Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఇరు వర్గాల వాదనలు విన్నాకే..
ADVERTISEMENT 

ఇరు వర్గాల వాదనలు విన్నాకే..

National Sakshi User Sakshi Sakshi Time Jun 17, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tmc.jpg

 ‘టీఎంసీ’పై స్పీకర్‌ తుది నిర్ణయం

తమ వర్గానికి గుర్తింపు కోరుతున్న టీఎంసీ రెబల్స్‌ 

అభిషేక్‌ బెనర్జీకి ఆహ్వానం పంపిన ఓం బిర్లా 

ధ్రువీకరించిన మమత వర్గం ఎంపీ కీర్తి ఆజాద్‌

న్యూఢిల్లీ: టీఎంసీ తిరుగుబాటు వర్గానికి గుర్తింపు విషయంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మమతా బెనర్జీ సారథ్యంలోని ఎంపీల వాదనలు కూడా వినే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇరుపక్షాల వాదన­ల­తోపాటు, న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్నాకే ఆయన అంతిమ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం టీఎంసీ మమత వర్గం నేత అభిషేక్‌ బెనర్జీకి కబురు పంపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ ధ్రువీకరించారు. 

సాయంత్రం 4 గంటలకు తన కా­ర్యా­లయానికి రావాలంటూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్పీకర్‌ ఓం బిర్లా మె­యి­ల్‌ పంపించారని ఆజాద్‌ వివరించారు. అయి­తే, అభిషేక్‌ ఆ సమయంలో ఈడీ కార్యాలయంలో ఉన్నారని, అధికారుల విచారణ పూర్త­య్యేసరికి అర్ధరాత్రి కావచ్చని ఆజాద్‌ అన్నా­రు. దీంతో, స్పీకర్‌ను అభిషేక్‌ కలిసే అవకా­శం లేకుండా పోయిందన్నారు. రెండు రోజుల క్రితం టీఎంసీ తిరుగుబాటు ఎంపీలంతా నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీపీఐ)లో చేరుతున్నట్లు ప్రకటించడం తెల్సిందే. అయితే, వీరంతా తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. టీఎంసీ రెబల్స్‌ వినతిపై స్పీకర్‌ సానుకూలంగా స్పందించిన పక్షంలో లోక్‌సభలో రెండో అతిపెద్ద ఎన్డీయే పక్షంగా ఈ వర్గం అవతరించనుంది. లోక్‌సభలో స్పీకర్‌ మినహాయిస్తే బీజేపీ బలం 239 కాగా, టీడీపీకి 16, జేడీయూకి 12 మంది సభ్యుల బలముంది.  

మా బలం 22కు చేరుకోవచ్చు 
తమ వర్గం ఎంపీలందరినీ చేర్చుకునేందుకు ఎన్‌సీపీఐ అంగీకరించిందని టీఎంసీ తిరుగుబాటు వర్గం నేతల్లో ఒకరైన కాకోలీ ఘోష్‌ దస్తీదార్‌ తెలిపారు. తమ వర్గంలోని ఎంపీల సంఖ్య ప్రస్తుతమున్న 20 నుంచి 22 వరకు పెరగొచ్చని ఆమె వెల్లడించారు. లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలున్నారు. ‘మేమంతా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సారథ్యంలోని ఎన్డీయేతో కలిసి పనిచేస్తాం’అని పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌ వద్ద మీడియాకు తెలిపారు. అదేవిధంగా, బెంగాల్‌లో టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. 

‘వారంతా వేరు గ్రూపు, వాళ్ల అజెండా, అంశాలు వేరే. మాకు సంబంధం లేదు’అని కాకోలీ ఘోష్‌ చెప్పారు. ఎన్‌సీపీఐతో విలీనం మొదటి దశ పూర్తయిందని టీఎంసీ తిరుగుబాటు వర్గంలోని సుదీప్‌ బందోపాధ్యాయ్‌ తెలిపారు. జూలైలో పార్లమెంట్‌ సమావేశాలకు ముందుగానే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. టీఎంసీ గుర్తులు, ఆస్తులు, ఇతర సంస్థాగత అంశాలపై వివాదాలను కోర్టులోనే తేల్చుకుంటామని సుదీప్‌ తెలిపారు. కాగా, పారీ్టలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ఎన్‌సీపీఐ తమకు నివేదించాల్సిన అవసరముందని ఎన్నికల కమిషన్‌ అధికారి ఒకరు తెలిపారు. 

ఎన్‌సీపీఐ సారథిగా జ్యోతిప్రకాశ్‌ చటర్జీ 
లోక్‌సభలో టీఎంసీ తిరుగుబాటు వర్గం చేరికతో ఒక్కసారిగా దేశ రాజకీయక యవనికపై తళుక్కుమన్న నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీపీఐ)కు నూతన సారథిగా జ్యోతిప్రకాశ్‌ చటర్జీ నియమితులయ్యారు. ఇటీ­వల కాకోలీ ఘోష్‌ దస్తీదార్‌ సారథ్యంలోని టీఎంసీ ఎంపీలు ఎన్‌సీపీఐలో చేరారు. అనంతర పరిణామాల్లో ఆ పార్టీ వ్యవస్థాపకురాలైన షెవ్లీ కుందు బాధ్యతల నుంచి తప్పు­కుంటున్నట్లు ప్రకటించారు. దీంతో, కాకోలీ ఘోష్‌ దస్తీదార్‌ ఆ బాధ్యతలను చేపడతారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కా­కోలీ ఘోష్‌ దస్తీదార్‌ మంగళవారం ఒక ప్రక­టన చేశారు. 

ఎన్‌సీపీఐ నూతన సారథిగా జ్యోతి ప్రకాశ్‌ నియమితులైనట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఎన్‌సీపీఐ మాదిరిగానే ఈ జ్యోతిప్రకాశ్‌ పేరు కూడా ఎవరికీ అంత­గా తెలియకపోవడం విశేషం. ఎన్‌సీపీఐ జాతీ­య ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా చెప్పుకుంటున్న శంతను దేవ్‌ ఈ పరిణామంపై స్పందించారు. జ్యోతిప్రకాశ్‌ చటర్జీ ఎవరూ తనకు తెలియదంటూ బాంబు పేల్చారు. ఎన్‌సీపీఐ కోసం ఎంతో కష్టపడ్డాం, ఇప్పుడు తమ పారీ్టలో ఏం జరుగుతోందో అర్థం కావడం లే­ద­ని వ్యాఖ్యానించారు. పెద్ద నేతలెందరో మా పారీ్టలో చేరడం సంతోషంగా ఉంది. అయితే, వీరెవరూ తమను సంప్రదించలేదన్నారు.

అఖిలపక్ష భేటీకి టీఎంసీ రెబల్‌ నేతకు ఆహ్వానం
కోల్‌కతా: బెంగాల్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 18వ తేదీ నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు గాను ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఈ ఏర్పాటు చేసింది. మమతా బెనర్జీ అనుకూల వర్గం ఎమ్మెల్యేలకు బదులుగా ప్రభుత్వం ఆహ్వానం పంపించలేదు. తిరుగుబాటు వర్గం ఎన్నుకున్న రితబ్రత బెనర్జీకి మాత్రమే ఆహ్వానం పంపించింది. మమత సారథ్యంలోని టీఎంసీ ప్రతిపక్ష నేతగా ప్రకటించిన శోభన్‌దేవ్‌ చటోపాధ్యాయ్‌ను ప్రభుత్వం ఆహ్వానించలేదు. ఇటీవలి ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఎన్నికైన 80 మందికిగాను 65 మంది ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు ప్రకటించడం తెల్సిందే. దీంతో, టీఎంసీ తిరుగుబాటు వర్గమే ప్రముఖంగా అవతరించింది. టీఎంసీలో సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా, అఖిలపక్ష సమావేశానికి ఐఎస్‌ఎఫ్‌ ఎమ్మెల్యే నౌషాద్‌ సిద్దిఖి, ఆమ్‌ జనతా ఉన్నయాన్‌ పార్టీ ఎమ్మెల్యే హుమాయూన్‌ కబీర్, సీపీఎం ఎమ్మెల్యే ముస్తాఫిజుర్‌ రహమాన్‌ హాజరయ్యారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Ram Charan
Director Sukumar
collaboration
tmc
Rebellion
Lok Sabha
speaker
Om Birla
mamata banerjee
Abhishek Banerjee
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్‌ ఇప్పుడే మొదలు!

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

రెబెల్స్‌ చీఫ్‌గా అరూప్‌ 

రెబెల్స్‌ చీఫ్‌గా అరూప్‌ 

రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీ డేట్ వైరల్..!

రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీ డేట్ వైరల్..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.