Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. జూనియర్‌ ఇంజినీర్‌ను బురదలో నడిపించిన రైతు నాయకుడు!
ADVERTISEMENT 

జూనియర్‌ ఇంజినీర్‌ను బురదలో నడిపించిన రైతు నాయకుడు!

National Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Farmer-leader-makes.jpg

మహా నగరాలు, పట్టణాలు.. గ్రామాలు ఎక్కడైనా కానివ్వండి. తవ్వేసిన రహదారులు, నెలలకొద్దీ పూర్తికాని పారిశుద్ధ్యం పనులు సర్వసాధారణం. ఇక వీధుల్లోని సిమెంటు రహదారుల విషయమైతే చెప్పాల్సిన అవసరమే లేదు. గంటల్లో తవ్వి తీస్తారు కానీ.. అవశేషాలు మాత్రం అలాగే పడి ఉంటాయి. కొత్త రోడ్డు వేసేందుకూ వారాలకు వారాలు సమయం పడుతుంది. ఇలా చేస్తే ప్రజలకు ఎంత ఇబ్బందన్నది అస్సలు పట్టింపు ఉండదు. కాంట్రాక్టర్‌ ఎవరో తెలియదు.. తెలిసినా సామాన్యులు ఎవరూ ఎందుకిలా అని అడగలేరు. అడిగినా.. పట్టించుకుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫూర్‌పూర్‌లోనూ ఇలాంటి తంతే ఒకటి నడిచింది కానీ.. ఓ రైతు నాయకుడు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ప్రభుత్వ అధికారికి ప్రజాగ్రహం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. అసలు విషయం ఏమిటంటే..

అది చెప్పే ముందు ఈ ట్వీట్‌ చూడండి... https://x.com/ggganeshh/status/1986069720668537230 ఎర్ర టీషర్ట్‌ వేసుకున్న వ్యక్తి రైతు సంఘం నాయకుడు అంకుశ్‌ చౌదరి. పక్కనున్న వ్యక్తి సాగునీటి విభాగం జూనియర్‌ ఇంజినీర్‌ సచిన్‌ పాల్‌. పంట కాలువల పూడికను కాస్తా రహదారిపై వదిలేశారట సాగునీటి విభాగం వారు. ఎంతకీ తీయకపోవడంతో వీధి వీధంతా కంపు కొడుతోంది. పైగా ఆ బురదలో ప్రజలు నడవడమే కష్టమైపోయింది. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదేమో ఇంజినీరు సారు.. అంకుశ్‌ చౌదరి ఆగ్రహం నశాళానికి ఎక్కింది. జూనియర్‌ ఇంజినీర్‌ సచిన్‌ పాల్‌ చొక్కా పట్టేసుకున్నాడు. ఆ నల్లటి, దుర్గంధభరితమైన బురదలో నడిపించాడు. రోడ్లు ఇలా ఉంటే మేము మా ఇళ్లకెలా వెళ్లాలి పటేలా? పొలాలకు దారేది పటేలా? అంటూ అతడిని బురదలో నడిపించాడు. చుట్టూ ఉన్న వారు ఇంజినీర్‌కు తగిన శాస్తి జరిగిందని సంబరపడ్డారు కానీ.. ఈ ఘటన కాస్తా వాడి వేడి చర్చకు దారితీసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తప్పని, అంకుశ్‌ చౌదరి చేసింది సరైన పనేనని కొందరు సమర్థిస్తే... మరికొందరు వ్యతిరేకించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వారు అంటున్నారు.

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. కర్ణాటక రాజధాని బెంగళూరులో రహదారుల దుస్థితిపై చాలాకాలంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. కొంతమంది అకడక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కూడా. రోడ్లు వేయకపోతే ట్యాక్సులు కట్టమని కొందరు... రోడ్లు, ఫుట్‌పాత్‌లలో పేరుకుపోయిన చెత్తను హైలైట్‌ చేస్తూ ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు వాసుల ప్రజాస్వామ్యయుతమైన నిరసనతో కొంచెం ఆలస్యంగానైనా ప్రయోజనం ఉంటుందేమోకానీ.. క్షణికావేశంలో అంకుశ్‌ చౌదరిలా ప్రవర్తిస్తే మాత్రం ఏమవుతుందో చెప్పలేము.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Uttar Pardesh
Farmer
engineer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్‌

సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్‌

చల్‌..చల్‌ గుర్రం... ఆశల సేద్యం

చల్‌..చల్‌ గుర్రం... ఆశల సేద్యం

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

మూడో ఏడాదీ మోసమే!

మూడో ఏడాదీ మోసమే!

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.