Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అడవిలో ఇన్నోవా కారు.. గోల్డ్‌ బిస్కెట్స్‌, కరెన్సీ నోట్లు..
ADVERTISEMENT 

అడవిలో ఇన్నోవా కారు.. గోల్డ్‌ బిస్కెట్స్‌, కరెన్సీ నోట్లు..

National Sakshi User Sakshi Sakshi Time Dec 21, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Gold.jpg

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో పార్క్‌ చేసిన కారులో 40 కోట్ల విలువైన బంగారం, 10 కోట్ల నగదు దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బంగారం దొరికిన కారును గ్వాలియర్‌కు చెందిన చేతన్‌ గౌర్‌కు చెందినది గుర్తించారు.

వివరాల ప్రకారం..భోపాల్‌ శివారులోని మెండోరి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనం నుంచి సుమారు రూ.40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ, ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గురువారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో, అధికారులు అలర్ట్‌ అయ్యారు. అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు చేరుకుని ఇన్నోవాను చుట్టుముట్టారు.

అనంతరం.. ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో భారీ మొత్తంలో బంగారం, రూ.10కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక, వాహనం గ్వాలియర్‌ వాసి చేతన్‌ గౌర్‌కు చెందినదిగా  గుర్తించారు. చేతన్‌ గౌర్‌.. ఆర్టీవో ఆఫీసులో మాజీ కానిస్టేబుల్‌ సౌరభ్‌ శర్మకు అత్యంత సన్నిహితుడు. ఇక, ఈ బంగారం, నగదు ఎవరిదనే విషయమై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల మధ్య సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.

#WATCH | Madhya Pradesh | In a joint action by Bhopal Police and Income Tax, 52 kg of gold and bundles of money were found in an abandoned car in Bhopal during an IT raid. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying… pic.twitter.com/7KOoJ4AZBJ

— ANI (@ANI) December 20, 2024

అయితే, అక్రమ ఆస్తుల కేసుల్లో భోపాల్‌కు చెందిన మాజీ కానిస్టేబుల్‌ శర్మ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన ఇళ్లపై అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఈ సోదాల్లో కోటి రూపాయలకు పైగా నగదు, కిలోన్నర బంగారం, వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించారు. ఆయనకు చెందిన 10 లాకర్లు, 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వివరాల పత్రాలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా భోపాల్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు చెందిన వ్యక్తులే టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Madya pradesh
Bhopal
gold biscuits
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ట్విషా శర్మ మృతి కేసు: జైలుకు రిటైర్డ్ మహిళా జడ్జి

ట్విషా శర్మ మృతి కేసు: జైలుకు రిటైర్డ్ మహిళా జడ్జి

సాక్ష్యం చెబితే ఖబడ్దార్‌.. ట్విషా శర్మ భర్త గూండాగిరీ!

సాక్ష్యం చెబితే ఖబడ్దార్‌.. ట్విషా శర్మ భర్త గూండాగిరీ!

51 రోజుల్లో 11మంది అనాథ దివ్యాంగుల మృతి?

51 రోజుల్లో 11మంది అనాథ దివ్యాంగుల మృతి?

పత్తి యంత్రం రెడీ

పత్తి యంత్రం రెడీ

సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

ప్రియురాలి హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం

ప్రియురాలి హత్య.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.