Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘సుశాంత్ సింగ్ లాగే నా చెల్లిని బలితీసుకున్నారు’
ADVERTISEMENT 

‘సుశాంత్ సింగ్ లాగే నా చెల్లిని బలితీసుకున్నారు’

National Sakshi User Sakshi Sakshi Time Jun 17, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tv-actor.jpg

ముంబై: బుల్లితెర నటి సంచిత ఉగలే మరణం వినోద పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలోని నాలాసోపారాలో గల తన అపార్ట్‌మెంట్‌లో జూన్ 14న ఈ 22 ఏళ్ల నటి  ఆత్మహత్య చేసుకుంది. ప్రాథమికంగా దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, పలు అనుమానాల మధ్య పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే సంచిత మరణించిన రెండు రోజుల తర్వాత ఆమె తండ్రి మచ్చింద్ర ఉగలే, కజిన్ ఆకాష్ సతీష్ మీడియా ముందుకు వచ్చి, పరిశ్రమలో తన కుమార్తె ఎదుర్కొన్న వేధింపుల వివరాలను బయటపెట్టారు.

నిరంతర వేధింపులు.. డబ్బుల కోసం ఒత్తిడి
సంచిత తండ్రి మచ్చింద్ర ఉగలే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె పడిన మానసిక క్షోభను వివరించారు. సంచిత నిరంతరం తీవ్రమైన ఒత్తిడి, వేధింపులకు గురైందని ఆయన ఆరోపించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను డబ్బుల కోసం లేదా ఇతర ‘విషయాల’ కోసం నిరంతరం బ్లాక్‌మెయిల్ చేస్తూ, తీవ్రమైన టార్చర్‌కు గురిచేశారని అన్నారు. అప్పుడప్పుడు ఆమె  తీవ్ర నిరాశలోకి (డిప్రెషన్) జారుకునేదని, అందుకే తాము ఎప్పుడూ ఆమెకు తోడుగా ఉండేవారమని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో పోలిక
సంచిత కజిన్ ఆకాష్ సతీష్ ఈ ఘటనపై మాట్లాడుతూ బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని గుర్తుచేశారు. 2020, జూన్ 14న సుశాంత్ ఎలాగైతే ఇండస్ట్రీ ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో, సరిగ్గా  అదే రోజున (జూన్ 14) తన సోదరి కూడా అదే ఇండస్ట్రీ ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. చిత్ర పరిశ్రమలో మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఎదుగుతున్న నటీనటులను కొందరు పెద్దలు బెదిరింపులకు గురిచేస్తూ వేధిస్తుంటారన్నారు.

వినోద పరిశ్రమలో విషాదం
సంచిత ఉగలే పలు ప్రముఖ టెలివిజన్ ధారావాహికల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ప్రముఖ సీరియల్ ‘కుంకుమ భాగ్య’లో దియా టాండన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనితో పాటు 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే', 'సజన్ ఘర్' వంటి షోలలో కూడా నటించారు. అంతేకాకుండా, నటుడు విక్కీ కౌశల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘చావా’లో కూడా ఆమె ఒక పాత్ర పోషించారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలోనే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో టెలివిజన్ రంగంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇది కూడా చదవండి: రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
suicide attempt
Actor
allegations
TV actor
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘ఆ డబ్బులతోనే నలుగురి అంత్యక్రియలు చేయండి’

‘ఆ డబ్బులతోనే నలుగురి అంత్యక్రియలు చేయండి’

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!

చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!

పరీక్షకు కొద్ది గంటల ముందు ‘నీట్‌’ అభ్యర్థి ఆత్మహత్య

పరీక్షకు కొద్ది గంటల ముందు ‘నీట్‌’ అభ్యర్థి ఆత్మహత్య

ఒత్తిడితో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఒత్తిడితో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బాసు, బిగ్ బాసే  సూత్రధారులు

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బాసు, బిగ్ బాసే సూత్రధారులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.