే 

పార్టీ ఆదేశాలనుసారమే సీఎంగా సేవలు 

బుల్డోజర్‌ ఓ ‘అవసరం’ 

 హిందువుల నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి 

ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న యోగి

లక్నో: రాజకీయాలు అనేవి తనకు ఫుల్‌టైమ్‌ ఉద్యోగం కాదని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించారు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే తాను కేవలం యోగిని మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. ‘బుల్డోజర్‌ మోడల్‌ను మా ప్రభుత్వం సాధించిన ఘనతగా చూడటం లేదు. అదొక అవసరం. సమాజహితం కోసం దాన్ని మెరుగైన విధానంలో వాడొచ్చని మేం చూపించాం’’ అన్నారు. మంగళవారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై యోగి సుదీర్ఘంగా మాట్లాడారు. 

అగ్రనేతలతో విభేదాల్లేవు 
‘‘బీజేపీ అగ్రనేతలతో నిజంగా విభేదాలే ఉంటే ఇంకా సీఎంగా కొనసాగగలనా? అవన్నీ వదంతులే. నా రాజకీయ జీవితానికి పరిమితి ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు నాకుంది. నన్నే కాదు, దేశం కోసం పరిశ్రమించే ప్రతి ఒక్కరినీ ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుండి ప్రోత్సహిస్తుంది. సరైన పథంలో లేని వాళ్లలోనూ స్ఫూర్తి నింపి సన్మార్గం వైపు నడిపిస్తుంది. బీజేపీ ఆదేశానుసారం యూపీ ప్రజలకు సేవ చేస్తున్నా’’ అని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో దిగిపోతారని, భావి ప్రధాని అవకాశాలు యోగికే ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘‘రాజకీయాలు నాకు ఫుల్‌టైమ్‌ జాబ్‌ కాదు. నేనొక యోగిని మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ నాకు పాపులారిటీ పెరగడానికి వేరే కారణం ఉందనుకుంటున్నా. యాత్రల్లో భాగంగా దేశవ్యాప్తంగా భక్తులు యూపీని సందర్శిస్తున్నారు. 2017 తర్వాత యూపీలో స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధి వల్ల వారలా భావించి ఉంటారు’’ అన్నారు. 

రాజకీయాలు, మతంపై... 
‘‘ కొంతమంది మాత్రమే రాజకీయాలు చేయాలని, మతానికి సైతం పరిధులు ఉండాలని భావించినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. స్వార్థం కోసం రాజకీయాలను వాడుకుంటే సమస్యలొస్తాయి. అందరి మంచి కోసం రాజకీయాలు చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. సమస్యకు, పరిష్కారానికి మధ్య ఎటువైపు నిల్చోవాలనేదే మతం మనకు బోధిస్తుంది’’ అని అన్నారు. 

మీరు రాజకీయనేత అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా లేదంటే మతానికి సంబంధించిన ప్రతినిధి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? అని ప్రశ్నించగా.. ‘పౌరుడిగా పనిచేసేందుకు ఇష్టపడతా. పౌరునిగా రాజ్యాంగబద్ధ కర్తవ్యమే నాకు ముఖ్యం. నా వరకు దేశమే అత్యున్నతం. దేశం బాగుంటే నా మతం కూడా బాగుంటుంది. మతం సురక్షితంగా ఉంటే సంక్షేమ మార్గం దానంతట అదే తెరుచుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో ముస్లింలపై... 
‘‘రాష్ట్ర అభివృద్ధిలో ముస్లింలకు తగు ప్రాతినిధ్యం లభిస్తుంది. మైనారిటీలు అయినంత మాత్రాన ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు అంటూ ఏమీ ఉండవు. పాదచారులు రోడ్ల పక్కన నడవాలి. అంతేగానీ రోడ్లపై నమాజ్‌ చేస్తామంటే కుదరదు. రహదారులపై ట్రాఫిక్‌ అంతరాయం కల్గించడం చట్టప్రకారం నేరం. అయినాసరే అలాగే చేస్తామంటే అందుకు తగ్గ పరిణామాలను ‘బుల్డోజర్‌ న్యాయం’ రూపంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్లు హిందువులను చూసి నేర్చుకోండి. మహాకుంభమేళా వేళ ప్రయాగ్‌రాజ్‌కు 60 కోట్ల మంది హిందువులు వచ్చారు. దొంగతనం, విధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్‌ ఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. దీనినే మత క్రమశిక్షణ అంటారు. దీన్ని హిందువుల నుంచి ఇతరులు కూడా నేర్చుకోవాలి’’ అని ముస్లింలనుద్దేశించి యోగి అన్నారు.

ఆలయాల దాతృత్వం, సేవా కార్యక్రమాలపై.. 
‘‘విద్య, ఆరోగ్యానికి సంబంధించిన అందరికీ సమానంగా ఆలయాలు, మఠాలు దాతృత్వ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆలయాలతో పోలిస్తే అత్యధిక ఆస్తులున్న వక్ఫ్‌ బోర్డులు ఏనాడైనా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయా?. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం తప్ప’’ అని యోగి అన్నారు. ‘‘ నూతన నిర్మాణాలు, పాత ఆక్రమణలను తొలగించడంతోపాటు బుల్డోజర్‌ను మా ప్రభుత్వం ‘మెరుగైన రీతి’లో వాడింది. మా సద్వినియోగాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలో మెచ్చుకుంది’’ అని వ్యాఖ్యానించారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Yogi Adityanath
Interview
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

కల నిజమాయెగా..!

కల నిజమాయెగా..!

254 బల్లులు తిన్న.. పోతానేమో అనుకొని రాత్రంతా పడుకోలేదు

254 బల్లులు తిన్న.. పోతానేమో అనుకొని రాత్రంతా పడుకోలేదు

అఖిలేష్‌ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి

అఖిలేష్‌ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి

ఆమె ప్రశ్నిస్తే ట్రంప్‌కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!

ఆమె ప్రశ్నిస్తే ట్రంప్‌కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.