Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Sakshi Special
  3. Jharkhand Assembly Election 2024: ప్రాంతాల పోరులో... పైచేయి ఎవరిదో!
ADVERTISEMENT 

Jharkhand Assembly Election 2024: ప్రాంతాల పోరులో... పైచేయి ఎవరిదో!

Sakshi Special Sakshi User Sakshi Sakshi Time Nov 13, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
JHARKHAND.jpg

ఆసక్తికరంగా జార్ఖండ్‌ అసెంబ్లీ పోరు 

జేఎంఎం కంచుకోటలుగా కొల్హన్, సంథాల్‌

నార్త్‌ చోటానాగపూర్, పాలముల్లో బీజేపీ హవా 

సౌత్‌ చోటానాగపూర్‌లో ఇరు కూటముల కొట్లాట

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అస్థిరతకు మారుపేరైన జార్ఖండ్‌ మరోసారి అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. ప్రజాకర్షక పథకాల సాయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి ఆశపడుతోంది. జనాభాలో మెజారిటీ అయిన గిరిజనులతో పాటు ముస్లిం మైనారిటీల్లో సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఉన్న ఆదరణ గట్టెక్కిస్తుందని నమ్ముతోంది. ఎన్డీఏ సారథి బీజేపీ మాత్రం ఐదేళ్లనాడు చేజారిన అధికారాన్ని ఎలాగైనా ఒడిసిపట్టాలని ఉవి్వళ్లూరుతోంది.

హేమంత్‌ తదితరుల అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుంది. గత ఎన్నికల్లో ముఖం చాటేసిన గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. వలసలు తదితరాలను ప్రస్తావిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడింది. 81 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లకు బుధవారం తొలి విడతలో పోలింగ్‌ జరగనుంది. మిగతా 38 స్థానాలకు నవంబర్‌ 20న పోలింగ్‌ జరుగుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలెన్ని ఉన్నా జనాభాలో 35 శాతంగా ఉన్న గిరిజనులే మరోసారి ఫలితాన్ని నిర్దేశించనున్నారు.

ప్రాంతాలవారీగా చూస్తే గిరిజనులు ఏకంగా 60 శాతముండే కొల్హన్, సంథాల్‌ పరగణాల్లో జేఎంఎంకు తిరుగులేని పట్టుంది. 25 అసెంబ్లీ స్థానాలున్న కీలకమైన నార్త్‌ చోటానాగపూర్‌తో పాటు ఎస్సీ ప్రాబల్య పాలము ప్రాంతంపై బీజేపీ ఆధిపత్యం సాగుతోంది. ఐదో ప్రాంతమైన సౌత్‌ చోటానాగపూర్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడ్డాయి. 

సంథాల్‌ పరగణా 
అత్యంత వెనకబడ్డ జిల్లాలున్న ఈ ప్రాంతం ఇటు బిహార్, అటు పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకుంటుంది. ఇక్కడి 18 అసెంబ్లీ స్థానాల్లో ఏడు ఎస్టీ, ఒకటి ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఎస్సీలు 8 శాతముంటే ఎస్టీలు 28, ముస్లింలు 23 శాతమున్నారు. 
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి ఏకంగా 13 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 5 మాత్రమే దక్కాయి. 
లోక్‌సభ ఎన్నికల్లో: 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిపత్యం సాగగా 8 బీజేపీని ఆదరించాయి. 

 కొల్హాన్‌ 
ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకునే ఈ ప్రాంతంలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ఒక ఎస్సీ, 9 ఎస్టీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 42 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమే ఉంటారు. ముస్లింలు 6 శాతమున్నారు. ఈసారి అధికారం దక్కాలంటే నార్త్‌ చోటానాగ్‌పూర్‌లో ఆదరణను నిలబెట్టుకుంటూ సంతాల్, కొల్హాన్‌ ప్రాంతాల్లో పాగా వేయడం ఆ పారీ్టకి తప్పనిసరి. ఇందుకోసం ఇటీవలే జేఎంఎం నుంచి వచ్చిన మాజీ సీఎం చెంపయ్‌ సోరెన్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అక్రమ వలసల అంశం ఈ ప్రాంతంలో తమకు బాగా కలిసొస్తుందని అంచనా వేస్తోంది. 
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి 13 స్థానాలు దక్కగా బీజేపీ పూర్తిగా చతికిలపడింది 
లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఆదరణ దక్కింది. 

పాలము 
ఇటు బిహార్, అటు ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దులున్న ప్రాంతం. 9 అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎస్సీ, ఒక ఎస్టీ సీట్లున్నాయి. 25 శాతం ఎస్సీలుండటం బీజేపీకి కలిసొచ్చే అంశం. 
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి ఐదు సీట్లు దక్కగా బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. 
లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ సీట్ల పరిధిలో బీజేపీ ఆధిపత్యమే సాగింది. 

నార్త్‌ చోటానాగ్‌పూర్‌ 
25 అసెంబ్లీ స్థానాలున్న అతి కీలక         ప్రాంతం. బిహార్, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులున్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క ఎస్టీ రిజర్వుడు స్థానం కూడా లేకపోవడం విశేషం. ఇక్కడ బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి వలస వచి్చన వాళ్లు ఎక్కువ. 17 శాతం ఎస్సీలు, 16 శాతం ముస్లింలుంటే ఎస్టీలు కేవలం 9 శాతమే ఉన్నారు. 
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: బీజేపీ 10, ఇండియా కూటమి 11 సీట్లు గెలుచుకున్నాయి. 
లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ హవాయే సాగింది. ఈ పరిణామం కమలనాథుల్లో హుషారు పెంచింది. 

సౌత్‌ చోటానాగ్‌పూర్‌ 
ఛత్తీస్‌గఢ్, ఒడిషాలతో సరిహద్దులున్న ఈ ప్రాంతం 15 అసెంబ్లీ స్థానాలకు నిలయం. 11 ఎస్టీ, ఒకే ఒక్క ఎస్సీ స్థానమున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 51 శాతముంటారు. ముస్లింలు 11 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమున్నారు.  
2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి 8, బీజేపీ ఐదు సీట్లు గెలుచుకున్నాయి. 
లోక్‌సభ ఎన్నికల్లో: బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ 4 అసెంబ్లీ స్థానాల పరిధిలోనే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా 11 చోట్లా ఇండియా కూటమి హవాయే  సాగింది.

67 శాతం రెడ్‌ అలర్ట్‌ స్థానాలే! 
174 మందిపై కేసులు 
235 మంది కోటీశ్వరులు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో బుధవారం తొలి దశలో పోలింగ్‌ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలున్నాయి! బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్‌ కేసులుంటే వాటిని రెడ్‌ అలర్ట్‌ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్‌ కేసులున్నట్టు జార్ఖండ్‌ ఎలక్షన్‌ వాచ్, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించాయి.

వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. 11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Jharkhand Assembly Election 2024
NDA
bjp
poling
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.