Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!
ADVERTISEMENT 

ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!

National Sakshi User Sakshi Sakshi Time Dec 18, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Jamili_Bill_JPC_Details.jpg

దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్‌సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.

శుక్రవారంతో పార్లమెంట్‌ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది.  జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు. 

ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్‌ ఛాంబర్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్‌ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్‌ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్‌లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

కాంగ్రెస్‌ తిరస్కరణ
మంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్‌ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్‌ ఓటింగ్‌ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్‌ ఓటింగ్‌ అనివార్యమైంది. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్‌ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.

జేపీసీకి డెడ్‌లైన్‌ ఉంటుందా?
జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.

జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్‌లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్‌ 83, ఆర్టికల్‌ 85, ఆర్టికల్‌ 172, ఆర్టికల్‌ 174, ఆర్టికల్‌ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.

ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్‌ !! 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
jamili elections
One Nation One Election
Joint Parliamentary Committee
Om Birla
NDA
Indian National Developmental Inclusive Alliance(INDIA)
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

పొలిటికల్‌ హైడ్రామా.. హోటల్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్‌డౌన్!

పొలిటికల్‌ హైడ్రామా.. హోటల్‌లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్‌డౌన్!

ఇరు వర్గాల వాదనలు విన్నాకే..

ఇరు వర్గాల వాదనలు విన్నాకే..

ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం: కుండబద్దలుకొట్టిన టీఎంసీ రెబల్ ఎంపీ

ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం: కుండబద్దలుకొట్టిన టీఎంసీ రెబల్ ఎంపీ

ఉద్ధవ్ సేనలో కలకలం.. ఏడుగురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై?

ఉద్ధవ్ సేనలో కలకలం.. ఏడుగురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.