Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. చంద్రయాన్‌ –3 తరువాత?
ADVERTISEMENT 

చంద్రయాన్‌ –3 తరువాత?

National Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
WHAT-NEXT.jpg

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన రెండో ప్రయత్నంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను ల్యాండ్‌ చేయడంలో విజయం సాధించింది. భవిష్యత్తు ఏమిటన్న విషయానికి క్లుప్తంగా ఇవ్వగలిగిన సమాధానం ఆకాశమే హద్దుగా అంతరిక్ష రంగంలో మనదైన ముద్రను వేయడమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే రష్యా, ఇజ్రాయెల్‌లు రెండూ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు విఫలయత్నం చేశాయి. భారత్‌ మాత్రమే విజయం సాధించగలిగింది.



కచ్చితంగా ఇది భారత శాస్త్రవేత్తల సునిశిత ప్లానింగ్, ఆలోచన, నిబద్ధతలకు ప్రత్యక్ష ప్రమాణం. కాబట్టి చంద్రయాన్‌–3 తరువాత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో వైపు చూసే దేశాల సంఖ్య నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం భారత అంతరిక్ష ప్రయోగ మార్కెట్‌ విలువ దాదాపు 800 కోట్ల డాలర్లని అంచనా. 2040 నాటికి ఇది ఐదు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే ఒక అంచనా ఉండగా.. చంద్రయాన్‌–3 విజయం ఈ లక్ష్యాన్ని మరింత ముందుగానే అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కొన్నేళ్లుగా భారత అంతరిక్ష రంగం ఇతర దేశాల కంటే రెట్టింపు వేగంతో ఎదుగుతున్న విషయం తెలిసిందే.



కలిసొచ్చే జుగాడ్‌...

చంద్రయాన్‌ –3 ఖర్చు రూ.600 కోట్లు ఉంటే.. ఇంతే స్థాయి అంతరిక్ష ప్రయోగానికి విదేశాల్లో ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందనేది ఇప్పటికే మనకు అనుభవమైన విషయం. అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చగలగడం ఇస్రో ప్రత్యేకతగా మారింది. కాబట్టి సొంతంగా ఉపగ్రహాలు పంపుకోలేని చాలా దేశాలిప్పుడు భారత్‌ను ఆశ్రయిస్తాయి. ఇది మనకు కలిసొచ్చే అంశం.



ఇస్రోకు నేరుగా ప్రయోజనం కలిగితే ఈ సంస్థకు విడిభాగాలు, సామాన్లు సరఫరా చేసే ప్రైవేట్‌ కంపెనీలు బోలెడన్ని లాభాలు చవిచూస్తాయి. రక్షణ రంగంతోపాటు అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్శించేందుకు కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో చంద్రయాన్‌–3 విజయం చాలా కీలకం కానుంది. విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు, లేదా సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు, ఇతర అవసరాలకు వేర్వేరు శక్తిసామర్థ్యాలు కలిగిన జియోసింక్రనస్‌ లాంఛ్‌ వెహికల్‌ కలిగి ఉండటం ఇస్రోకు లాభించే ఇంకో అంశం.



భవిష్యత్తు అవసరాల కోసం?

1972 తరువాత భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై మనిషి కాలుపెట్టలేదు. అయితే అక్కడ నీరు ఉందన్న విషయం స్పష్టమైన తరువాత చాలా దేశాలు వ్యోమగాములను పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమెరికా తన ఆర్టిమిస్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వచ్చే ఏడాదికల్లా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, అక్కడే ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలతో పనిచేస్తోంది. జాబిల్లిపై నీటితోపాటు చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.



కాలుష్యరహితమైన, అత్యంత సమర్థమైన హీలియం–3 ఆ వనరుల్లో ఒకటి. భవిష్యత్తులో జాబిల్లిపైని వనరులను వాడుకునే అవకాశం లభిస్తే (శుద్ధి, రవాణా వంటి వాటికి తగిన టెక్నాలజీలు అభివృద్ధి చేసుకోవాలి) అందులో భారత్‌కూ భాగస్వామ్యం లభించేందుకు చంద్రయాన్‌–3 విజయం సాయపడుతుంది. అలాగే జాబిల్లిని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను అన్వేషించాలని, అంగారకుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనిషి చాలాకాలంగా ఆలోచిస్తున్నాడు.



ఈ ప్రస్థానంలో జాబిల్లి దక్షిణ ధ్రువం మాదిరిగా ఇతర గ్రహాలపైని అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని వ్యోమనౌకలను ల్యాండ్‌ చేయడమెలా అన్నది తెలిసిన వారి అవసరం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఇస్రో ఇప్పటికే అనేక దేశాలతో కలిసి అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది. పరిశోధనల్లోనూ భాగస్వామిగా నిలిచింది. ఈ అనుభవమంతా భవిష్యత్తులో అంతరిక్షాన్ని మన అవసరాల కోసం ఉపయోగించుకునే సందర్భంలో ఉపయోగపడుతుంది. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న భారత ప్రకటిత లక్ష్యానికి తగిన విధానాలను రూపొందించవచ్చు.



 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrayaan-3
space sector
Indian Space Research Organisation (ISRO)
south pole
Moon
rover
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

హైదరాబాద్ లో బ్లడ్‌ మూన్‌ ఇలా కనిపించింది (ఫొటోలు)

హైదరాబాద్ లో బ్లడ్‌ మూన్‌ ఇలా కనిపించింది (ఫొటోలు)

అమెరికాకు చైనా చెక్ పెట్టాలా

అమెరికాకు చైనా చెక్ పెట్టాలా

చందమామ చిక్కేదెవరికి?

చందమామ చిక్కేదెవరికి?

ఆకాశంలో అద్భుతం...మార్చి 3న రక్తంతో ఉండబోయే చంద్రుడు!

ఆకాశంలో అద్భుతం...మార్చి 3న రక్తంతో ఉండబోయే చంద్రుడు!

‘మూన్‌ మిషన్‌’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన

‘మూన్‌ మిషన్‌’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.