Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఐఐటీల్లో భారీగా అధ్యాపకుల కొరత..
ADVERTISEMENT 

ఐఐటీల్లో భారీగా అధ్యాపకుల కొరత..

National Sakshi User Sakshi Sakshi Time Jul 6, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
IITS-India.jpg

న్యూఢిల్లీ: దేశంలో నాణ్య‌మైన విద్య‌ను అందించే సంస్థలుగా పేరు గాంచిన ఐఐటీలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ప్ర‌ధాన ఐఐటీలు అన్నింటిలోనూ అధ్యాపకుల కొర‌త ఉంద‌ని తెలుస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో మొత్తం మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో దాదాపు 38 శాతం ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఐదు అధ్యాపక పోస్టులలో దాదాపు రెండు ఖాళీగా ఉన్నాయని హిందుస్తాన్ టైమ్స్ వెల్ల‌డించింది. విద్యార్థుల సంఖ్యను పెంచుతూ, కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ, దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తున్న సమయంలో ఐఐటీల్లో ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

4,804 పోస్టులు ఖాళీ
ఈ ఏడాది జనవరి 30 నాటికి ఐఐటీలలో మంజూరైన 12,498 అధ్యాపక పోస్టుల్లో 4,804 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఐఐటీ పాట్నాలో 54.6 శాతం, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 51.3 శాతం పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. మరో 12 ఐఐటీల్లో మూడింట ఒక వంతుకంటే ఎక్కువ పోస్టులు భర్తీ కాలేదు.

కార‌ణాలు ఇవే
అధ్యాపక పోస్టుల్లో ఖాళీలు భ‌ర్తీకాక‌పోవ‌డానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రమైన పోటీ కారణమని ఐఐటీల డైరెక్టర్లు చెబుతున్నారు. ఉత్తమ పీహెచ్‌డీ పట్టభద్రులను ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలు, బహుళజాతి పరిశోధనా సంస్థలు, డీప్‌టెక్ స్టార్టప్‌లు ఆకర్షిస్తున్నాయని వెల్ల‌డించారు. అలాగే ఐఐటీలు అత్యంత కఠినమైన నియామక ప్రమాణాలను పాటిస్తుండటంతో తగిన అభ్యర్థులు దొరికే వరకు పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయని చెప్పారు.

ప్రస్తుతం దేశంలోని ఐఐటీల్లో 1.35 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2028-29 నాటికి మరో 6,500 సీట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అధ్యాపకుల కొరత ఈ విస్తరణ ప్రణాళికలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అక్క‌డే అత్య‌ధిక ఖాలీలు! 
మొదటి తరం ఐఐటీలలో ఐఐటీ ఖరగ్‌పూర్ (51.3%), ఐఐటీ కాన్పూర్ (39%), ఐఐటీ బాంబే (38.4%), ఐఐటీ ఢిల్లీ (38.3%)ల్లో అధిక ఖాళీలు నమోదయ్యాయి. రెండో తరం ఐఐటీలలో ఐఐటీ పట్నా (54.6%), ఐఐటీ మండి (39.9%)ల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మూడో తరం ఐఐటీలలో ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్ (48.4%), ఐఐటీ గోవా (45.8%), ఐఐటీ గువాహటి (42.2%) కూడా అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఐఐటీ ధార్వాడ్‌లో కేవలం 1.07 శాతం ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఐఐటీ పలక్కాడ్ (5.88%), ఐఐటీ రోపర్ (14.35%), ఐఐటీ తిరుపతి (14.38%), ఐఐటీ భిలాయ్ (15.1%) తక్కువ ఖాళీలతో మెరుగైన స్థితిలో ఉన్నాయి.

ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీలు ఏడాది పొడవునా నియామక ప్రక్రియలు నిర్వహిస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ గాంధీనగర్ వంటి సంస్థలు ప్రత్యేక నియామక డ్రైవ్‌లు, మిషన్ మోడ్ రిక్రూట్‌మెంట్, అంతర్జాతీయ పరిశోధన భాగస్వామ్యాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లను బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నాయి.

స‌వాళ్లు ఎన్నో...
ప్రతిభావంతులు విదేశాల్లో ఉద్యోగాల‌కు మొగ్గు చూపుతున్నార‌ని, ఫ‌లితంగా త‌మ‌కు నాణ్య‌మైన అభ్య‌ర్థులు దొర‌కం లేద‌ని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మ‌నీంద్ర అగ‌ర్వాల్ తెలిపారు. "అత్యుత్తమ నాణ్యత గల పీహెచ్‌డీ పట్టభద్రుల కొరత కారణంగా ఈ సమస్య కొనసాగుతోంది. చాలా మంది ప్రతిభావంతులు విదేశాల్లో అవకాశాలను ఎంచుకుంటున్నారు" అని ఆయ‌న అన్నారు. అధ్యాప‌కుల ఎదుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డం స‌వాలుగా మారింద‌ని ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుమ‌న్ చ‌క్ర‌వ‌ర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. "ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించడం మాత్రమే కాదు, వారు అభివృద్ధి చెందేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ వాతావరణాన్ని సృష్టించడం ఇప్పుడు ప్రధాన సవాలు" అని పేర్కొన్నారు.

60 శాతం ఖాళీలు వారివే..
కులాల వారీగా ఖాళీల వివరాలను 9 ఐఐటీలు వెల్ల‌డించాయి. ఈ గణాంకాల ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన 888 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో దాదాపు 60 శాతం ఈ వర్గాలకు చెందినవే కావడం గ‌మ‌నార్హం. ఓబీసీ వర్గానికి చెందిన 477 పోస్టులు, సాధారణ వర్గానికి 443, ఎస్సీ 261, ఈడబ్ల్యూఎస్‌ 170, ఎస్టీ 150 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడైంది.

పారదర్శకత అవసరం
నియామక ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరమని ఫ్యాకల్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్‌కు స్పష్టమైన ప్రమాణాలు ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి విభాగం తమ సొంత విధానాన్ని అనుసరిస్తుండటంతో ఎంపిక ప్రక్రియ ఒకేవిధంగా సాగ‌డం లేద‌ని వారు అంటున్నారు. ఏదీ ఏమైనా దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీలలో ఇంత భారీ స్థాయిలో అధ్యాపకుల కొరత, విద్యావ్య‌వ‌స్థ‌కు ఏమాత్రం మంచిదికాద‌ని.. ఖాళీల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా భ‌ర్తీ చేయాల‌ని నిపుణులు కోరుతున్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
iit
IIT Bombay
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏ ర్యాంకర్ చేయని సాహసం.. ఐఐటీ బాంబే సీటు వదులుకుని!

ఏ ర్యాంకర్ చేయని సాహసం.. ఐఐటీ బాంబే సీటు వదులుకుని!

జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదల

చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..!

చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..!

వాతావరణ విపత్తుల ధాటికి చెక్

వాతావరణ విపత్తుల ధాటికి చెక్

లండన్‌లో పానీ పూరీ అమ్ముతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్‌..!

లండన్‌లో పానీ పూరీ అమ్ముతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్‌..!

ఐఐటీలకు ‘బూస్ట్‌’

ఐఐటీలకు ‘బూస్ట్‌’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.