Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. డెలివరీ డేట్‌ను ప్లాన్‌ చేసుకుంటే పుట్టే పిల్లలకు లుకేమియా ముప్పు
ADVERTISEMENT 

డెలివరీ డేట్‌ను ప్లాన్‌ చేసుకుంటే పుట్టే పిల్లలకు లుకేమియా ముప్పు

National Sakshi User Sakshi Sakshi Time Jul 8, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
luke.jpg

కొత్త అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: తల్లీబిడ్డను కాపాడేందుకు అప్పటికప్పుడు చేసే సీ–సెక్షన్‌(కోత) ఆపరేషన్‌తో పోలిస్తే ముందస్తుగా ఒక తేదీ అనుకుని ప్లాన్‌చేసి ఆపరేషన్‌ చేయించిన సందర్భాల్లో పుట్టిన చిన్నారులకు రక్త క్యాన్సర్‌ (లుకేమియా) ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. బిడ్డ డెలివరీ సాధ్యంకాక ప్రసవవేదనతో ఇబ్బందిపడుతున్న గర్భిణికి మాత్రమే గతంలో సీ–సెక్షన్‌ విధానంలో కోతపెట్టి ఆపరేషన్‌ చేసేవారు.

 తదనంతరకాలంలో మంచిరోజు చూసుకుని, మరికొందరు తమకు వీలున్నప్పుడు, మరికొందరు సెలవుతేదీ ఇలా వేర్వేరు కారణాలతో డెలివరీ తేదీని ప్లాన్‌చేసుకునే ధోరణి ఎక్కువైంది. ఇలా ప్లాన్డ్‌ సిజేరియన్‌ సెక్షన్‌ ఆపరేషన్‌ ద్వారా పుట్టిన చిన్నారులు భవిష్యత్తులో లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు చెప్పారు. 

సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘ది ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌’లో ప్రచురితమయ్యాయి. స్వీడన్‌లో మెడికల్‌ బర్త్‌ రిజిస్ట్రర్‌ గణాంకాల ద్వారా సేకరించిన 1982–89, 1999–2015 కాలాల్లో జన్మించిన 25 లక్షల మంది చిన్నారుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించి ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. వీరిలో 3.75 లక్షల మంది అంటే 15.5 శాతం మంది సీ–సెక్షన్‌ ద్వారా జన్మించారు. వీరిలో 1,495 మందికి లుకేమియా వ్యాధి సోకింది. 

సహజ ప్రసవం ద్వారా పుట్టిన చిన్నారులతో పోలిస్తే సీ–సెక్షన్‌ ద్వారా జన్మించిన పిల్లల్లో అత్యత తీవ్రమైన లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని  కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకురాలు, ఈ పరిశోధనలో కీలక రచయిత క్రిస్టినా ఇమోర్ఫియా క్యాంపిస్టీ చెప్పారు. సహజ ప్రసవ సమయంలో ఒక్కోసారి ఉమ్మనీరు సంచి పగలిపోయి శిశువు బయటికొచ్చే వేళ యోని బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఈ బ్యాక్టీరియా సోకడం పుట్టినబిడ్డకు ఎంతో మంచిదని సైన్స్‌ చెబుతోంది. తొలినాళ్లలోనే బ్యాక్టీరియా సోకడంతో భవిష్యత్తులో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య తేడాలను గుర్తించడం, భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్‌ వంటి సమస్యలు రావని, చిన్నారుల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయి. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Leukemia disease
Delivery Date
pregnant woman
cesarean delivery
International Journals
childbirth
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మృతురాలి కడుపులో కత్తెర!

మృతురాలి కడుపులో కత్తెర!

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన డాక్టర్ శిరీష

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన డాక్టర్ శిరీష

నర్సు వైద్యం..తల్లీ శిశువు మృతి

నర్సు వైద్యం..తల్లీ శిశువు మృతి

పోషకాహార ప్యాకెట్‌లో పాము 

పోషకాహార ప్యాకెట్‌లో పాము 

ప్రెగ్నెంట్‌ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త

ప్రెగ్నెంట్‌ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త

యువతలో పక్షవాతం ముప్పు 

యువతలో పక్షవాతం ముప్పు 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.