Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. తుది అంకానికి చేరిన ‘మహా’ హైడ్రామా.. సీఎంగా ఫడ్నవిస్‌?
ADVERTISEMENT 

తుది అంకానికి చేరిన ‘మహా’ హైడ్రామా.. సీఎంగా ఫడ్నవిస్‌?

National Sakshi User Sakshi Sakshi Time Nov 28, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
FADNVIS.jpg

పట్టు సడలించి డిప్యూటీ సీఎం పదవికి పరిమితం కానున్న ఏక్‌నాథ్‌ షిండే 

షిండేతో పాటు మరో డిప్యూటీగా అజిత్‌ పవార్‌ !

ప్రధాని మోదీ, అమిత్‌ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న షిండే

తుది అంకానికి చేరిన ‘మహా’ హైడ్రామా

కేబినెట్‌ కూర్పుపై నేడు ఢిల్లీలో అమిత్‌ షాతో షిండే, ఫడ్నవిస్, అజిత్‌ భేటీ

ముంబై/థానే: ఎవరికీ మెజారిటీరాని, హంగ్‌ సందర్భాల్లో కనిపించేంత ఉత్కంఠను కొనసాగించిన ‘మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు?’ అంశానికి నేటితో తెరపడనుంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయమైంది. 

మహాయుతి కూటమిని శాసనసభ ఎన్నికల పర్వంలో విజయతీరాలకు చేర్చినందుకు మళ్లీ తననే సీఎంగా చేయాలని పట్టుబట్టిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కాస్తంత మెత్తబడ్డారు. దీంతో ఫడ్నవిస్‌ పట్టాభిషేకానికి అవరోధాలు దాదాపు తొలగిపోయాయి. నేడు ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్‌ షాతో ఏక్‌నాథ్‌ షిండే భేటీ తర్వాత కేబినెట్‌ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

కూటమి ధర్మాన్ని పాటిస్తూ మళ్లీ తనకే సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టిన షిండే బుధవారం పట్టు సడలించారు. నూతన సీఎం ఎంపికపై ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని బుధవారం షిండే చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో ఫడ్నవిస్‌ సారథ్యంలో బీజేపీ సర్కార్‌ కొలువుతీరడం దాదాపు ఖాయమైంది. ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 30 లేదా డిసెంబర్‌ ఒకటో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్‌ పవార్‌ బుధవారం చెప్పారు.

2, 3 గంటలే నిద్రపోయా
‘‘మహాయుతికి ఘన విజయం అందించిన మహారాష్ట్ర ఓటర్లకు కృతజ్ఞతలు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విస్తృతంగా తిరిగా. ఎన్నికల ప్రచారం వేళ రోజుకు కేవలం 2,3 గంటలే నిద్రపోయా. ప్రజల కోసం నేరుగా పనిచేయడంలో నేను ఇప్పటికీ కార్యకర్తనే. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌మ్యాన్‌. నేనేమీ అసంతృప్తిలో లేను. మేం పోరాటం చేశాం. ఇక్కడ ఏడ్వాల్సిన అవసరం లేదు. పాపులర్‌ అవ్వాలని సీఎంగా చేయలేదు. ప్రజల సంక్షేమం కోసమే పదవిలో కొనసాగా’’ అని షిండే వ్యాఖ్యానించారు. 

బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించడం ఆనందంగా ఉందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే చెప్పారు. ‘‘ విపక్షాల పుకార్లను పటాపంచలు చేస్తూ షిండే చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆయనను చూసి గర్వపడుతున్నా. సీఎంగా ఆయన అద్భుతంగా పాలించారు’’ అని బవాంకులే పొగిడారు. షిండే మహాయుతి ప్రభుత్వానికి కన్వీనర్‌గా ఉంటారని వార్తలొచ్చాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాజా ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించడం తెల్సిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్‌సీపీ(అజిత్‌పవార్‌) 41 చోట్ల గెలిచాయి.

మా వైపు స్పీడ్‌ బ్రేక్‌ లేదన్న షిండే
ఘన విజయం తర్వాత ఐదు రోజులకు తొలిసారిగా బుధవారం థానేలోని స్వగృహంలో 60 ఏళ్ల షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ కొత్త సీఎం విషయంలో మోదీ, అమిత్‌ షాల నిర్ణయంతో ఏకీభవిస్తా. ఈ ఎంపిక ప్రక్రియలో నేను అవరోధంగా ఉండబోను. బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు, శివసేనకు సమ్మతమే అని నిన్ననే వాళ్లతో ఫోన్‌ సంభాషణల్లో స్పష్టం చేశా. రెండోదఫా అవకాశం దక్కదని తెల్సి నిరాశచెందానన్న వార్తల్లో నిజం లేదు. 

వాస్తవానికి సీఎంగా నా ప్రభుత్వానికి బీజేపీ మద్దతు పలికిందన్న విషయం మర్చి పోవద్దు. కొత్త సీఎం వ్యవహారంలో శివసేన నేతల్లో ఎలాంటి కోపతాపాలు, అసహనం లేవు. గురువారం ఢిల్లీలో అమిత్‌ షాను నేను, ఫడ్నవిస్, అజిత్‌పవార్‌ కలవ బోతున్నాం. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు ఖరారవుతాయి’’ అని అన్నారు. ‘‘ కొత్త ప్రభుత్వం కొలువు తీరే అంశం గురువారంతో తేలిపోనుంది’’ అని షిండే అన్నారు. నవంబర్‌ 30 లేదా డిసెంబర్‌ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ చెప్పారు. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Maharashtra
new Chief Minister
Devendra Fadnavis
mahayuti
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నడుస్తూ మ్యాన్‌హోల్‌లో పడి..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.