Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. షెల్లింగ్‌ లేదు, కాల్పులు లేవు
ADVERTISEMENT 

షెల్లింగ్‌ లేదు, కాల్పులు లేవు

National Sakshi User Sakshi Sakshi Time May 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
agg.jpg

 19 రోజుల తరువాత సరిహద్దు రేఖ వెంబడి ప్రశాంతంగా గడిచిన రాత్రి 

జమ్మూ/శ్రీనగర్‌/చండీగఢ్‌: భారత్‌–పాకిస్తాన్‌ కాల్పుల విరమణ అనంతరం ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జమ్మూకశ్మీర్, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉంది. 19 రోజుల్లో మొదటిసారిగా షెల్లింగ్, కాల్పులు జరగకుండా ఉన్నాయని ఆర్మీ తెలిపింది. ఏప్రిల్‌ 22న పహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘనలలో మొదటిసారి పూర్తిగా విరామం కనిపించింది.  

కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల తర్వాత, శనివారం రాత్రి, పాకిస్తాన్‌ జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు మీదుగా వరుస క్షిపణి, డ్రోన్‌ దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. పూంచ్‌లోని సురాన్‌కోట్‌లో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి. 

పహల్గాం దాడి తరువాత ఏప్రిల్‌ 23 నుంచి మే 6 వరకు, నియంత్రణ రేఖ వెంబడి అనేక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట సూరన్‌కోట్‌లో భారీ కాల్పులు జరిగాయి. దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. దాడి తరువాత, నివాసితులు పట్టణం నుంచి పారిపోయారు. కొందరు సమీపంలోని కొండ గ్రామాలు మరియు బంకర్లలో ఆశ్రయం పొందారు. మరికొందరు జమ్మూలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 

పరిస్థితి ఇప్పుడు మెరుగుపడటంతో, ప్రజలు త్వరలో పూంచ్‌లోని తమ ఇళ్లకు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. శ్రీనగర్, పఠాన్‌కోట్, రాజౌరి, అఖ్‌నూర్, జమ్మూ, కుల్గాం, శ్రీ గంగానగర్, బుద్గాంలలో సాధారణ పరిస్థితికి అద్దం పడుతూ అనేక దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. సరిహద్దు ప్రాంతాలకే కాకుండా, చండీగఢ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 

రోజువారీ జీవితం తిరిగి ప్రారంభమైందని, పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని చండీగఢ్‌ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు సాధారణ సమయాల ప్రకారం తెరిచి ఉండటానికి పోలీసులు అనుతించారు. అయితే పౌరులు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని డిప్యూటీ కమిషనర్‌ హెచ్చరించారు. పగటి పూట ఎలాంటి సమస్యలు లేవని, రాత్రి 7.30 గంటల తరువాత దుకాణాలు మూసివేస్తుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందేమీ లేదని, ప్రజల జీవనోపాధి కూడా ప్రభావితం కావడం లేదని జైసల్మేర్‌కు చెందిన ఓ వ్యక్తి వివరించారు.  
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India Pakistan border
ceasefire agreement
Jammu Kashmir
line of control
international border
Operation Sindoor
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అరవై రోజుల్లో తుది ఒప్పందం? 

అరవై రోజుల్లో తుది ఒప్పందం? 

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

ముగిసిన ఇరాన్‌-అమెరికా యుద్ధం

ముగిసిన ఇరాన్‌-అమెరికా యుద్ధం

ఒప్పందానికి మిత్రపక్షాల గ్రీన్‌సిగ్నల్‌

ఒప్పందానికి మిత్రపక్షాల గ్రీన్‌సిగ్నల్‌

పాక్‌ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్‌ అక్కడే!

పాక్‌ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్‌ అక్కడే!

ఒకే కశ్మీర్.. రెండు విభిన్న వాస్తవాలు!

ఒకే కశ్మీర్.. రెండు విభిన్న వాస్తవాలు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.