Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మనమంతా టీమిండియా
ADVERTISEMENT 

మనమంతా టీమిండియా

National Sakshi User Sakshi Sakshi Time May 25, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
240520250311-PTI05_24_2025_.jpg

కేంద్ర రాష్ట్రాలు కలసికట్టుగా సాగాలి: మోదీ 

అప్పుడు ఏ లక్ష్యమూ అసాధ్యం కాదు 

నీతి ఆయోగ్‌ భేటీలో సీఎంలకు పిలుపు 

రాష్ట్రానికో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం 

ప్రగతి వేగం పెంచుదామన్న ప్రధాని 

న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలను ‘టీమిండియా’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అవి కలసికట్టుగా పని చేస్తే ఏ అభివృద్ధి లక్ష్యమూ అసాధ్యం కాబోదని ధీమా వెలిబుచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి 10వ భేటీకి ఆయన సారథ్యం వహించారు. వికసిత భారత్‌–2047 థీమ్‌తో భేటీ సాగింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు భేటీలో పాల్గొన్నట్టు నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రమణ్యం వెల్లడించారు. 

పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొనలేదని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి లక్ష్యాల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యాటకాన్ని దెబ్బ తీయడం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రమూ ప్రగతి సాధించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు దేశమంతా దానంతటదే వృద్ధి చెందుతుంది.

 గడువు లోపలే వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా అభివృద్ధి పనుల వేగం మరింత పెంచుదాం. 140 కోట్ల పైచిలుకు భారతీయుల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్‌లో పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కనుక నగరాలను సుస్థిరాభివృద్ధి, ఇన్నోవేషన్ల కలబోతగా, భవిష్యత్‌ అవసరాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘‘మహిళా శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే మనమంతా ఆశించిన విధంగా దేశప్రగతి సాధ్యపడుతుంది. శ్రామిక శక్తిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు, విధానాలను రూపొందించుకోవాలి’’ అని మోదీ చెప్పారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం: సీఎంలు
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తమిళనాడు, పంజాబ్‌ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్, భగవంత్‌ మాన్‌ డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తామని మాటిచ్చారు. కానీ 33.16 శాతమే ఇస్తున్నారు. తమిళనాడు దేశంలోకెల్లా అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అమృత్‌ 2.0 పథకం కింద రాష్ట్రానికి ప్రత్యేక పట్టణీకరణ మిషన్‌ను మంజూరు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. 

నమామి గంగ తరహాలో తమిళనాడులోని కావేరీ, వైగే తదితర నదుల ప్రక్షాళనకు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలి’’ అని స్టాలిన్‌ కోరారు. ఆ ప్రాజెక్టులకు పేర్లను ఇంగ్లిష్లోనే పెట్టాలన్నారు. పంజాబ్‌లో పాకిస్తాన్‌ను ఆనుకుని ఉండే ఆరు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని కేంద్రానికి మాన్‌ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని రూ.30 వేలకు పెంచాలన్నారు. సిక్కిం, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలను కలుపుతూ ప్రపంచస్థాయి జాతీయ రహదారి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సిక్కిం సీఎం ప్రేంసింగ్‌ తమాంగ్‌ అన్నారు.

విధాన అడ్డంకులు తొలగించాలన్నారు: సీఈఓ 
భేటీ వివరాలను నీతి ఆయోగ్‌ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలని, తద్వారా ఇతోధికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించుకోవాలని హితవు పలికారు’’ అని చెప్పారు. భేటీలో పాల్గొన్న సీఎంలు, నేతలు ఆపరేషన్‌ సిందూర్‌ను ముక్తకంఠంతో సమరి్థంచారన్నారు.  

జైరాంతో కాంగ్రెస్‌కే చేటు: బీజేపీ 
నీతి ఆయోగ్‌ ఓ ‘అయోగ్య’ (అసమర్థ) సంస్థ అన్న కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కే చేటు చేసే వివాదాలను సృష్టించడం ఆయన నైజమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ను జైరాం భూస్థాపితం చేయడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ జోస్యం చెప్పారు.

నవ్వుల్‌ పువ్వుల్‌ 
ఆయోగ్‌ భేటీలో సరదా సన్నివేశాలు 
ప్రధాని, ముఖ్యమంత్రుల నడుమ పలు సరదా సన్నివేశాలకు నీతి ఆయోగ్‌ భేటీ వేదికైంది. సమావేశం ముగిశాక రేవంత్‌రెడ్డి, స్టాలిన్‌ తదితరులతో మోదీ సరదా సంభాషణలు జరిపారు. నవ్వుతూ, వారిని నవి్వస్తూ కని్పంచారు. భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌), హేమంత్‌ సోరెన్‌ (జార్ఖండ్‌), కొన్రాడ్‌ సంగ్మా (నాగాలాండ్‌) తదితరులు మోదీతో చాలాసేపటిదాకా కరచాలనం చేస్తూ కన్పించారు. వారితో ప్రధాని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలంతా తేనీరు సేవిస్తూ ఉల్లాసంగా గడిపారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
center government
states
team india
Narendra Modi
Niti Aayog CEO
niti aayog
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.