Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఢిల్లీ సీఎంపై  జోరుగా కసరత్తు 
ADVERTISEMENT

ఢిల్లీ సీఎంపై  జోరుగా కసరత్తు 

National Sakshi User Sakshi Sakshi Time Feb 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
PARVESH11.jpg

అమిత్‌ షాతో నడ్డా భేటీ   

రేసులో ముందంజలో పర్వేశ్‌ 

తెరపైకి మరికొందరి పేర్లు 

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ దంగల్‌లో ఆప్‌ను చిత్తు చేసిన బీజేపీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్‌ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సతీశ్‌ ఉపాధ్యాయ, విజేందర్‌ గుప్తా, ఆశిష్‌ సూద్, పవన్‌ శర్మతో పాటు పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది.

 జాట్‌ నేత అయిన పర్వేశ్‌ ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించి సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మాదిరిగా కమలనాథులు అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పూర్వాంచల్‌ నేపథ్యమున్న నేతను, లేదా మహిళను, లేదంటే సిక్కు వర్గం నాయకుడిని సీఎం ఎలా చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో పెద్దగా పేరు ప్రఖ్యాతుల్లేని నేతలను ముఖ్యమంత్రులుగా బీజేపీ నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పునరుద్ఘాటించారు. తమ కొత్త ఎమ్మెల్యేలందరికీ సీఎంగా రాణించగల సత్తా ఉందన్నారు. 

అతిశీ రాజీనామా 
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. ఆదివారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనాకు రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా కొనసాగాలని ఆయన కోరారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని ఎల్జీ రద్దు చేశారు. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వచి్చంది. అతిశీ గతేడాది సెపె్టంబర్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామాతో సీఎంగా ఆతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. తాజా ఫలితాల్లో కేజ్రీవాల్‌ ఓడినా ఆమె మాత్రం నెగ్గారు. 

పథకాలను బీజేపీ ఆపకుండా చూస్తాం: ఆప్‌
22 మంది ఆప్‌ కొత్త ఎమ్మెల్యేలతో పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల కోసం పనిచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనంతరం ఆతిశీ మీడియాకు చెప్పారు. ‘‘మార్చి 8 నుంచి మహిళలకు బీజేపీ నెలకు రూ.2,500 కచ్చితంగా ఇవ్వాలి. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. పదేళ్లుగా ఆప్‌ అమలు చేసిన ఉచిత సేవలు, పథకాలను నిలిపేయకుండా మేం చూస్తాం’’ అన్నారు.

మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చాకే! 
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. 13వ తేదీన ఆయన తిరిగొస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాతే జరిగే అవకాశముందని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సీఎం ఎంపిక కూడా మోదీ వచ్చాకే జరగవచ్చని తెలిపాయి. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Delhi Assembly election results
bjp
new Chief Minister
JP Nadda
Amit Shah
Parvesh Verma
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.