Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Lok Sabha Election 2024: ఎన్‌డీఏకు 150 సీట్లూ కష్టమే
ADVERTISEMENT 

Lok Sabha Election 2024: ఎన్‌డీఏకు 150 సీట్లూ కష్టమే

National Sakshi User Sakshi Sakshi Time May 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
060520240627-PTI05_06_2024_.jpg


రాజ్యాంగాన్ని మేం రక్షిస్తుంటే వాళ్లు కూలదోసే కుట్రకు తెగించారు 

బీజేపీ కూటమిపై రాహుల్‌ గాంధీ నిప్పులు 

అలీరాజ్‌పూర్‌/ఖర్‌గోన్‌: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలను కూడా గెల్చుకోదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో పోరాడుతుంటే కమలంపార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగాన్ని మార్చేందుకు కంకణం కట్టుకున్నాయని రాహుల్‌ ఆరోపించారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని జోబాట్, సేగోన్‌ పట్టణాల్లో రాహుల్‌ ఎన్నికల ప్రచారంచేశారు. రాత్లాం–ఝబువా, ఖర్‌గోన్‌ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు.

హక్కుల్ని లాగేద్దామని మోదీ ఆశపడుతున్నారు
‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరాక ప్రజా ప్రయోజనాల కోసం 50 రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తుంది. కులగణన అనేది ప్రజల జీవన స్థితిగతులపై వాస్తవ గణాంకాలను అందిస్తుంది, దీంతో దేశంలో రాజకీయ గతే మారిపోతుంది. రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించేశారు. ఈసారి 400 ఖాయం అని బడాయిలుపోతున్నారుగానీ కనీసం వారికి 150 సీట్లుకూడా రావు. రాజ్యాంగాన్ని పరిరక్షించేది విపక్షాల ‘ఇండియా’ కూటమి మాత్రమే. రాజ్యాంగంలో ఉంది కాబట్టే గిరిజనులు, దళితులు, ఓబీసీలు లబ్ధిపొందగల్గుతున్నారు. జలం, జమీన్‌(భూమి), జంగల్‌(అడవి)పై గిరిజనులకు హక్కులున్నాయి. ప్రజల హక్కులను లాగేసుకోవాలని ప్రధాని మోదీ ఆశపడుతున్నారు. ఆ ఆశలు నెరవేరకుండా మేం అడ్డుకుంటాం’’ అని రాహుల్‌ అన్నారు. 

మేం చేయబోయే విప్లవాత్మకమైన పని ఇదే
‘‘వాళ్లు ఇప్పుడున్న రిజర్వేషన్లను లాక్కోవడం సంగతి పక్కనబెట్టండి. మేం ఆ రిజర్వేషన్లను 50 శాతం దాటేలా చేస్తాం. కోర్టులు రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం దగ్గరే నిలిపేశాయి. భూమి, అడవికి తొలి యజమానులైన మిమ్మల్ని ఆదివాసీలుగా మేం గుర్తిస్తున్నాం. బీజేపీ వాళ్లు మిమ్మల్ని వనవాసీలంటున్నారు. మీ హక్కుల పరిరక్షణ కోసమే అటవీ హక్కుల చట్టం, పేసా చట్టాలు అమల్లో ఉన్నాయి. మీ అందరికీ చేకూరిన లబ్దిని మీకు దూరం చేయాలని వారు కుట్ర పన్నారు. విపక్షాల కూటమికి ఓటేసి అధికారం కట్టబెడితే కులగణన చేసి గిరిజనులు, దళితులు, ఓబీసీలు, జనరల్‌ కేటగిరీ పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాం. మేం చేయబోయే విప్లవాత్మకమైన పని ఇదే. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ అబద్ధాలు చెప్పారు. మేం కోట్లాది మంది పేదలను లఖ్‌పతిలుగా మారుస్తాం’’ అని చెప్పారు.

పాతికమందికే అన్ని ఇచ్చే కుట్ర
‘‘రాజ్యాంగం, రిజర్వేషన్లు, గిరిజనుల అటవీభూములు, ప్రభుత్వరంగాన్ని కాపాడేందుకు మేం కష్టపడుతుంటే వీటిపై సర్వాధికారాన్ని అదానీ సహా ఓ పాతికమంది కుబేరులకు ధారాదత్తం చేద్దామని మోదీ ఆశపడుతున్నారు. మేం ఆ పని జరగనివ్వం’’ అని ప్రకటించారు. 

ఉపాధి కూలీ వేతనం రూ.400కు పెంచుతాం
‘‘మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళల ఖాతాలో ఏటా రూ.1 లక్ష జమచేసి పేదరికం నుంచి బయటపడేస్తాం. పథకంలో భాగంగా మహిళకు నెలకు రూ.8,500 అందుతాయి. మేం గెలిస్తే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. అందుకోసం చట్టం తెస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక వీలైనంత త్వరగా రైతుల రుణాలను మాఫీచేస్తాం. గత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి నిరుద్యోగిత పెరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ వేతనంను రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. పెహ్లీ నౌకరీ పక్కా పథకం కింద యువతకు కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్‌ కింద ఏటా రూ.1లక్ష జమచేస్తాం. తర్వాత ఉద్యోగాలిస్తాం’’ అని హామీ ఇచ్చారు.
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Lok Sabha Elections 2024
Rahul Gandhi
NDA alliance
Constitution
Reservations Cancel
Narendra Modi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

యోగాతో ప్రపంచ శాంతి 

యోగాతో ప్రపంచ శాంతి 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.