Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు
ADVERTISEMENT 

‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు తగదు

National Sakshi User Sakshi Sakshi Time Sep 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sakhsi.jpg

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

సీఎం చంద్రబాబుకు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఘాటు లేఖ

కేవలం ‘సాక్షి’నే లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడంపై తీవ్ర ఆందోళన

ఇది అధికార దుర్వినియోగమేనని స్పష్టీకరణ

విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు వేధించడం దారుణం

పత్రికల గొంతు నొక్కే చర్యలను తక్షణమే ఆపాలని డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి, ప్రత్యేకించి ‘సాక్షి’ మీడియా సంస్థను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీలో ‘సాక్షి’ మీడియా సంస్థతోపాటు జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. 

ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఒక ఘాటు లేఖ రాసింది. ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు అనంత్‌ నాథ్, ప్రధాన కార్యదర్శి రూబెన్‌ బెనర్జీ, కోశాధికారి కె.వి. ప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఒక్క పత్రికపైనే ఎందుకు?
ఒక రాజకీయ నాయకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రచురించినందుకు ఇతర మీడియా సంస్థలను వదిలిపెట్టి, కేవలం ‘సాక్షి’పై మాత్రమే క్రిమినల్‌ కేసు నమోదు చేయడాన్ని ఎడిటర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనమని, నేర చట్టాలను ఎంపిక చేసుకుని ప్రయోగించడం పోలీసుల అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని పేర్కొంది. ఇది సాధారణ జర్నలిజంలో భాగమే అయినప్పటికీ, ‘సాక్షి’ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.

వేధింపులు ఆపండి 
పత్రికలను అనవసరమైన, కక్ష సాధింపు ఫిర్యాదులతో వేధించకూడదని ఎడిటర్స్‌ గిల్డ్‌ హితవు పలికింది. పోలీసుల ప్రవర్తన నిష్పక్షపాతంగా, వృత్తిపరంగా ఉండాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రా­సే సంస్థలను భయపెట్టేలా ఉండకూడదని స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను అణచివేయడానికి, భయపెట్టడానికి క్రిమి­నల్‌ చట్టాలను ఆయుధాలుగా వాడటం రా­జ్యాంగ విరుద్ధమని తెలిపింది. తక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పత్రికలు నిర్భయంగా విధులను నిర్వర్తించే వాతావరణాన్ని కల్పించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌ చేసింది.

సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు పత్రికా స్వేచ్చపై దాడే: ఐజేయూ
‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని ఇండియన్‌ జర్నలిస్ట్ యూనియన్‌(ఐజేయూ) తీవ్రంగా విమర్శించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతోనే సాక్షి దినపత్రిక, పాత్రికేయులను వేధిస్తోందని ఐజేయూ ప్రధాన కార్యదర్శి బల్విందర్‌సింగ్‌ జమ్ము శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. 

సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు ఇటీవల తనిఖీలు చేయడం, ఆయనకు నోటీసులు జారీ చేయడం పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. సాక్షి ఎడిటర్, పాత్రికేయులను భయపెట్టేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

పత్రికలను నియంత్రించాలని ఏ ప్రభుత్వం భావించకూడదన్నారు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని బల్విందర్‌సింగ్‌ స్పష్టంచేశారు. కానీ, పత్రికలపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్చను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి చర్యలను ఐజేయూ ఏమాత్రం ఆమోదించదని స్పష్టంచేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
letter
dhananjaya Reddy
Sakshi New Paper
freedom of Press
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.