Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. తాజ్‌మహల్‌, చార్మినార్‌నూ కూల్చేస్తారా?
ADVERTISEMENT 

తాజ్‌మహల్‌, చార్మినార్‌నూ కూల్చేస్తారా?

National Sakshi User Sakshi Sakshi Time Dec 2, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
KHARGE.jpg

న్యూఢిల్లీ: ముస్లింల సారథ్యంలో నిర్మాణం పూర్తిచేసుకున్న దేశంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ కూల్చేస్తారా అంటూ బీజేపీకి కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సూటి ప్రశ్న వేశారు. దేశంలోని ప్రతి మసీదు వద్దా సర్వేలు చేపడుతూ బీజేపీ నాయకత్వం భారతీయ సమాజాన్ని విభజిస్తోందని ఆరోపించారు.  

‘‘అర్థంపర్థం లేని సర్వేలతో ప్రజలను మోదీ ఐక్యంగా, శాంతంగా జీవించకుండా చేస్తున్నారు. ముస్లింలు నిర్మించారు కాబట్టి ఎర్రకోట, తాజ్‌మహల్, కుతుబ్‌ మినార్, చార్మినార్‌ వంటివాటన్నింటినీ కూల్చేస్తారా?’’ అని సూటిగా ప్రశ్నించారు. 

ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు ఉన్న చోట గతంలో హిందూ ఆలయం ఆనవాళ్లున్నాయా అని తెల్సుకునేందుకు సర్వే చేపట్టడం, దానిపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ ఉద్రిక్తత చివరికి పోలీసు ఘర్షణలకు, మరణాలకు దారి తీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే కూల్చివేతల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

‘‘ఒక తీర్పు తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూలేని పోకడ మొదలైంది. మసీదుల కింద ఆలయాల ఆనవాళ్లున్నాయో కనుగొనేందుకు సర్వేల పేరిట బయల్దేరారు. వీటికి మద్దతు పలికే వారి సంఖ్యా పెరిగింది. దశాబ్దాలుగా ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని కొత్తగా మార్చకూడదని 1991నాటి చట్టం స్పష్టంచేస్తోంది. అయినాసరే ఆ చట్ట ఉల్లంఘనకు బీజేపీ బరితెగిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ.. ‘‘ ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటామని మీరన్నారు. మేము ఇప్పటికే ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉన్న మమ్మల్ని విభజించేది మీరే’’ అని ఖర్గే దుయ్యబట్టారు.

భాగవత్‌ మాటా బీజేపీ వినదా?
‘‘2023లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఒక మంచి విషయం చెప్పారు. ‘రామమందిర నిర్మాణమే మన లక్ష్యం. అంతేగానీ మనం ప్రతి మసీదు కింద శివాలయం వెతకకూడద’ని చెప్పారు. కానీ భాగవత్‌ మాటను కూడా మోదీ, అమిత్‌షా సహా బీజేపీ నేతలెవరూ అస్సలు పట్టించుకోవట్లేదు. బహుశా భాగవత్‌ తాను బహిరంగంగా చెప్పే కొన్ని విషయాలను బీజేపీ నేతలకు చెప్పరేమో. వీళ్లందరిదీ మొదటినుంచీ ద్వంద్వ వైఖరే’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. 

‘‘గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు తమ హక్కులను మాత్రమే గాక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడే వారి లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనందరం ఐక్యంగా నిలబడదాం. ఐక్యంగా ఉంటే కులాల ప్రాతిపదికన ప్రయతి్నంచినా మన ఐక్యతను మోదీ విచి్ఛన్నం చేయలేరు. సాధారణ ప్రజానీకం అంటే మోదీకి గిట్టదు. మనల్ని ద్వేషించే వాళ్లతోనే మన పోరు. అందుకే రాజకీయ శక్తి అనేది చాలా ముఖ్యం’’ అని ఖర్గే అన్నారు.
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
demolished
Mallikarjun Kharge
Red fort
taj mahal
Qutub Minar
charminar
Sambhal
Hindu temple
Congress Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.