Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్‌
ADVERTISEMENT 

జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్‌

National Sakshi User Sakshi Sakshi Time May 30, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Rocket.jpg

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): రెండోతరం నావిగేషన్‌ ఉపగ్రహ సిరీస్‌లో మొదటిదైన ఎన్‌వీఎస్‌–01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌)లోని రెండో లాంచింగ్‌ప్యాడ్‌ వేదికైంది. 27.5 గంటల కౌంట్‌డౌన్‌ ముగిశాక సోమవారం ఉదయం 10.42 గంటలకు ఎన్‌వీఎస్‌–01 ఉపగ్రహాన్ని 51 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువైన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు (పెరీజి), భూమికి దూరంగా 36,568 కిలోమీటర్లు (అపోజీ) దీర్ఘవృత్తాకార భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.

2,232 కేజీల ఉపగ్రహం అక్కడ స్ధిరంగా ఉన్నట్లు బెంగళూరు దగ్గర్లోని హసన్‌లోని గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ అందాయి. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌకను వాడటం ఇది 15వ సారి. 2021 ఆగస్టులో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 అపజయం పాలవడంతో ఆనాటి క్రయోజనిక్‌ స్థాయి తప్పిదాలను సరిచేసి ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో మూడు దశల్లో పెరీజీని పెంచుతూ అపోజీని తగ్గిస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరుస్తారు.

అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్‌ తరహాలో భారత సొంత నావిగేషన్‌ వ్యవస్థ అయిన నావ్‌ఐసీ(నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టిలేషన్‌– గతంలో భారత క్షేత్రియ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ)ను బలోపేతం చేసే దిశగా ఈ కొత్త తరం ఉపగ్రహాన్ని ఒక పాత ఉపగ్రహం స్థానంలో భర్తీ చేస్తున్నారు. అయితే ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ మాట్లాడారు. ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని అన్నారు. భారతదేశ నావిగేషన్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నావిక్‌ సిరీస్‌ ఉపగ్రహాలను ఆరు నెలకొకసారి ప్రయోగిస్తామని తెలిపారు.

GSLV-F12/ NVS-O1 Mission is accomplished.



After a flight of about 19 minutes, the NVS-O1 satellite was injected precisely into a Geosynchronous Transfer Orbit.



Subsequent orbit-raising manoeuvres will take NVS-01 into the intended Geosynchronous orbit.

— ISRO (@isro) May 29, 2023

తొలిసారిగా దేశీ అణుగడియారం

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్‌ సిరీస్‌ కొత్త ఉపగ్రహాలు ఎంతగానో దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్‌–బ్యాండ్, కె–బ్యాండ్, కేయూ–బ్యాండ్‌ లాంటి ఉపకరణాలను అమర్చారు. ఈసారి నావిక్‌–01 ఉపగ్రహంలో ఎల్‌–1, ఎల్‌–5, ఎస్‌–బ్యాండ్‌ సిగ్నల్స్‌ వ్యవస్థను అమర్చారు. ఎల్‌–1లో పౌరులకు ఉపయోగపడే సివిలియన్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను పరిచయం చేశారు.

సమయం, స్థానం అత్యంత ఖచ్చితంగా తెలిపే తొలిసారిగా దేశీయంగా తయారుచేసిన రుబీడియం అణుగడియారాన్ని ఉపగ్రహంలో అమర్చారు. ఆటమిక్‌ క్లాక్‌ను తయారుచేస్తే సత్తా ప్రపంచంలో చాలా తక్కువదేశాలకే ఉంది. నావిగేషన్‌ ఉపగ్రహాల వ్యవస్థలో ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు నావిగేషన్‌ వ్యవస్థను అందిస్తున్నారు. ఇందులో నాలుగు ఉపగ్రహాలకు కాలపరిమితి ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవాటిని పంపుతున్నారు.

కొత్త ఉపగ్రహాలతో భూ, జల, వాయు మార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో, 50 నానోసెకన్ల రియల్‌టైమ్‌తో చూపించడం, అత్యవసర సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశా నిర్ధేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. దేశానికి ఆవల సైతం 1,500 కిలోమీటర్లదాకా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
srihari kota
gslv
GPS
navigation satellite
ISRO
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?

లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?

ఏరోస్పేస్‌ ఉద్యోగాన్ని వదిలి కేఫ్‌..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..

ఏరోస్పేస్‌ ఉద్యోగాన్ని వదిలి కేఫ్‌..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..

ఉత్తరాఖండ్ వరదలు.. ఇస్రో కీలక రిపోర్ట్

ఉత్తరాఖండ్ వరదలు.. ఇస్రో కీలక రిపోర్ట్

జీపీఎస్‌ దారి తప్పింది

జీపీఎస్‌ దారి తప్పింది

మీరు దిగాల్సిన స్టాప్‌ వచ్చింది..!

మీరు దిగాల్సిన స్టాప్‌ వచ్చింది..!

ఏఐకి మానవ్‌ విజన్‌! 

ఏఐకి మానవ్‌ విజన్‌! 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.