Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్‌
ADVERTISEMENT 

Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్‌

National Sakshi User Sakshi Sakshi Time May 11, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
100520241550-PTI05_10_2024_.jpg

పలు షరతులు విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం  

జూన్‌ 1 వరకూ బెయిల్‌.. 2న తిరిగి లొంగిపోవాలి   

వచ్చే నెల 5వ తేదీదాకా బెయిల్‌ 

ఇవ్వాలన్న కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది  

తిరస్కరించిన ధర్మాసనం  

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్‌ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్‌ 2న తిరిగి తిహార్‌ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.

 కేజ్రీవాల్‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్‌ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 

ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. 

మధ్యంతర బెయిల్‌ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది.  

కేజ్రీవాల్‌ దోషిగా నిర్ధారణ కాలేదు 
కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. 

కేజ్రీవాల్‌ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్‌ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్‌ ఇస్తుంటాయని పేర్కొంది.  

21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు  
తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. 

కేజ్రీవాల్‌ అప్పీల్‌ తమవద్దే పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్‌ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. 

మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని, కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్‌ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్‌కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్‌పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది.  

తిహార్‌ జైలు నుంచి విడుదల
సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్‌ తన కాన్వాయ్‌తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ఉన్నారు.    

సుప్రీంకోర్టు షరతులివే..  
1. రూ.50,000 బెయిల్‌ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్‌ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలి.  
2. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 
3.లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు  
4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు.  
5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
liquor scam
money laundering case
Delhi Chief Minister Arvind Kejriwal
interim bail
Supreme court of India
Enforcement Directorate (ED)
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు

ఆస్తులు విడుదల చేయాల్సిందే ఈడీ జప్తు సరికాదు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.