Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ISRO: ‘గగన’ విజయం
ADVERTISEMENT 

ISRO: ‘గగన’ విజయం

National Sakshi User Sakshi Sakshi Time Oct 22, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
211020230111-PTI10_21_2023_.jpg

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): మానవసహిత అంతరిక్ష ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ఆ ప్రయత్నంలో తొలి విజయం సాధించింది. విజయసోపానాల్లో తొలిమెట్టుగా భావిస్తున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టు సన్నాహకాల్లో భాగంగా ఇస్రో చేపట్టిన మానవరహిత క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌(సీఈఎస్‌) పరీక్ష విజయవంతమైంది. సతీష్‌ దవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక ఇందుకు వేదికైంది.

ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 10 గంటలకు గగన్‌యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ (టీవీ–డీ1) వాహకనౌకను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 16.9 కి.మీ.ల ఎత్తులో అందులోంచి క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్, ఎస్కేప్‌ మాడ్యూల్‌లు విడిపోయి వేర్వేరు పథాల్లో ప్రయాణించి బంగళాఖాతంలో సురక్షితంగా పడ్డాయి. క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌ను డ్రోగ్‌ పారాచూట్‌లు సురక్షితంగా సముద్రజలాలపై ల్యాండ్‌ అయ్యేలా చేశాయి. మానవసహిత ప్రయోగాలు చేపట్టినపుడు అందులోని వ్యోమగాములను క్రూ మాడ్యూల్‌ ఎలా సురక్షితంగా బయటపడేయగలదన్న అంశాన్ని పరీక్షించేందుకే ఈ ఎస్కేప్‌ మాడ్యూల్‌ పరీక్ష చేశారు.



17 కిలోమీటర్ల ఎత్తుకెళ్లి తిరిగి సముద్రంలోకి ..

టెస్టు వెహికల్‌ (టీవీ–డీ1) ప్రయోగాన్ని 10.10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇందులో భాగంగా సింగిల్‌ స్టేజీ ద్రవ ఇంధర రాకెట్‌(టీవీ–డీ1)పై క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్, ఎస్కేప్‌ మాడ్యూల్‌లను అమర్చారు. రాకెట్‌ను ప్రయోగించాక అత్యవసర స్థితి(అబార్ట్‌)ను సిములేట్‌ చేశారు. దీంతో రాకెట్‌ 11.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్, ఎస్కేప్‌ మాడ్యూల్‌లు వేరువడటం ప్రారంభమైంది.

రాకెట్‌ 16.6 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకున్నాక క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్, ఎస్కేప్‌ మాడ్యూల్‌లు రాకెట్‌ నుంచి విడివడి వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో పడ్డాయి. అయితే క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌ను సేకరించే ఉద్దేశంతో అది సురక్షితంగా సముద్రంలో పడేలా తొలుత రెండు డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకుని నెమ్మదిగా కిందకు దిగేందుకు సాయపడ్డాయి.

తర్వాత మరో పెద్ద పారాచూట్‌ విచ్చుకుని ల్యాండింగ్‌ను దిగి్వజయం చేసింది. సమీప సముద్ర జలాల్లో ప్రత్యేక లాంచీలో వేచి ఉన్న కోస్టల్‌ నేవీ బలగాలు ఆ మాడ్యూల్‌ను సురక్షితంగా శ్రీహరికోటకు చేర్చారు. అయితే మానవ సహిత గగన్‌యాన్‌ ప్రయోగాలు భవిషత్తులో చేయడానికి ఇలాంటి ప్రయోగాలు మరో మూడు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

నాలుగోసారి క్రూ మాడ్యూల్‌లో వ్యోమగాములను పోలిన బొమ్మలను అమర్చి క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌ను పరీక్షిస్తారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత 2024 చివర్లో లేదా 2025 ప్రథమార్ధంలో మానవ సహిత ప్రయోగాలు చేయనున్నారు.  గగన్‌యాన్‌ టీవీ–డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ఆనందం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మిషన్‌ డైరెక్టర్‌ శివకుమార్, డైరెక్టర్‌ సునీల్, వీఎస్‌ఎస్‌సి డైరెక్టర్‌ ఉన్ని కృష్ణన్‌నాయక్, డైరెక్టర్‌ నారాయణ పాల్గొన్నారు.



గగన్‌యాన్‌ సాకారం దిశగా మరింత చేరువకు: ప్రధాని మోదీ

‘టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ–డీ1)’ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించడంతో ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టు సాకారం దిశగా ఈ ప్రయోగం మనల్ని మరింత చేరువ చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు’ అంటూ వారిని అభినందిస్తూ ప్రధాని మోదీ శనివారం ట్వీట్లు చేశారు.



మొదట తడబడినా..

మొదట శుక్రవారం రాత్రి ఏడింటికి మొదలైన 13 గంటల కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 8 గంటలకు ముగిశాక ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో శనివారం తెల్లవారుజామున వర్షం పడడంతో వాతావరణం అనుకూలించని కారణంగా కౌంట్‌డౌన్‌ సమయాన్ని మరో 30 నిమిషాలు పెంచారు. తర్వాత 15 నిమిషాల వ్యవధిలోనే అంటే 8.15 గంటలకు రాకెట్‌ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసి 8.45గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టారు. హఠాత్తుగా ఇంజన్‌ను మండించే ప్రక్రియలో లోపం తలెత్తింది.

దీంతో రాకెట్‌ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లకుండా ఆగిపోయింది. దీంతో ప్రయోగాన్ని ఆటో మేటిక్‌ లాంచ్‌ సీక్వెన్స్‌లోని ఆన్‌ బోర్డు కంప్యూటర్‌ ఆపేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయితే దీన్ని సవాల్‌గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తల టైగర్‌ సేఫ్టే బృందం వెంటనే లాంచ్‌ ప్యాడ్‌ వద్దకు వెళ్లి సాంకేతిక లోపాన్ని సరిచేసింది. దీంతో మళ్లీ 9.33 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఎట్టకేలకు 10.03 గంటలకు గగన్‌యాన్‌ టీవీ–డీ1 విజయవంతంగా ప్రయోగించారు. 10 నిమిషాల 10 సెకన్లలో మొత్తం ప్రయోగం విజయవంతంగా పూర్తయింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Indian Space Research Organisation (ISRO)
Gaganyaan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గగన్‌యాన్‌ డ్రోగ్‌ పారాచూట్‌ పరీక్ష విజయవంతం 

గగన్‌యాన్‌ డ్రోగ్‌ పారాచూట్‌ పరీక్ష విజయవంతం 

‘గగన్‌యాన్‌’పై మున్ముందుకే..

‘గగన్‌యాన్‌’పై మున్ముందుకే..

ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో దశ పరీక్ష విజయవంతం 

ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో దశ పరీక్ష విజయవంతం 

2026 ప్రారంభంలోనే పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగం!

2026 ప్రారంభంలోనే పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగం!

సౌర తుపాను అధ్యయనంలో ఆదిత్య–ఎల్‌1 కీలకం: ఇస్రో 

సౌర తుపాను అధ్యయనంలో ఆదిత్య–ఎల్‌1 కీలకం: ఇస్రో 

మన అంతరిక్ష కేంద్రానికి తుది రూపు 

మన అంతరిక్ష కేంద్రానికి తుది రూపు 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.