సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ సీజేపీ వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని.. ఈ విజయం విద్యార్థులందరిందని సీజేపీ పేర్కొంది.
సీజేపీ నిరసనలు.. అప్డేట్స్..
విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి: రాహుల్
-
విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించింది
-
విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే
-
దేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించింది
-
విద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు
-
విద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి
- నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: జేపీ నడ్డా
- త్వరలోనే పరిహారం ఇస్తాం
- నిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాం
- సీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తాం
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీ
- విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుంది
- ప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరింది
- విద్యార్థులపై కేసు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుంది
- పరిహారంపై కూడా స్పష్టత ఇచ్చింది
- విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి
- ఆందోళన విరమించిన సీజేపీ
సీజేపీ, కేంద్ర మధ్య ముగిసిన చర్చలు
- సీజేపీ ప్రతినిధులతో చర్చించిన నడ్డా, జితేంద్రసింగ్
- దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు
కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలు
- చర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్
- సీజేపీ నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్
- లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరిన సీజేపీ
సెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
విద్యార్థుల ఆందోళన విరమణతో మెట్రో స్టేషన్లు రీఓపెన్
ఢిల్లీలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలు
- ఢిల్లీకి బయల్దేరి రావాలని ఫడ్నవీస్, షిండేలకు పిలుపు
- మరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పిలుపు
ఇది ప్రజాస్వామ్య విజయం మల్లికార్జున ఖర్గే
- ఇప్పటికైనా విద్యా వ్యవస్థను సరిదిద్దాలి
- యువత ధైర్యంగా పోరాడింది
ఢిల్లీ:
- ప్రధాని మోదీతో అమిత్ షా భేటీ
- తాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు
- కాసేపట్లో కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలు
- మిగతా రెండు డిమాండ్లను నెరవేర్చాలంటున్న సీజేపీ
ప్రజాస్వామ్యం గెలిచింది: వాంగ్‌చుక్
- శాంతికి, సహనానికి చెందిన విజయం ఇది
- ఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలి
- ఇకపై కేంద్ర బాధ్యతాయుతంగా వ్యహరించాలి
- సీజేపీ, జెన్ జీలకు ధన్యవాదాలు
జంతర్‌మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలు
- ఒక డిమాండ్ నెరవేరింది: సీజేపీ
- మిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి ఉందాం
- విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీ
- కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీ
- విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదు
- ఈ విజయం విద్యార్థులందరిది
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ రాజీనామా
- సీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్
- సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- రాజీనామా లేఖను ప్రధానికి పంపిన ధర్మేంద్ర ప్రధాన్
జంతర్‌మంతర్ సమీపంలో ఉద్రిక్తత
- పోలీసులపై రాళ్లురువ్విన ఆందోళనకారులు
- ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు
ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్
- జంతర్ మంతర్‌ను ముట్టడించడం ఆపండి
- దీక్షా స్థలికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దు
- నిరసనకారులకు ఆహారం, మందులు చేరనివ్వాలి
- జంతర్ మంతర్ ముట్టడిని ఎత్తివేయాలని డిమాండ్
ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటన
- జంతర్‌మంతర్ హింసాత్మక ఘటనలపై పోలీసుల ప్రెస్‌మీట్
- అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయి
- సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేశారు
- దీని వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉంది
- పాక్ నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ అయ్యాయి
- 400కి పైగా పాక్ హ్యాండిల్స్‌ను బ్లాక్ చేశాం
- ఏఐ కట్టడికి కృషి చేస్తున్నాం
- ఏఐ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి
రేపు దేశవ్యాప్త నిరసనలను సీజేపీ పిలుపు
-
మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సీజేపీ
-
రేపు సాయంత్రం 6గం. క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపు
-
ఇవాళ చర్చలు ఉంటాయా? ఉండవా? అనేదానిపై నెలకొన్న అనిశ్చితి
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీ
-
ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించకలేకపోతే.. మోదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్
కేంద్రంతో చర్చకు ముందు సీజేపీ కీలక ట్వీట్
-
రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు
-
నిర్ణయం తీసుకోకపోతే.. చర్చలు కొనసాగించడంలో అర్థం లేదు
-
“వాళ్లు అడిగే పరిస్థితి రాకముందే.. ఇప్పటికి బాధ్యత తీసుకుని స్వయంగా రాజీనామా చేసి ఉండాల్సింది.” అంటూ మరో ట్వీట్
-
మధ్యాహ్నం 3.30గం. కు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ భేటీ!
-
నిన్న గంటన్నరపాటు జరిగిన చర్చలు
-
కీలక డిమాండ్‌పై కొలిక్కి రాని చర్చలు
-
ఇవాళ ఏ నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రులు
-
మంత్రి రాజీనామాపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతి చేస్తామని ప్రకటన
जिम्मेदारी लेकर बिना मांगे ही अब तक इस्तीफा दे देना चाहिए था 🥺
— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026
సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు
-
సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్, తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు
-
విద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైంది
-
పేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధానే కారణం
-
కచ్చితంగా ఆయన రాజీనామా చేయాలి
సీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ సంఘీభావం
-
శనివారం.. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
-
ప్రధాని అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తున్నారు.. ఏం లాభం?
- ఢిల్లీ పోలీసులు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారు
- లాఠీలతో తలలు పగలకొట్టారు
- పిల్లలపై దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే
- ధర్మేంద్రను ప్రధాని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలి
- నీట్ లీక్‌పై విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి
- అవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీక
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారు
- ఆయన్ని మరో శాఖకు మార్చాలని అనుకుంటున్నారు
- ఆయన శాఖ మార్చడం కూడా ఆమోద యోగ్యం కాదు
- ఎంత బెదిరించినా.. జంతర్ మంతర్నుంచి విద్యార్థులు కదలరు
యువతకు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు
- టైఫాయిడ్‌తో బాధపడుతున్ను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే
- చికిత్స తీసుకుంటున్న సీజేపీ చీఫ్
- శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలు
- ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే కేంద్రం తప్పకుండా దిగి వస్తుంది
- ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి తప్పకుండా రాజీనామా చేస్తారు
- పోరాటం ఇలాగే కొనసాగించాలని సూచన
- కోలుకోగానే తాను చేరతానని వ్యాఖ్య
మోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలు
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- నేటి యువత దారితప్పిన వారు కాదని, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భగవత్
- యువతకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. వారితో చర్చలు జరపాలని సూచన
- కొత్త తరం ఎక్కువగా ప్రశ్నలు అడుగుతోందని, వారికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వ్యాఖ్య
- యువతకు మార్గనిర్దేశం చేయాలే తప్ప.. వారి అభిప్రాయాలను అణచివేయకూడదన్న ఆరెస్సెస్ చీఫ్
- “ఆదేశాలు కాదు.. చర్చలు, నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయం” అనే సందేశం ఇచ్చిన మోహన్ భగవత్
- యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే సంభాషణ(మాటలు, చర్చల) ద్వారానే సాధ్యమని ఆసక్తికర వ్యాఖ్య
రాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. వాంగ్‌చుక్ వివరణ
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మినహా మిగతా వాటికి అంగీకరించిన సోనమ్ వాంగ్‌చుక్
- కేంద్ర మంత్రుల సమక్షంలో మొన్న దీక్ష విరమణ
- ప్రధాన డిమాండ్ నెరవేరక ముందే దీక్ష విరమించడంపై విమర్శలు
- నిన్న రాత్రి వీడియోలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన వాంగ్‌చుక్
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.
- రాజీనామా తనకు ప్రధాన అంశం కాదని.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకుండా చూడటమే తన ప్రాధాన్యత అని చెప్పారు.
- ఢిల్లీలోని ‘సీజేపీ’ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.
- పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై పార్లమెంట్లో చర్చిస్తామని.. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను చర్చల్లో ప్రస్తావించానని.. కానీ కేంద్రం మరింత సమయం కోరిందని వాంగ్‌చుక్ తెలిపారు.
- ప్రధాన్ రాజీనామా చివరికి జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. అందుకే దానిపై పట్టుబట్టలేదని చెప్పారు.
- "నా లక్ష్యం విద్యార్థులు నష్టపోకూడదనేది. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా చూడటమే అత్యంత ముఖ్యమైన విషయం" అని స్పష్టం చేశారు.
- దీక్ష విరమణపై వచ్చిన ‘డీల్ కుదిరింది’ అనే ఆరోపణలను వాంగ్‌చుక్ ఖండించారు.
- "డీల్ చేసుకోవాలనుకుంటే 26 రోజులు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? ఏసీ గదిలో కూర్చునే ఒప్పందం చేసుకునేవాడిని" అని వ్యాఖ్యానించారు.
- కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వచ్చి హామీలు ఇచ్చారని.. అయితే రాతపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష విరమించలేదని తెలిపారు.
- తనతో పాటు పోరాడిన విద్యార్థులు, ఎంపీలు, లద్దాఖ్ ప్రతినిధులు దీక్ష ముగింపు సమయంలో తన వద్ద లేకపోవడం బాధ కలిగించిందని వాంగ్‌చుక్ అన్నారు.
AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!
Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
సమగ్ర కథనం కోసం👉 ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్‌చుక్
చర్చల వేళ సీజేపీ కీలక వ్యాఖ్యలు
- కేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక ప్రకటన.
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత లేకుండా చర్చలు కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టీకరణ.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి డిమాండ్ (నాన్-నెగోషియబుల్) అంటూ సీజీపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్య
- ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే.. తదుపరి చర్చలకు వెళ్లడంలో ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
- కేంద్రం, సీజీపీ ప్రతినిధుల మధ్య మూడో విడత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది.
సమగ్ర కథనం కోసం👉 కేంద్రానికి సీజేపీ సంచలన షరతు
కేంద్రం–సీజేపీ చర్చలు 3.0.. కీలక పరిణామాలు
- కేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు నేడు జరగనున్నాయి.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
- శుక్రవారం జరిగిన దాదాపు రెండు గంటల చర్చల్లో ఎలాంటి తుది నిర్ణయం రాలేదు.
- సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం.
- శాంతియుత నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అంశాలపై సానుకూలత వ్యక్తం చేసింది.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్రం మరింత సమయం కోరింది.
- ఇవాళ మధ్యాహ్నం 3గం.లకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ జరగనుంది
నీట్ నిరసనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- పేపర్ లీక్ నేరాలకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- పేపర్ లీక్ మాఫియాకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.
- నేర తీవ్రత ఆధారంగా శిక్షను 10 ఏళ్ల వరకు పెంచే అవకాశం కల్పించారు.
- వ్యవస్థీకృత పేపర్ లీక్ రాకెట్లకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.
- పేపర్ లీక్ కేసుల దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.
- కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపట్టనున్నారు.
- ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మంత్రి రాజీనామాపై ఉత్కంఠ..
- విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.
- రాజీనామా చేయడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల వాదన.
- ఎన్టీఏ సంస్కరణలు, పరీక్షల వ్యవస్థలో మార్పులే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.
- సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తోంది.
సీజేపీ హెచ్చరికలు..
- రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
- ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశుతోష్ రాంకా తెలిపారు.
- కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.
డిమాండ్లపై అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలు
- నిన్న జరిగిన సమావేశంలో పరిహారం, చట్టపరమైన కేసులకు సంబంధించిన అంశాలపై సానుకూల స్పందన వచ్చిందన్న రాంగా
- ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈరోజు లిఖితపూర్వక ఒప్పందం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
- ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదన్నారు.
- మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని సమాచారం వస్తోందని, అదే జరిగితే సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాంకా అన్నారు.
- ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్‌ను పట్టించుకోకుండా రాజీనామాకు నిరాకరిస్తే, తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
- ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే సీజేపీ కూడా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
- తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని అశుతోష్ రాంకా కోరారు.
VIDEO | Delhi Jantar Mantar Protest: CJP spokesperson Ashutosh Ranka, says, "In yesterday's meeting, we received a positive response regarding compensation and legal cases. We got an in-principle agreement, and we hope to receive the written agreement today as well. However,… pic.twitter.com/BFvGHOZWBm
— Press Trust of India (@PTI_News) July 25, 2026
సమగ్ర కథనం కోసం👉: నీట్ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలొచ్చు
జంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం..
- సీజేపీ ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత
- ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచారు.
- నిరసనలకు ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ ప్రాంతం చుట్టూ అదనపు బారికేడ్ల ఏర్పాటు.
- బారికేడ్లను భారీ స్థాయి గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించారు.
- బారికేడ్లు కదలకుండా ఉండేందుకు వాటిని వెల్డింగ్ చేసి మరింత బలోపేతం.
- పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.
- జంతర్ మంతర్ పరిసరాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.
- శాంతియుతంగా ఆందోళన కొనసాగించేలా పోలీసులు చర్యలు చేపట్టారు
Police Fortifies Jantar Mantar,
A six-layer barricade setup is now in place on the road near Jantar Mantar and Jai Singh Marg. An attempt is being made to restrict the protesters to the area. The barricades have been anchored to the ground using iron rods and welding pic.twitter.com/NmwjZOfNPN— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 24, 2026
ఇంటర్నెట్ నిలిపివేత..
- సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేత
- పని చేయని మొబైల్ డేటా సర్వీసెస్
- బుకింగ్ కానీ క్యాబ్ సర్వీసులు, పని చేయని యూపీఐ పేమెంట్స్ యాప్
- సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
#WATCH | Security intensified around Jantar Mantar as Delhi Police set up additional barricades that have been interlinked with heavy duty chains and reinforced through welding. pic.twitter.com/I9tNCvGp6X
— ANI (@ANI) July 25, 2026
మెట్రో మూసివేత..
- సీజేపీ నిరసనల నేపథ్యంలో మళ్ళీ మెట్రో స్టేషన్లు మూసివేత
- 18 మెట్రో స్టేషన్లు క్లోజ్
లోక్ కల్యాణ్ మార్గ్
రాజీవ్ చౌక్
పటేల్ చౌక్
రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్
బారఖంబా రోడ్
సుప్రీం కోర్ట్
సేవా తీర్థ్
జనపథ్
మండి హౌస్
సెంట్రల్ సెక్రటేరియట్
ఐటీఓ
ఢిల్లీ గేట్
ఇంద్రప్రస్థ
ఖాన్ మార్కెట్
జోర్ బాగ్
శివాజీ స్టేడియం
ఝండేవాలాన్
న్యూ ఢిల్లీ
కేంద్రం, సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన..
-
రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ
-
24 గంటల్లో చెబుతామన్న మంత్రులు, నేడు మళ్లీ చర్చలు
-
47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసన
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలు
-
కేంద్ర ప్రభుత్వం, సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి.
-
ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి.
-
విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా చర్చ నడిచింది.
-
మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా.. ప్రభుత్వం 24 గంటల సమయం కోరింది.
-
శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది.