Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. గర్భధారణకు కారణమయ్యే... జెనెటిక్‌ స్విచ్‌
ADVERTISEMENT 

గర్భధారణకు కారణమయ్యే... జెనెటిక్‌ స్విచ్‌

National Sakshi User Sakshi Sakshi Time Nov 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
embrio.jpg

కనిపెట్టిన భారత శాస్త్రవేత్తలు 

జన్యు శాస్త్ర చరిత్రలోనే మైలురాయి

మహిళల్లో గర్భధారణకు అంకురార్పణ చేసే అత్యంత మౌలికమైన జెనెటిక్‌ స్విచ్‌ (జన్యు మీట)ను మన సైంటిస్టులు కనిపెట్టారు! పిండం గర్భాశయ ద్వారంలోకి సజావుగా చేరేందుకు వీలు కల్పించేది ఇదేనట! కనుక ఏ కోణంలో చూసినా దీన్ని జన్యు శాస్త్రంలోనే గాక ప్రసూతి వైద్యంలోనూ అతి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. జన్యు శాస్త్ర ప్రస్థానాన్నే పునర్‌ నిర్వచించగలదని భావిస్తున్న ఈ కీలక పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ ప్రత్యుత్పత్తి, శిశు వైద్య పరిశోధన సంస్థ (ఎన్‌ఐఆర్‌ఆర్‌ సీహెచ్‌), ఇండియన్‌ ఇన్సి్టట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు సారథ్యం వహించడం విశేషం.

 పిండాన్ని తనలోకి స్వీకరించేందుకు గర్భాశయం సన్నద్ధం కావడం వెనక ఇమిడి ఉండే కీలకమైన కణజాల పనితీరును మన సైంటిస్టులు ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చారు. గర్భధారణ జరగాలంటే బుల్లి పిండం గర్భ సంచి మార్గంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని ఇంప్లాంటేషన్‌ గా పిలుస్తారు. గర్భధారణ దిశగా ఇది తొలి అడుగు మాత్రమే కాదు, ఒకరకంగా పునరుత్పత్తి ప్రక్రియ అంతటిలోనూ ఇదే అత్యంత కీలకం. గర్భ విచ్ఛిత్తికే గాక, చివరికి వంధ్యత్వానికి కూడా ఇంప్లాంటేషన్‌ లో వైఫల్యమే మూల కారణం!

ఇలా చేశారు...
హోక్సా10, ట్విస్ట్‌2 అనే రెండు కీలక జన్యువులను సైంటిస్టులు తమ పరిశోధన క్రమంలో గుర్తించారు. గర్భధారణ విషయంలో ఇవి రెండూ పరస్పర విరుద్ధ శక్తులుగా పని చేస్తూనే, అంతిమంగా అందుకు వీలు కల్పించడం విశేషం! ఎందుకంటే హోక్సా10 సాధారణంగా గర్భాశయ ద్వారాన్ని రక్షణాత్మక కణజాలాల సాయంతో నిత్యం మూసి ఉంచి కాపాడుతూ ఉంటుంది. ఇందుకోసం అది అనునిత్యం ఏకంగా 1,200 కణాలను నియంత్రిస్తూ ఉంటుంది. కానీ, సరిగ్గా పిండం ఆ ద్వారం వైపు వచ్చే వేళకు హోక్సా10 తాత్కాలికంగా స్విచ్‌ ఆఫ్‌ మోడ్‌ లోకి వెళ్లిపోతుంది. మరోలా చెప్పాలంటే దాని పనితీరు స్తంభిస్తుందన్నమాట.

 మరుక్షణమే ట్విస్ట్‌2 ఒళ్లు విరుచుకుని క్రియాశీలకం అవుతుంది. గర్భాశయ కణజాలాన్ని మృదువుగా మార్చి పిండం దాని ద్వారం గుండా సజావుగా లోనికి సాగేలా చేస్తుంది. హోక్సా10, ట్విస్ట్‌2 నడుమ సంబంధం వల్ల గర్భాశయ ద్వారం గట్టిదనం నుంచి మృదుత్వాన్ని, అవసరం తీరగానే తిరిగి యథాస్థితికి మారుతున్నట్టు  ఇండియన్‌ ఇన్సి్టట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బృందం రూపొందించిన మ్యాథమాటికల్‌ రీ మోడలింగ్‌ లో తేలింది. అనంతరం ఎలుకల్లో ప్రయోగాత్మకంగా ట్విస్ట్‌2 కార్యకలాపాన్ని నిరోధించి చూడగా గర్భధారణ ప్రక్రియే నిలిచిపోవడాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు కాల్‌ డెత్‌ డిస్కవరీ జర్నల్‌ లో తాజాగా ప్రచురితమయ్యాయి.

ప్రయోజనాలు ఎన్నెన్నో!
ఈ జెనెటిక్‌ స్విచ్‌ ఉనికి వెలుగులోకి రావడానికి ఎంతో ప్రాధాన్యం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ జన్యువులు, వాటి స్వరూప స్వభావాలు, పనితీరు తదితరాల గురించి మనకు ఇప్పటిదాకా తెలిసింది గోరంత అయితే తెలియాల్సిందేమో కొండంత. కీలకమైన జన్యు నెట్‌ వర్క్‌ తదితరాలపై మరింత అవగాహనకు జెనెటిక్‌ స్విచ్‌ వీలు కల్పించగలదు. తద్వారా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు మెరుగైన చికిత్సతో పాటు తీవ్ర గాయాలను త్వరితంగా నయం చేయడం వంటివీ వీలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి‘ అని వారు వివరించారు. ‘కొన్నిసార్లు ఆరోగ్యకరమైన పిండం కూడా ఫలదీకరణ చెందడంలో విఫలమవుతుంటుంది. అందుకు కారణాలను అన్వేషించడంలో జెనెటిక్‌ స్విచ్‌ వ్యవస్థ ఉనికి ఎంతగానో తోడ్పడుతుంది. ఐవీఎఫ్‌ వంటి కృత్రిమ గర్భధారణ చికిత్స ప్రక్రియలు మరింతగా విజయవంతం అయ్యేలా చేయగలదు‘ అని చెప్పుకొచ్చారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Genetic
Indian scientists
embryo
Pregnancy
womens
indian council of medical research
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్

సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్

ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్

ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్

మూత్ర'గండం'!

మూత్ర'గండం'!

కాబోయే అమ్మకు కడుపులో వికారం

కాబోయే అమ్మకు కడుపులో వికారం

షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా

షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా

బిడ్డ బాగానే ఉందా?

బిడ్డ బాగానే ఉందా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.