Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘హోదా’ పునరుద్ధరణకిదే సమయం
ADVERTISEMENT 

‘హోదా’ పునరుద్ధరణకిదే సమయం

National Sakshi User Sakshi Sakshi Time Feb 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
030520240612-INDIA-ELECTION.jpg

జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆశాభావం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సమయం ఆసన్నమైనట్లుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ‘కేంద్ర హోం మంత్రితో ఏడాది క్రితమే ఈ విషయం చర్చించాను. రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఇదే సరైన సమయం’అని ఆయన వివరించారు. 

‘ఇటీవల హోం మంత్రి అమిత్‌ షాతో ఢిల్లీలో ఈ విషయమై చర్చ సానుకూలంగా జరిగింది. త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నా. ఈ అంశాన్ని చట్టపరమైన ముగింపు లభించాలని కోరుకుంటున్నా’అని అబ్దుల్లా చెప్పారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక కేంద్రం, జమ్మూకశ్మీర్‌ మధ్య అంతరం తగ్గిందన్న విషయమై ఆయన స్పందిస్తూ..కొన్ని ఘటనల వల్లే దూరం పెరుగుతుందని చెప్పారు. 

ఇటీవల బారాముల్లా జిల్లా సొపోర్, కథువా జిల్లా బిల్లావర్‌లో జరిగిన రెండు హత్యలు నివారించదగినవని చెప్పారు. వీటిపై కేంద్రం పారదర్శకంగా దర్యాప్తు చేయించి, బాధ్యులను తగు విధంగా శిక్షించాలన్నారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇటువంటి పరిణామాలు అవరోధంగా మారుతాయని వ్యాఖ్యానించారు.

 భద్రత, పోలీసు విభాగాలు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీ కానప్పటికీ, ఇటువంటివి చోటుచేసుకోకుండా చూడాల్సిన సమష్టి బాధ్యత ఉందని వివరించారు. ఈ విషయంపైనా హోం మంత్రితో మాట్లాడానని వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు అనుమానమున్న 26 ఏళ్ల వ్యక్తి పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరునాడే, సొపోర్‌లోని చెక్‌పోస్ట్‌ వద్ద ఆగకుండా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.

100 రోజుల పాలనపై.. 
‘ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వంద రోజులు కోసం కాదు, ఐదేళ్లూ పాలించడానికే. మా పని మమ్మల్ని చేయనివ్వండి. జమ్మూకశ్మీర్‌లో పాలన అంటే మామూలు విషయం కాదు. 2009–2015లోనూ తేలిగ్గా లేదు. ఇప్పుడూ అంతే. ఎవరికైనా ఈ ఇబ్బంది తప్పేది కాదు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ఈ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాం. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాకూ ఇది కొత్తే. ఆయనా నేర్చుకుంటున్నారు’అని ఒమర్‌ అబ్దుల్లా వివరించారు.

కేంద్రం నుంచి ఒత్తిళ్లు.. 
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లపై ఆయన మాట్లాడుతూ..ఇక్కడ తమకు రాజకీయ పరమైన ఒత్తిళ్లకంటే వాతావరణ పరమైన సవాళ్లే ఎక్కువగా ఉన్నాయంటూ నవ్వారు. ఫిబ్రవరిలోనే ఎండలు మార్చి, ఏప్రిల్‌లో మాదిరిగా మండిపోతున్నాయి. రానున్న వేసవిలో నీటి కొరత తీవ్రం కానుందంటూ ఒమర్‌ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. 

‘వేడి ఎక్కువగా ఉంది. అయితే, అది కేంద్రం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచీ, ఎవరైనా అధికారీ నుంచీ కాదు. వేడి వాతావరణం కారణంగా ఈసారి నీటి సమస్య తలెత్తనుంది. ఇతరత్రా సమస్యల కంటే దీనిని తీర్చడమెలాగన్నదే మాకు అతిపెద్ద సవాల్‌ కానుంది’అని ఆయన వివరించారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల అధికారులతో సమావేశం కానున్నామన్నారు. వచ్చే రోజుల్లో మంచు, వాన కురిస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నానన్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Jammu Kashmir
statehood
Omar Abdullah
Restoration
special statas
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

పాక్‌ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్‌ అక్కడే!

పాక్‌ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్‌ అక్కడే!

ఒకే కశ్మీర్.. రెండు విభిన్న వాస్తవాలు!

ఒకే కశ్మీర్.. రెండు విభిన్న వాస్తవాలు!

కశ్మీర్‌లో ఖమేనీ ఎఫెక్ట్‌.. ఎంపీ, మేయర్‌పై కేసు నమోదు

కశ్మీర్‌లో ఖమేనీ ఎఫెక్ట్‌.. ఎంపీ, మేయర్‌పై కేసు నమోదు

అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్‌.. భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన సీఎం

రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్‌.. భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన సీఎం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.