Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. చెట్ల‌కు సెల్‌ఫోన్లు క‌డుతున్నారు.. ఎందుకంటే?
ADVERTISEMENT 

చెట్ల‌కు సెల్‌ఫోన్లు క‌డుతున్నారు.. ఎందుకంటే?

National Sakshi User Sakshi Sakshi Time Oct 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tie-phones-to-tree.jpg

ఆ ఊర్లో చెట్ల‌కు సెల్‌ఫోన్లు కాస్తాయి.. ఏంటి వింత‌గా అనిపించిందా! ఇందులో కొంచెం చేంజ్‌.. ఆ ఊర్లో చెట్ల‌కు సెల్‌ఫోన్లు క‌డ‌తారు. ఇలా ఎందుకు చేస్తార‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఓటీపీ కోసం అని చెబితే న‌మ్ముతారా? అవును ఇది అక్ష‌రాలా నిజం. ఓటీపీ కోసం ఆ ఊరి ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతం. అంత‌గా ఎందుకు క‌ష్ట‌ప‌డుతున్నారంటే ప్ర‌భుత్వం ఇచ్చే ఆర్థిక‌ స‌హాయం కోసం. ఇంత‌కీ ఆ గ్రామం ఎక్క‌డుందో తెలుసుకుందాం ప‌దండి.

అరగంట నడిచి కొండ‌పైకి ఎక్కుతారు. త‌ర్వాత సెల్‌ఫోన్ల‌ను చెట్ల‌కు క‌ట్టేసి దానికి వ‌చ్చే ఓటీపీ కోసం ఎండ‌లో ఎదురు చూస్తుంటారు. మహారాష్ట్రలోని ధడ్గావ్ తాలూకా ఖార్డే ఖుర్ద్ గ్రామంలోని (Kharde Khurd village) మ‌హిళ‌ల‌కు ఈ తంతు నిత్య‌కృత్యంగా మారింది. సెల్‌ఫోన్‌లో వ‌చ్చే ఒకే ఒక సిగ్నల్ బార్ కోసం మ‌రాఠా మ‌హిళ‌లు క‌ళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్రలోని చాలా గిరిజన ప్రాంతాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.

లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ. 1,500 ఇస్తామ‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. లబ్ధిదారులు రెండు నెల‌ల్లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాల‌ని గ‌డువు విధించింది. దీంతో మ‌హిళ‌లు కేవైసీ పూర్తి చేయ‌డం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మారుమూల‌ గిరిజ‌న ప్రాంతాల్లో సెల్‌ఫోన్ సిగ్న‌ల్ (Cell Phone Signal) లేక క‌ష్టాలు ప‌డాల్సివ‌స్తోంది. రోజంతా క‌ష్ట‌ప‌డినా వంద మందిలో న‌లుగురైదురికి మాత్ర‌మే కేవైసీ పూర్త‌వుతోంది.

మ‌హిళ‌ల అవ‌స్థ‌లు
ఖార్డే ఖుర్ద్ గ్రామ మ‌హిళ‌ల‌కు ఉల్గులన్ ఫౌండేషన్ అనే ఎన్జీవో స‌హాయం చేస్తోంది. ద‌గ్గ‌ర‌లోని కొండగుట్ట‌పై శిబిరం ఏర్పాటు చేసి కేవైసీ చేయిస్తోంది. "మేము ఇక్కడ ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మొబైల్ డేటాను పట్టుకునే ఏకైక ప్రదేశం ఇదే" అని ఉల్గులన్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు రాకేష్ పవారా అన్నారు. అలాగే కొండ‌పైకి చేరుకోవ‌డానికి మ‌హిళ‌లు అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. మ‌రోవైపు కేవైసీ పూర్తి చేసిన అర్హులైన‌ మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే లడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) ఆర్థిక స‌హాయం అందుతుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

ఇబ్బందులు ఉన్నాయి.. కానీ
ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిందేనని, ఇందులో మ‌రో మాట‌కు తావులేద‌ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. పుణేలో ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ.. "ధృవీకరించబడిన లబ్ధిదారులకు మాత్రమే ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక స‌హాయం అందుతుంది. కేవైసీ న‌మోదులో ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు, కానీ ప్రత్యామ్నాయం లేదు. అవసరమైతే గడువును పొడిగించవచ్చు, కానీ పూర్తి చేయడం తప్పనిసర''ని పేర్కొన్నారు.

బలహీనంగా కనెక్టివిటీ
ప్ర‌భుత్వం విధించిన గ‌డువు న‌వంబ‌ర్ 15తో ముగుస్తుంది. అయితే ఇంటర్నెట్ నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య కార‌ణంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ పూర్తిచేయ‌డం అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ధడ్గావ్ తాలూకా తహసీల్దార్ జ్ఞానేశ్వర్ సప్కలే కూడా దీన్ని ఒప్పుకున్నారు. "మొబైల్ టవర్లు నాలుగైదు నెలల క్రితం వచ్చాయి. కానీ కనెక్టివిటీ ఇప్పటికీ బలహీనంగా ఉంది. సమస్యను పరిష్కరించమని ఆపరేటర్లను కోరాము. సాధారణ సేవా కేంద్రాలు, ఆధార్ ఆపరేటర్ల ద్వారా మహిళలకు సహాయం చేస్తున్నాము" అని ఆయన అన్నారు.

చ‌ద‌వండి: ఖరీదైన స్టంట్‌.. ట్విస్ట్ అదిరింది! 

స‌మ‌స్య‌ను ప‌రిష్కారిస్తాం
లడ్కీ బహిన్ యోజన కింద మ‌హిళ‌ల‌కు సెప్టెంబ‌ర్‌లో ఆర్థిక స‌హాయం చేశామ‌ని, ల‌బ్ధిదారులు మ‌రో రెండు నెల‌ల్లోపు ఈ- కేవైసీ పూర్తి చేయాల‌ని మ‌హారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి అదితి తత్కరే (Aditi Tatkare) ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇంటెర్నెట్‌, ఆధార్ స‌మ‌స్య‌ల‌తో కేవైసీ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని మ‌హిళ‌లు వాపోతున్నారు. సేవా కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిర‌గాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఓటీపీ, డేటా సమస్యలను పరిష్కరించడానికి తన విభాగం కృషి చేస్తోందని తత్కరే హామీ ఇచ్చారు. లడ్కి బహిన్ యోజన కింద 2.5 కోట్లకు పైగా మహిళలు నమోదు చేసుకున్నారని తెలిపారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Maharashtra
tribal villages
e-KYC
Ajit Pawar
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.