Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అలాగైతే గందరగోళమే
ADVERTISEMENT 

అలాగైతే గందరగోళమే

National Sakshi User Sakshi Sakshi Time Aug 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
180.jpg

రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు నిర్దిష్ట గడువు నిర్దేశించలేవు  

లోటుపాట్లు ఉంటే రాజ్యాంగ ప్రక్రియ ద్వారా సరిదిద్దాలి  

ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ జోక్యం తగదు  

సుప్రీంకోర్టుకు లిఖితపూర్వక వివరణ ఇచ్చిన కేంద్రం  

న్యూఢిల్లీ:  రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించి, పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు నిర్దిష్ట గడువు(టైమ్‌లైన్‌) విధించడం వల్ల రాజ్యాంగపరమైన గందరగోళం తలెత్తుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బిల్లులకు సమ్మతి తెలియజేసే లేదా తిప్పి పంపించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు ఉండదని స్పష్టంచేసింది. ఒకవేళ గడువు విధిస్తే రాష్ట్రపతి, గవర్నర్ల అత్యున్నత స్థానాన్ని, గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. 

రాష్ట్రపతి, గవర్నర్ల విధుల్లో లోటుపాట్లు ఉంటే, వారు సక్రమంగా స్పందించకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరైంది కాదని వెల్లడించింది. రాజ్యాంగపరమైన ప్రక్రియ ద్వారా ఆ లోటుపాట్లు సరిదిద్దాలని తెలియజేసింది. సమ్మతి కోసం రాష్ట్రాల అసెంబ్లీల నుంచి వచ్చిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు నిర్దేశించవచ్చా? అనే దానిపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ నోటీసులు జారీ సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఇటీవల లిఖితపూర్వక వివరణను సుప్రీంకోర్టుకు సమరి్పంచారు. ఈ వివరణలో కేంద్రం ఏం చెప్పిందంటే...  

రాజ్యాంగ రూపకర్తలు అవి ఆశించలేదు  
‘‘ప్రభుత్వంలో భాగమైన ఒక వ్యవస్థ రాజ్యాంగం తనకు అప్పగించని విధులు నిర్వర్తించాలని చూస్తే అది చివరకు రాజ్యాంగపరమైన గందరగోళానికే దారితీస్తుంది. ఒక వ్యవస్థ విఫలమైతే లేదా ని్రష్కియాత్మకంగా వ్యవహరిస్తే లేదా పొరపాట్లు చేస్తే... మరో వ్యవస్థ అందులో కలుగుజేసుకోవడం తగదు. ఒక వ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను మరో వ్యవస్థ చెలాయించడం చెల్లదు. రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలకు వాటికంటూ ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు లేదా సంస్థల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైన సందర్భాల్లో కూడా ఒక వ్యవస్థకు లేని అధికారాలు చెలాయించడానికి అనుమతి ఇస్తే రాజ్యాంగపరమైన విపరిణామాలే సంభవిస్తాయి.    

లేని అధికారాలను కల్పించడం లేదు
రాజ్యాంగం మన దేశంలో చట్టబద్ధమైన పాలనను స్థిరపర్చింది. వ్యవస్థల మధ్య సున్నితమైన సమతౌల్యాన్ని నిర్దేశించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువులు విధిస్తే గనుక ఆ సమతౌల్యాన్ని నీరుగార్చినట్లే అవుతుంది. రాజ్యాంగంలోని అర్టికల్‌ 142 అనేది కోర్టులకు లేని అధికారాలను కల్పించడం లేదు. రాజ్యాంగ, శాసన 
విభాగాల బాధ్యతలు, అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. రాష్ట్రపతి, గవర్నర్లది రాజకీయంగా అత్యున్నత స్థాయి.  

చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌ ఉన్నప్పటికీ..   
ఆరి్టకల్‌ 200, 201లు రాష్ట్రపతి, గవర్నర్లకు ఎలాంటి టైమ్‌లైన్‌ విధించడం లేదు. బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు ప్రత్యామ్నాయాల గురించి మాత్రమే అవి చెబుతున్నాయి. రాజ్యాంగానికి లోబడి ఒక వ్యవస్థను మరో వ్యవస్థ అదుపు చేసే విధానం(చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌) ఉన్నప్పటికీ అదే రాజ్యాంగం ప్రకారం సమాజంలో మూడు మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వహక, న్యాయ విభాగాలకు వాటికే సంబంధించిన ప్రత్యేక అధికారాలు (జోన్లు) ఉంటాయి. మరో విభాగం అందులో వేలుపెట్టలేదు. రాష్ట్రపతి, గవర్నర్లకు సైతం వారికే ప్రత్యేకమైన అధికారాలు, అత్యున్నత హోదాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
State Legislative Assembly
bills
president
Governors
Courts
Central Government
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం

ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం

భారత్‌పై  విషం చిమ్మిన పాక్‌

భారత్‌పై విషం చిమ్మిన పాక్‌

నేడే నీట్‌ రీఎగ్జామ్‌

నేడే నీట్‌ రీఎగ్జామ్‌

మీ అనురాగమే నన్ను ముందుకు నడిపిస్తోంది

మీ అనురాగమే నన్ను ముందుకు నడిపిస్తోంది

టెలిగ్రామ్‌పై నిషేధం సబబే

టెలిగ్రామ్‌పై నిషేధం సబబే

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.