లక్నో: కొద్ది రోజులుగా వర్షాలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. వరదలతో నదులు ఉప్పొంగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కోత్వాలీ నది ఉద్దృతంగా ప్రవహిస్తోంది. దీంతో యూపీ-ఉత్తరఖండ్ సరిహద్దుల్లో రోడ్డుపై వరద నీరు ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో హరిద్వార్ వెళ్తున్న ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది.
ఈ ఘటనలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం.. జేసీపీ మిషన్లతో సహాయక చర్యలు చెపట్టింది.
#उत्तरप्रदेशः #बिजनौर के मंडावली में #कोटावाली नदी का जलस्तर बढ़ा, एक बस तेज बहाव में फंसी, बस में करीब 40 यात्री सवार, जेसीबी से सभी का रेस्क्यू किया गया#UttarPradesh #bus #river #Bijnor #NewsUpdate pic.twitter.com/ZVUghS0wYm
— News of Rajasthan (@NewsRajasthani) July 22, 2023
జేసీబీ మిషన్లతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. ఆ తర్వాత బస్సును కూడా బయటకు లాగారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#बिजनौर में कोटा वाली नदी के बीच तेज बहाव में फंसी नजीबाबाद से हरिद्वार जा रही बस
नदी में बस फंसने के बाद बस में मौजूद सवारियों को जेसीबी के सहारे सकुशल बाहर निकाला गया.#Bijnor #bijnorviralvideo #bijnorbus #bus #kotariver #haridwar #bijnaur #viralvideo #ManipurVideo pic.twitter.com/lEetwrOuGQ— Shailendra Singh (@Shailendra97S) July 22, 2023
ఇదీ చదవండి: తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి..