Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. తస్మాత్‌ జాగ్రత్త.. అలాంటి రీల్స్‌ చేస్తే జైలుకే!
ADVERTISEMENT 

తస్మాత్‌ జాగ్రత్త.. అలాంటి రీల్స్‌ చేస్తే జైలుకే!

National Sakshi User Sakshi Sakshi Time Jul 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
insta-reeld.jpg

ఒరేయ్‌.. ఇది ఇన్‌స్టాగ్రామా?.. పొరపాటున గూగుల్‌ క్రోమ్‌ ఓపెన్‌ చేశామా? అనేంత రేంజ్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్న రోజులివి. పైగా అలాంటి కంటెంట్‌కే ఫాలోవర్స్‌లో మాంచి డిమాండ్‌ ఉందని రెచ్చిపోతున్న తీరూ చూస్తున్నాం. బూతులతో కొందరు.. హాట్‌ హాట్‌ ఫోజులతో మరికొందరు.. సెమీ శృంగారంతో ఇంకొందరు.. చెలరేగిపోతున్నారు. అయితే ఇకపై అలాంటి వేషాలు చెల్లకపోవొచ్చు!. 

ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ నెలకు రూ.30 వేల దాకా సంపాదిస్తున్న అక్కాచెల్లెలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎందుకంటే వాళ్లు చేస్తోంది అసభ్యకరమైన కంటెంట్‌ కాబట్టి. వల్గర్‌ డైలాగులతో.. అతి జుగుప్సాకరమైన చేష్టలతో కంటెంట్‌ పోస్టు చేస్తూ వచ్చారు వాళ్లు. రానురాను వాళ్ల చేసే కంటెంట్‌ శ్రుతి మించిపోవడం.. అది తమ దృష్టికి వెళ్లడంతో సుమోటోగా కేసు నమోదు చేసి ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇక.. 

అసోంలో ఓ ఘనుడు.. తన మాజీ ప్రేయసిపై కోపంతో ఆమె ముఖంతో ఏఐ జనరేటెడ్‌ అశ్లీల ఇమేజ్‌లను సృష్టించాడు. అలా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఓ ప్రముఖ అడల్ట్‌స్టార్‌ ఈ అకౌంట్‌కు స్పందించడంతో.. రాత్రికి రాత్రే ఈ అకౌంట్‌ తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు బాధితురాలు(సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరే!) సైబర్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఆ సైకోను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ అకౌంట్‌ ద్వారా సదరు నిందితుడు ఏకంగా రూ.10 లక్షల దాకా సంపాదించడాని తెలుస్తోంది. 

రూల్స్‌కు పాతరేసి..
ఒకప్పుడు కంటెంట్‌ విషయంలో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌ కఠిన నిబంధనలే పాటించేది. అయితే రాను రాను ఆ పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు, యుద్ధాలు, ప్రమాదాలు.. ఈ తరహా కంటెంట్‌ విషయంలో మాత్రమే Disclaimerను ఫాలో అవుతోంది. అమ్మాయిల హాట్‌ ఫోజులకు, సెమీ న్యూడ్‌ కంటెంట్‌కు, బూతు డైలాగులకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర యాప్‌లు అడ్డాగా మారిపోయాయి. ఇదే అదనుగా.. ఆదాయం కోసం అడ్డు అదుపు లేకుండా కంటెంట్‌ క్రియేటర్లు చెలరేగిపోతున్నారు. ఆఖరికి మీమర్లు కూడా తమ కంటెంట్‌ ప్రమోషన్‌ కోసం ఈ తరహా కంటెంట్‌ను తమకు తెలియకుండానే ప్రమోట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ అయ్యే కంటెంట్‌ను ఫిల్టర్‌ చేస్తే సగటున ఒక రోజులో 72 శాతం ఈ తరహా కంటెంట్‌ ఉండడం గమనార్హం!!.

ఏఐతో దారుణాలు
అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ వాడకం.. నాణేనికి రెండోవైపుగానూ ఉంటోంది. అశ్లీల, అసభ్య కంటెంట్‌ విషయంలో ఇప్పుడు ఏఐదే ముఖ్యపాత్రగా మారింది. ఇందునా సెలబ్రిటీల కంటెంట్‌ అగ్రభాగంలో ఉంటోంది. డీప్‌ఫేక్‌ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలాంటి పాపులర్‌ యాప్‌లోనూ విచ్చలవిడిగా అప్‌లోడ్‌ చేస్తున్నారు. అలాంటి కంటెంట్‌కు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాకపోవడం గమనార్హం. అయితే..

ఈ మధ్య సెలబ్రిటీలు ఈ తరహా కంటెంట్‌ విషయంలో సీరియస్‌గానే స్పందిస్తున్నారు. దీంతో అరెస్టులు, కేసుల భయంతో ఎడిటర్లు మరో మలుపు తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించుకున్న యువతను టార్గెట్‌ చేసుకుంటున్నారు. 

అరెస్టులతోనే కట్టడి!
భారత్‌లో కఠిన చట్టాలు లేకపోవడమే.. బోల్డ్‌ కంటెంట్‌ వైరల్‌ కావడానికి ప్రధాన కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. చట్టసభలకే వదిలేసి.. ఈ తరహా వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు సైతం ఆసక్తి చూపడం లేదు. కాబట్టి ప్రభుత్వాలే ఉక్కు పాదం మోపాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వాలు(తెలంగాణ సహా) ఈ తరహా కంటెంట్‌పై దృష్టిసారించాయి. తప్పుడు మార్గాల్లో సంపాదించాలని చూస్తే అరదండాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టు బాట పట్టాయి.  ఈ ఏడాదిలో సోషల్‌ మీడియాలో వల్గర్‌ కంటెంట్‌ పోస్టు చేసినందుకు చాలా అరెస్టులే జరిగినట్లు ఆయా రాష్ట్రాల సైబర్‌ విభాగాలు చెబుతున్నాయి. దీంతో ఈ తరహా కఠిన చర్యలతోనే అలాంటి రీల్స్‌కు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు కూడా ఓ అంచనాకి వస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Instagram
Social Media
Influencer
vulgar comments
Objectionable
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

శివాలయంలో అపచారం... దేవుడి దీపంతో

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.