Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
ADVERTISEMENT 

సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు

National Sakshi User Sakshi Sakshi Time Apr 6, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
IAF_20Jaguar_20pilot_20Siddharth_20Yadav.jpg

చంఢీగఢ్‌ : గుజరాత్ జామ్‌నగర్‌లో ఈ బుధవారం జాగ్వార్ జెట్‌లో మరణించిన భారత వాయుసేన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్‌ అంత్యక్రియలు ముగిశాయి. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఆయన స్వగ్రామామైన భలాకీ మజ్రాలో సైనిక లాంఛనాలతో  అంత్యక్రియలు జరిగాయి.  

వేలాది మంది స్థానికులు, వాయుసేన అధికారులు, ఇతర సైనికులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని సిద్ధార్థ్ యాదవ్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. పది రోజుల క్రితం సిద్ధార్థ యాదవ్‌, సానియాల ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. నవంబర్‌ 2న పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో కాబోయే భార్య సానియా.. సిద్ధార్ధ్‌ అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.

అంత్యక్రియలు ముగిసే సమయంలో సానియా గుండెలవిసేలా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.‘సిద్ధార్ధ్‌  ముఖాన్ని చూపించండి. ఇంకోసారి సిద్ధార్ధ్‌ ముఖాన్ని చూడనివ్వండి అని భౌతిక ఖాయం వద్ద గుండెలవిసేలా ఏడుస్తున్న దృశ్యాలు చూపురలను కంటతడి పెట్టిస్తున్నాయి. ‘బేబీ నన్ను తీసుకెళ్లేందుకు నువ్వు ఎందుకు రాలేదు. నువ్వు నాకు ప్రామిస్‌ చేశావ్‌ కదా అంటూ సిద్ధార్ధ్‌ భౌతికఖాయంతో సంభాషించడం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.

What a heart wrenching moment...#SiddharthYadav got engaged 10 days back, marriage was due on 2nd November...his fiance says: Baby तू आया नहीं...तूने कहा था मुझे लेने आएगा। #jaguarcrash #Rewari pic.twitter.com/c7KGJOQixr

— Rahul Yadav (@Raahulrewari) April 4, 2025

 

అంతా బాగున్నప్పుడు కాదు.. ప్రమాదంలో 
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌ పైలట్‌ సిద్ధార్థ్‌ యాదవ్‌ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది.  

#BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR

— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025

 

తాను మరణిస్తూ.. మరికొందరికి
కో పైలట్‌తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్‌ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానం జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్‌ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

IAF's Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat. More details awaited.#planecrash pic.twitter.com/Xz8UAGeasc

— Kedar (@Kedar_speaks88) April 2, 2025

 

చివరి క్షణాల్లోనూ... 
బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్‌ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్‌ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్‌ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. సిద్ధార్థ్ ఇటీవలే సెలవులనుంచి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ ప్రమాదం ఒక సాధారణ శిక్షణ ఫ్లైట్ సమయంలో జరిగింది.

విచారంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌  
ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మృతిపై భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి మేం అండగా నిలుస్తాం. ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ కమిటీని నియమించినట్లు తెలిపింది.  

హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ట్వీట్‌ 
సిద్ధార్ధ్‌ యాదవ్‌ మరణంపై హర్యానా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ విచారం వ్యక్తం చేశారు. జామ్‌నగర్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేవారి జిల్లా మజ్రా (భాల్ఖీ) గ్రామానికి చెందిన పుత్రుడు, జాగ్వార్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్‌కు నా శ్రద్ధాంజలి. ఈ త్యాగం ఎప్పటికీ మరిచిపోలేము. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలి’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IAF
Heartbreaking
Siddharth
Gujarat
national
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.