Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌’గా భారత్‌ 
ADVERTISEMENT 

‘గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌’గా భారత్‌ 

National Sakshi User Sakshi Sakshi Time Nov 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
green-hyd.jpg

2030 నాటికి 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యం  

జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌పై కేంద్రం కీలక ప్రకటన  

రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా  

దేశంలో తొలి పోర్ట్‌ ఆధారిత పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం  

సాక్షి, న్యూఢిల్లీ:  2070 నాటికి ‘నెట్‌ జీరో’ఉద్గారాలను సాధించే దిశగా, 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’గా నిలిచే లక్ష్యంతో భారత్‌ తన ఇంధన ప్రణాళికల్లో ముందడుగు వేస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ హితమైన ‘గ్రీన్‌ హైడ్రోజన్‌’రంగాన్ని ప్రోత్సహించడానికి 2023లో ప్రారంభించిన జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ (ఎన్‌జీహెచ్‌ఎం) ద్వారా భారత్‌ను ఈ రంగంలో గ్లోబల్‌ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను వేగవంతం చేసింది. 2030 నాటికి ఏటా 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల(ఎంఎంటీ) గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజాగా ప్రకటించింది.  

గ్రీన్‌ హైడ్రోజన్‌ అంటే?  
సౌర, పవన విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి, ‘ఎలక్ట్రోలసిస్‌’ప్రక్రియ ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీయడం ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్‌ను గ్రీన్‌ హైడ్రోజన్‌ అంటారు. ప్రతి కిలో హైడ్రోజన్‌ ఉత్పత్తికి రెండు కిలోలకు మించకుండా కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉద్గారాలు ఉంటేనే దానిని ‘గ్రీన్‌ హైడ్రోజన్‌’గా ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుంది.  

మిషన్‌ ప్రధాన లక్ష్యాలు  
గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ద్వారా రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్శించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల శిలాజ ఇంధనాల దిగుమతులు రూ.లక్ష కోట్లకు పైగా తగ్గుతాయని, 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించగలమని భావిస్తోంది. అంతేకాకుండా 2030 నాటికి ఏటా సుమారు 50 ఎంఎంటీ గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను నివారించవచ్చని, తద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతోంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ కోసం 2029–2030 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం రూ.19,744 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.17,490 కోట్లను ‘స్ట్రాటజిక్‌ ఇంటర్వెన్షన్స్‌ ఫర్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ట్రాన్సిషన్‌ (ఎస్‌ఐజీహెచ్‌టీ) కార్యక్రమానికి కేటాయించారు. దీనిద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి కీలకమైన ఎలక్ట్రోలైజర్ల తయారీకి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. దీంతోపాటు పైలట్‌ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, పరిశోధన–అభివృద్ధి కోసం రూ.400 కోట్లు కేటాయించారు.

రంగాలవారీగా పైలట్‌ ప్రాజెక్టులు  
→ ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటికే పలు రంగాల్లో పైలట్‌ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. భారత్‌లో తొలిసారిగా పోర్ట్‌ ఆధారిత గ్రీన్‌ హైడ్రోజన్‌ పైలట్‌ ప్రాజెక్టును వి.ఓ.చిదంబరనార్‌ పోర్ట్‌లో (తమిళనాడు) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. దీంతోపాటు దీనదయాళ్‌ (గుజరాత్‌), పారాదీప్‌(ఒడిశా) పోర్టులను కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు.  

→ 10 వేర్వేరు మార్గాల్లో 37 ఫ్యూయల్‌ సెల్, హైడ్రోజన్‌ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ వాహనాలతో (బస్సులు, ట్రక్కులు) మొబిలిటీ పైలట్‌ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో (లేహ్, 3,650 మీటర్లు) గ్రీన్‌ హైడ్రోజన్‌ మొబిలిటీ ప్రాజెక్టును సైతం ఎన్‌టీపీసీ 2024 నవంబర్‌లో ప్రారంభించింది. 

→ ఉక్కు తయారీలో గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడకంపై ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి ఐదు పైలట్‌ ప్రాజెక్టులను చేపట్టారు. 

→ ఎరువుల తయారీకి శిలాజ ఇంధన ఆధారిత ఫీడ్‌స్టాక్‌లకు బదులుగా గ్రీన్‌ అమ్మోనియా వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. 

→ అంతేకాకుండా ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను, నైపుణ్యాలను ఆకర్శించేందుకు భారత్‌ పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూ రోపియన్‌ యూనియన్‌(ఈయూ), యూ కే, జర్మనీ(ఏ2 గ్లోబల్‌), సింగపూర్‌ వంటి దేశాలతో కలిసి ప్రమాణాలు, సాంకేతికత, మార్కెట్ల అభివృద్ధికి భారత్‌ కృషి చేస్తోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
green
Hydrogen
Global Hub
India
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైడ్రోజన్ రైలు టికెట్ ధర ఎంతంటే?

హైడ్రోజన్ రైలు టికెట్ ధర ఎంతంటే?

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.