Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. జమిలి ఎన్నికలకు 2 దశల వ్యూహం 
ADVERTISEMENT 

జమిలి ఎన్నికలకు 2 దశల వ్యూహం 

National Sakshi User Sakshi Sakshi Time Jun 2, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
one-na.jpg

తొలివిడతగా 2029లో లోక్‌సభతో పాటు 20 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్‌ 

2034 నాటికి దేశవ్యాప్తంగా ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ పూర్తికి ప్రణాళిక 

పలు అసెంబ్లీల పదవీకాలం పెంపు, కుదింపు 

2026 వర్షాకాల సమావేశాలకు నివేదిక సమర్పించనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకే దేశం–ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సురక్షిత మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని భారీగా కుదించడం లేదా పదేపదే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తకుండా సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రెండు దశల విధానంపై కసరత్తు చేస్తోంది. 2029, 2034 సంవత్సరాల్లో రెండు విడతలుగా దీన్ని అమలు చేసి, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమంచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

2029లో తొలిసారి.. 2034 నాటికి పూర్తిస్థాయిలో.. 
జమిలీ ఎన్నికల చట్రంలోకి అన్ని రాష్ట్రాలను తీసుకురావడానికి రెండు దశలవారీగా ముందుకు సాగడం అత్యంత ఆచరణాత్మకమని జేపీసీ భావిస్తోంది. తొలి దశలో భాగంగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే సుమారు 20 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2029 నుంచి ఉమ్మడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, 2034 నాటికి దేశమంతటా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. 

రాష్ట్రాల పదవీకాలంపై ప్రభావం 
20 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలంపై పడే ప్రభావంపై అంచనాలు రూపొందించారు. 2028లో ఎన్నికల చక్రం ఉన్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ఐదు నెలల నుంచి ఏడాది పాటు పెంచాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల చక్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల కాలపరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. 2030–31లో ఎన్నికలు జరగాల్సిన బిహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశి్చమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ఒకటి నుంచి రెండేళ్లు తగ్గే ఆస్కారం ఉంది. 

రాజ్యాంగంలో వెసులుబాటు 
జమిలి ఎన్నికలను దశలవారీగా అమలు చేయడానికి రాజ్యాంగపరమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి ముగియకముందే ఎన్నికలు నిర్వహించవచ్చని, కొన్నింటిలో కాలపరిమితిని పొడిగించే వెసులుబాటు ఉందని నిపుణులు పేర్కొన్నారు. గతంలోనూ ప్రత్యేక పరిస్థితుల్లో లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితిలో మార్పులు జరిగాయని గుర్తుచేశారు. ఇంతటి భారీ మార్పునకు చట్టపరమైన నిబంధనలతో పాటు రాజకీ య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. 

1967 వరకు ఒకేసారి పోలింగ్‌.. 
దేశంలో 1952 నుంచి 1967 వరకు నాలుగుసార్లు లోక్‌సభకు, మెజారిటీ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం మొదలైంది. 1968–69 మధ్య అనేక అసెంబ్లీలు రద్దు కాగా, 1970లో లోక్‌సభ కాలపరిమితి ముగియకముందే రద్దయింది. దీంతో జమిలీ ఎన్నికల తంతుకు తొలిసారిగా బ్రేక్‌ పడింది. 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరగడంతో రాష్ట్రాల్లో ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన, ముందస్తు ఎన్నికల కారణంగా ఈ అంతరం మరింత పెరిగింది. 

జమిలిపై వాదోపవాదనలు 
జమిలి ఎన్నికల విధానంపై అనుకూల, ప్రతికూల వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులు ప్రభావితం కాకుండా ఉంటాయని జమిలీ ఎన్నికలను సమరి్థంచేవారు వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పరిపాలనా యంత్రాంగం వెచ్చించే భారీ సమయం, ఖర్చు ఆదా అవుతాయని వారు పేర్కొంటున్నారు. శాసనసభల కాలపరిమితిని తగ్గించడం లేదా పెంచడం వల్ల ప్రజా తీర్పు, సమాఖ్య నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందన్నది జమిలి ఎన్నికలను వ్యతిరేకించేవాళ్లు వాదిస్తున్నారు. జాతీయ స్థాయి ప్రభంజనంలో స్థానిక, ప్రాంతీయ సమస్యలు మరుగున పడిపోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

7 దేశాల విధానాలపై కోవింద్‌ ప్యానెల్‌ అధ్యయనం 
జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన 2023 సెపె్టంబర్‌ 2న ప్యానెల్‌ ఏర్పాటైంది. ఈ కమిటీ నివేదిక తయారు చేయడానికి ముందు ఏడు దేశాల ఎన్నికల ప్రక్రియలను అధ్య యనం చేసింది. నిపుణులతో చర్చలు, 191 రోజుల పరిశోధనల అనంతరం కోవింద్‌ కమిటీ తన నివేదికను మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ప్రస్తుతం ఈ నివేదికను అధ్యయనం చేస్తున్న జేపీసీ తన నివేదికను 2026 వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు నాటికి సమర్పించాల్సి ఉంటుంది. నివేదిక అందిన తర్వాత పార్లమెంటులో తదుపరి చర్చ, ఓటింగ్‌ జరుగుతాయి.  
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
One Nation One Election
jamili elections
Central Government
Joint Parliamentary Committee
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నేడే నీట్‌ రీఎగ్జామ్‌

నేడే నీట్‌ రీఎగ్జామ్‌

టెలిగ్రామ్‌పై నిషేధం సబబే

టెలిగ్రామ్‌పై నిషేధం సబబే

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఆ కేంద్రమంత్రి ఎవరో చెప్పండి.. సీఎంకి కిషన్‌రెడ్డి సవాల్‌

ఆ కేంద్రమంత్రి ఎవరో చెప్పండి.. సీఎంకి కిషన్‌రెడ్డి సవాల్‌

టెలిగ్రామ్‌పై 22 వరకు ఆంక్షలు

టెలిగ్రామ్‌పై 22 వరకు ఆంక్షలు

దగ్గు మందు విక్రయాలకు బ్రేక్‌

దగ్గు మందు విక్రయాలకు బ్రేక్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.