Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. సీబీఐ కస్టడీలో కవిత.. డే-1 ఇంటరాగేషన్
ADVERTISEMENT 

సీబీఐ కస్టడీలో కవిత.. డే-1 ఇంటరాగేషన్

National Sakshi User Sakshi Sakshi Time Apr 13, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kavitha_CBI_Day1.jpg

Updates

► సీబీఐ కస్టడీలో  కవిత విచారణ కొనసాగుతోంది. సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. రూమ్ నంబర్ 302లో విచారణ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది.

► సీబీఐ కస్టడీలో ఉన్న కవిత  ఇంటరాగేషన్‌ సీబీఐ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసి అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాఫ్ చాట్‌పై సీబీఐ కవితను ప్రశ్నిస్తోంది.

► మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో సీబీఐ కవితను  ప్రశ్నిస్తోంది. సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరగనున్నాయి. సీబీఐ కస్టడీలో ప్రతి రోజు సాయంత్రం 6-7 గంటల మధ్య  కవితను కలిసేందుకు న్యాయవాది, సభ్యులకు అనుమతి ఉంది. కవిత భర్త అనిల్, కేటీఆర్, పీఏ శరత్ న్యాయవాది మోహిత్ రావు కలిసేందుకు అనుమతి ఉంది.

ఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ పాలసీ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ నేటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అనూహ్యరీతిలో సీబీఐ ఆమెను అరెస్ట్‌ చేయగా.. రౌస్‌ అవెన్యూ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఇవాళ(శనివారం) తొలిరోజు కవిత ఇంటరాగేషన్ ప్రారంభం కానుంది. 

సాక్ష్యాలను ముందు పెట్టి సీబీఐ అధికారులు కవితను విచారణ చేయనున్నట్లు సమాచారం. బుచ్చిబాబు-కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంటరాగేషన్ జగరనున్నట్లు తెలుస్తోంది. అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ, దినేష్ అరోరా శరత్ చంద్రారెడ్డితో పాటు అభిషేక్ బోయినపల్లి అశోక్ కౌశిక్ వాంగ్మూలాలను చూపించి సీబీఐ కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి.

ఇక.. నిన్న( శుక్రవారం) కవితను మూడు రోజుల కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఈనెల 15 వరకు కవిత సీబీఐ కస్టడీలో ఉండనుంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో కవిత విచారణ జరగనుంది. కవితను సీబీఐ కస్టడీలో కలిసేందుకు సోదరులు కేటీఆర్, భర్త అనిల్, కవిత పిల్లలు, పీఏ శరత్ కలిసేందుకు కోర్టు అనుమతి  ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అనుమతి   ఇచ్చింది. అదేవిధంగా కస్టడీలో కవితకు ఇంటిభోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుమతించింది.

కవిత రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ విషయాలు

కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి.. కవిత జాగృతి సంస్థకు రూ. 80లక్షల ముడుపులు చెల్లించారు. డబ్బులకోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు సీబీఐ పేర్కొంది.

నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు 80లక్షలు శరత్ చంద్రారెడ్డి చెల్లించారన్న సిబిఐ. మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనన్న శరత్ చంద్రారెడ్డి.

రూ.14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది.  ఒక్కో రిటైల్ జోన్ కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారన్నసీబీఐ.

కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్కి కవితే రూ.100కోట్లు చెల్లించారు. ఇండో స్పిరిట్‌లో 65శాతం వాటా పొందారు. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారు. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడు. ఈ విషయాలన్నింటి పైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదు అని సీబీఐ పేర్కొంది. అందుకే ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.

కవిత అరెస్టు అక్రమం..

కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి తెలిపారు. ‘కవిత అరెస్టు అక్రమం. కవితను కస్టడీలో ఉంచాలనేది సీబీఐ ధ్యేయంగా కనబడుతోంది.  కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ. జాతీయ రాజకీయ పార్టీలో  కవిత మాస్ లీడర్. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అరెస్ట్ చేయడమనేది కీలకం. కవిత ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అరెస్టులో నిబంధనలు పాటించలేదు. దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారు’అని అ‍న్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
kavitha
kalvakuntla kavita
Delhi Liquor Scam
cbi
interrogation
Delhi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

ఇథనాల్‌ పెట్రోల్‌.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ

 కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ రిలీఫ్‌

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.