updates:
-
ప్రతినేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడారు.ఈరోజు తెల్లవారుజామున, వయనాడ్ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మందికి పైగా మరణించారు. ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
-
ప్రమాదం స్థాయిని అంచనా వేయడానికి రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. మరణించిన వారికి తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ పరిహారాన్ని కూడా పెంచండి.
-
రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా సహాయాన్ని అందించండి. బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయండి. పశ్చిమ కనుమల్లో గత కొన్నిఏళ్లుగా కొండచరియలు విరిగిపడటం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.
- వయనాడ్ విలయంపై పార్లమెంట్లో కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటన
- ప్రధాని మోదీ కేరళ సీఎం విజయన్ మాట్లాడారు.
- కేంద్ర అండగా ఉంటుందని భోరోసా ఇచ్చారు.
- కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తోంది.
- ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయి
-
ఘటానాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం.
#WATCH | Wayanad landslide: In Rajya Sabha, Union Minister JP Nadda says, "Discussions began here and all the Members expressed their concern over the massive tragedy that has occurred there. I would like to say this is a tragedy of not just Kerala alone, but the entire nation is… pic.twitter.com/xgDNA73S9R
— ANI (@ANI) July 30, 2024
-
Live: Parliament Session: Congress gives Adjournment Motion notice in Lok Sabha on Wayanad landslides
LIVE @ANI | https://t.co/n7jkluCMdz#ParliamentSession #WayanadLandslide #Congress pic.twitter.com/H5m6K2ly28— ANI Digital (@ani_digital) July 30, 2024
- వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తుపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది
-
జనగణన ఆలస్యంపై చర్చ జరపాలని లోక్‌భలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు.
-
జన గణన ఆలస్యం వల్ల మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ నోటీసులో పేర్కొంది.
-
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
-
సరిహద్దు పరిస్థితి, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని కోరారు.
Congress MP Manish Tewari gives Adjournment Motion notice in Lok Sabha, 'to have a discussion on the border situation and the huge trade deficit with China'. pic.twitter.com/Hh08uiwp8Y
— ANI (@ANI) July 30, 2024
-
ఇవాళ లోక్ సభలో బడ్జెట్‌పై చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు.