Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌.. 'పంచ'నామా
ADVERTISEMENT 

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌.. 'పంచ'నామా

National Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fuel.jpg

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు.. ఇటు మారుతి సుజుకి ఓ కారును మార్కెట్లోకి తెస్తే.. అటు హీరో కంపెనీ బైక్‌లను దించింది. ఇదే సమయంలో ఢిల్లీలో ఈ85 పెట్రోలు బంకు కూడా ప్రారంభమైంది. ఈ పరిణామాలను ఇథనాల్‌ ఆధారిత రవాణా వ్యవస్థ దిశగా మన దేశం వేసిన ఓ కీలక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ టెక్నాలజీ ఏమిటి? ఇది ప్రాచుర్యం పొందుతుందా? ఉన్న సమస్యలు ఏమిటి? వంటి వివరాలు మీ కోసం..  

అసలు ఏంటివి? 
పెట్రోలులో ఎంత శాతం ఇథనాల్‌ కలిపినా నడిచేలా రూపొందించినవే ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు. మన దేశం విషయానికొస్తే.. ఇంజన్‌కు ఎలాంటి నష్టం చేయకుండా.. ఈ20–ఈ100 ఇంధన మిశ్రమంతో ఇవి నడుస్తాయి. అయితే, ఇథనాల్‌ లోహాన్ని కరిగించే లేదా తినేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజిన్‌కు నష్టం జరగకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేక సెన్సర్లు, ఇథనాల్‌ నిరోధక ఇంధన పైపులు, సీల్స్‌ను అమరుస్తారు. వాస్తవానికి ఈ సాంకేతికత కొత్తది కాదు. 2000ల ప్రారంభంలోనే ఫోక్స్‌వ్యాగన్‌ వీటిని బ్రెజిల్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పుడక్కడ అమ్ముడయ్యే వాహనాల్లో 80 శాతం ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలే కావడం గమనార్హం.  

ప్రజల నుంచి ఆదరణ ఉంటుందా? 
ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ85 ఇంధనం పెట్రోలుతో పోలిస్తే.. లీటరుకు సుమారు రూ.20 తక్కువకు వస్తోంది. అయితే, ఈ వాహనాల తయారీ వ్యయం అధికంగా ఉండటం వల్ల అమ్మకపు ధరలు కూడా ఎక్కువగా ఉండటం.. ఇథనాల్‌ మిశ్రమం పెరిగే కొద్దీ మైలేజ్‌ కొంతమేర తగ్గే అవకాశమున్నందున ఈ అంశాల ప్రభావం వినియోగదారులపై పడే అవకాశముంది. ఈ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు అంశంపై చర్చలు జరిగినప్పటికీ కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల పన్ను రాయితీలతోపాటు ఇథనాల్‌ మిశ్రమ ఇంధన ధరను కూడా మరింత తగ్గించే దిశగా ప్రోత్సాహకాలు అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  

మార్కెట్‌ పరిస్థితి ఏమిటి? 
2031–32 నాటికి మొత్తం వాహనాల అమ్మకాల్లో ఫ్లెక్స్‌ ఫ్యూయల్, హైబ్రిడ్‌ వాహనాలు కలిపి 5 శాతం వాటాను దక్కించుకుంటాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పశ్చిమాసియా పరిణామాలు, ఉద్గారాల నియంత్రణ లక్ష్యాల నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ప్రాధాన్యమిస్తోంది. 

కంపెనీలు ఏమనుకుంటున్నాయి? 
ప్రస్తుతం హీరో, మారుతి సంస్థలు పరిమిత స్థాయిలోనే వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. వీటి తయారీ వ్యయం ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై స్పష్టత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. అదే సమయంలో ఇథనాల్‌ కలిపిన ఇంధనం తక్కువ ధరలో వస్తున్నప్పటికీ.. ఈ వాహనాల ధరలు ఎక్కువగా ఉండటంతో వీటికి ప్రజల ఆదరణ ఎలా ఉంటుందన్న అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో కంపెనీలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. 

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ సరఫరా తగినంత ఉందా? 
ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యం విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆల్‌ ఇండియా డిస్టిలర్స్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం.. భారత్‌ ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యం 2,000 కోట్ల లీటర్లు. ప్రస్తుతమున్న 20 శాతం ఇథనాల్‌ మిశ్రమ ఇంధన లక్ష్యానికి అవసరమయ్యే పరిమాణం(1,100 కోట్ల లీటర్లు) కంటే ఇది ఎక్కువ. భవిష్యత్తులో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల వినియోగం పెరిగినా.. ఈ మేరకు సరఫరాను పెంచే సామర్థ్యం పరిశ్రమకు ఉందని నిపుణులు చెబుతున్నారు.  

– సాక్షి సెంట్రల్‌ డెస్క్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
fuel
Vehicles
Ethanol
Transportation System
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత్‌లోని E85 బైకులు: ధర, వివరాలు ఇలా..

భారత్‌లోని E85 బైకులు: ధర, వివరాలు ఇలా..

E20తో మైలేజీ తగ్గిందా?: సర్వేలో సంచలన విషయాలు!

E20తో మైలేజీ తగ్గిందా?: సర్వేలో సంచలన విషయాలు!

E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!

E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!

ఈ–20... మనకేంటి?

ఈ–20... మనకేంటి?

త్వరలో ‘ఇంధన అత్యవసర’ ఆంక్షల ఎత్తివేత!

త్వరలో ‘ఇంధన అత్యవసర’ ఆంక్షల ఎత్తివేత!

ఎడారిలో ‘ఫ్యూయల్ రైడర్స్’.. ప్రతీ ట్రిప్ ఓ సవాలే..

ఎడారిలో ‘ఫ్యూయల్ రైడర్స్’.. ప్రతీ ట్రిప్ ఓ సవాలే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.