Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
ADVERTISEMENT 

మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!

National Sakshi User Sakshi Sakshi Time Jan 3, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Operation-Sindoor.jpg

లష్కరే, హిజ్బుల్, జైషే ఉగ్రవాదుల్లో గుబులు..!!
పాకిస్థాన్ ఐఎస్‌పీఆర్ నుంచి హెచ్చరికలంటూ సందేశాలు
అప్రమత్తమవుతున్న ఉగ్రవాద శిబిరాలు

‘ఆపరేషన్ సిందూర్ 2.0’ మార్చినెలలోనే మొదలు కానుందా? కశ్మీరంలో మంచు కరిగి.. ఎండాకాలం మొదలవ్వగానే సైన్యం రంగంలోకి దిగి, ఉగ్రవాదుల పీచమణచనుందా?? ఈ దెబ్బతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు దబిడిదిబిడేనా?? ఈ ప్రశ్నలకు భారత వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకున్నా.. పీవోకేలో లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకుని, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. అటు పీవోకేతోపాటు.. ఇటు జమ్మూకశ్మీర్‌లో పాగావేసుకున్న ఉగ్రవాదులు సైతం ఈ సమాచారంతో బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఉగ్రవాద సంస్థలు ఈ మేరకు లేఖల ద్వారా సమాచారాన్ని అందిపుచ్చుకున్నాయి. రెండు పేజీల సందేశాన్ని ఉగ్రవాద సంస్థలు పరస్పరం అందిపుచ్చుకుంటున్నాయని, అందులో పాకిస్థాన్ నిఘా సంస్థ హెచ్చరికలను ఉటంకిస్తున్నాయని అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.


ఈ లేఖ ద్వారా ఉగ్రవాదులకు సైన్యం ఆపరేషన్, తదుపరి సన్నాహాల గురించి తెలియజేస్తున్నారు. 33 ఏళ్లుగా పరారీలో ఉన్న జహంగీర్ అనే ఉగ్రవాదితో ఇంటర్వ్యూ వివరాలను కూడా ఆ లేఖలో ఉటంకించారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ నెట్‌వర్క్ తరపున పలుమార్లు ఉగ్రవాద గ్రూపులకు హెచ్చరిక లేఖలు వెళ్లాయి. జహంగీర్ ఇంటర్వ్యూకు సంబంధించిన పేజీల ప్రతుల్లో చివరి పేజీ గురించి ప్రస్తావిస్తూ.. భారత సైన్యం సన్నద్ధత గురించి పేర్కొన్న వివరాలు ఉగ్రవాదుల తాజా లేఖలో ఉన్నట్లు తెలిసింది. 

ఢిల్లీ పేలుళ్ల తర్వాత..
ఇటీవలి ఢిల్లీ పేలుళ్ల తర్వాత భారత బలగాలు అప్రమత్తమైనట్లు ఉగ్రవాద మూకలు గుర్తించాయి. దీంతో.. శీతాకాలం ముగిసేలోపే కశ్మీర్‌లో పాగా వేయాలని నిర్ణయించాయి. ఒకవేళ ఈ టాస్క్ తప్పితే.. మార్చిలో భారత సైన్యం ప్రారంభించే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’తో ఇబ్బందులు తప్పవని ఆ లేఖలో హెచ్చరించాయి. ఈలోగానే తమతమ ఉగ్రవాద సంస్థల్లో జోరుగా రిక్రూట్‌మెంట్లు నిర్వహించాలని ఆ లేఖలో తీర్మానించాయి. ‘‘సైన్యం కార్యకలాపాలపై స్థానికులతో నిఘా పెంచాలి. సంస్థలతో సంబంధం లేకుండా.. భారత సైన్యం ప్రణాళికలను అడ్డుకోవాలి. ఢిల్లీ పేలుళ్లు, నౌగామ్‌లో పేలుడుతో పోలీసులు, భారత సైన్యం కసితో ఉన్నాయి. రాటిల్ పవర్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టాయి’’ అని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

కాగా.. రాటిల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు అరెస్టు చేసిన మహమ్మద్ అమీస్ అలియాస్ జహంగీర్ సరూరీ 1992 నుంచి హిజ్బుల్ ముజాహిదీన్ కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను పలు హత్య కేసుల్లో నిందితుడు. గతంలో ‘ద రివల్యూషన్ రీసర్జెన్స్’ అనే మ్యాగజైన్‌లో అతని ఇంటర్వ్యూ ప్రచురితమైనట్లు భారత భద్రతాబలగాలు గుర్తించాయి. ఆ ఇంటర్వ్యూలో జహంగీర్ తాను త్యాగం వైపు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నాడు. 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Operation Sindoor
Jaish e Mohammad
Hizbul Mujhaideen
Lashkar e Taiba
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత్‌ను దెబ్బకొట్టే ప్లాన్‌.. పాక్‌ కొత్త వ్యూహం!

భారత్‌ను దెబ్బకొట్టే ప్లాన్‌.. పాక్‌ కొత్త వ్యూహం!

High Alert In India : యుద్ధంలోకి భారత్

High Alert In India : యుద్ధంలోకి భారత్

భార‌త్‌-పాక్ యుద్దాన్ని నేనే ఆపా.. 11 ఫైట‌ర్ జెట్లు కూలిపోయాయి: ట్రంప్‌

భార‌త్‌-పాక్ యుద్దాన్ని నేనే ఆపా.. 11 ఫైట‌ర్ జెట్లు కూలిపోయాయి: ట్రంప్‌

ఆపరేషన్ సింధూర్‌పై మరో సినిమా.. వివేక్ అగ్నిహోత్రి రియాక్షన్‌ ఇదే..!

ఆపరేషన్ సింధూర్‌పై మరో సినిమా.. వివేక్ అగ్నిహోత్రి రియాక్షన్‌ ఇదే..!

కశ్మీర్‌పై పాక్‌ పన్నాగం.. జైషే ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు

కశ్మీర్‌పై పాక్‌ పన్నాగం.. జైషే ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు

భారత్‌ దెబ్బతో అన్నీ నష్టాలే.. పాక్‌ మంత్రి ఆవేదన

భారత్‌ దెబ్బతో అన్నీ నష్టాలే.. పాక్‌ మంత్రి ఆవేదన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.