పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.
పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్
రాజ్యసభ రేపటికి వాయిదా
-
రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం
-
సభలో మళ్లీ గంగదగోళం
-
రేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్
లోక్‌సభ రేపటికి వాయిదా
-
లోక్‌సభ సమావేశాలు తిరిగి ప్రారంభం
-
సభలో గందరగోళం.. రేపటికి వాయిదా
-
కాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలు
-
యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చ
వాయిదాల పర్వం
- లోక్‌సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా
- 3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభ
- ఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన
- రాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదా
ఓం బిర్లా కీలక ప్రకటన
- లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు
- విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రం
- చర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదా
- మధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్‌సభ
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన
- బిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.
- మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.
- చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.
పేపర్ లీక్‌కు భారీ శిక్షలు
- యాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలు
- పేపర్ లీక్‌లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.
- జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.
విద్యార్థుల లాఠీఛార్జిపై రగడ
- పోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.
- నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.
- సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.
సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యం
- లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు
- స్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు
- బిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన
- విద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.
- పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.
- విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.
- పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.
లోక్‌సభ సైతం వాయిదా
-
మధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదా
-
విపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రం
-
విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చ
-
లోక్‌సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదా
రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా
-
వాయిదా తర్వాత కూడా మారని సీన్
-
పెద్దల సభలో విపక్షాల నిరసన గళం
-
ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్
-
మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలు
-
లోక్‌సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన
-
విపక్షాల నిరసనల నడుమే లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు
-
బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్
నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్
- నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు
- తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్
- ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
- “మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.
- బిహార్‌లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.
- విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.
ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు
- నీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.
- ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.
- రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.
- భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.
- ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
- నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్
- పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
- పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన
- ప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్
- విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటే
- ఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారు
- ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే
स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2
— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026
बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!
सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026
జంతర్ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
- ఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.
- విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం
- ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరం
- శాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.
- నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలి
- నిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.
- విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.
ఉభయ సభలు వాయిదా!
-
ఆరో రోజు అదే తీరు
-
నీట్‌పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
-
ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదా
ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు
-
లోక్‌సభలో విపక్ష ఎంపీల ఆందోళన
-
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచన
-
లాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు
పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలు
- పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలు
- పార్లమెంట్‌కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలు
- కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలు
- నీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్
ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానం
-
పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం
-
విద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసు
-
జంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగం
-
చలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలు
-
తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్
-
అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ
-
విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేత
పరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!
- నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చ
- బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్
- బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం
- బీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభం
- బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగం
- టీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలు
- జేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారు
- శివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగం
- అప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారు
- ఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశం
- ఎన్సీపీ తరఫున సునీల్ తట్కరే
- తృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశం
- పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యం
- బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తి
సభ.. సజావుగా సాగేనా?
-
సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టి
-
గతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్
-
కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలు
-
నీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం
-
అయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువత
-
ఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ
-
నేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు
-
కాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశం
-
యువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలు
-
దాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ
బిల్లులో కీలక ప్రతిపాదనలు
- పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.
- లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.
- నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.
- వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.
- ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
- కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.
ఎన్డీయే వ్యూహం ఏంటి?
- పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.
- యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.
- బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.
- టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.
విపక్షాల వ్యూహం ఏమిటి?
- బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.
- పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.
- జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
- ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరం
- నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
- ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.
- కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.
- నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
10 గంటల పాటు చర్చ
- బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.
- దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.
- అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.
36 రోజుల ఉద్యమం తర్వాత..
- నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.
- విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
- పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది.