Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై నిషేధం
ADVERTISEMENT 

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై నిషేధం

National Sakshi User Sakshi Sakshi Time Dec 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
protest_0.jpg

కేంద్ర మైనింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌ నిషేధించింది. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాలకు కొత్త మైనింగ్‌ లీజులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతులివ్వకూడదని పేర్కొంటూ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ  నిషేధం మొత్తం అరావళ్లి శ్రేణికి సమానంగా వర్తిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది.

అరావళి పర్యతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటిగా  భావిస్తారు. ఇవి ఢిల్లీ నుంచి గుజరాత్ వరకూ సూమారు 670 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉ‍న్నాయి. ఇవి వాయు కాలుష్యాన్ని తగ్గించంతో పాటు నీటి నిల్వలను కాపాడడంతో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ పర్వతాల్లో జరిగే మైనింగ్ వల్ల జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. 

తాజాగా.. ఇక్కడి మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నవంబర్ 20 న కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న ప్రాంతంలో భూమట్టానికి 100 మీటర్లు సూమారు 328 అడుగులు ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారని తీర్పు చెప్పింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక సిద్దమయ్యే వరకూ అక్కడ ఏలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టవద్దని తెలిపింది. ఈ విషయమై ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది.

అయితే సుప్రీం కోర్టు 100 మీటర్ల ఎత్తైన పర్వాతాలనే ఆరావళిగా పరిగణించడాన్ని పర్యావరణ వేత్తలు తప్పుబట్టారు. ఆరావళి పర్వతాల్లో దాదాపు 91శాతం పర్వత శ్రేణులు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ప్రాంతమంతా చట్టపరమైన రక్షణను కోల్పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 100 మీటర్ల నిబంధనపై గుజరాత్‌లోని ప్రజలు నిరసన తెలిపారు.

అయితే తాజా నివేదికలు ఆరావళి పర్వతాలు క్రమంగా కోతకు గురవుతున్నాయని తెలుపుతున్నాయి. వృక్షసంపద దాదాపు మూడింట ఒక వంతు తగ్గిందని.. దశాబ్దం కాలంలోపే మూడువేల కిలోమీటర్లకు పైగా అటవీప్రాంతం కోతకు గురైందని  సర్వేలు పేర్కొంటున్నాయి. దీంతో పాటు గిరిజన, ఆదివాసీల జీవనాధారంపైనా ప్రతికూల ప్రభావం పడే పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో.. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం మొదలైంది. ఇటు సోషల్ మీడియాలోనూ సేవ్ ఆరావళి ట్రెండింగ్‌గా నడిచింది. పరిస్థితులు తీవ్రతరం అయ్యేలా కనిపించడంతో.. అక్కడ నూతన మైనింగ్‌ను రద్దు చేస్తూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
central
Govt
Mining
Lease
cancel
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆధార్‌ కార్డులపై అస్సాం కీలక నిర్ణయం

ఆధార్‌ కార్డులపై అస్సాం కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో భారీ వర్షం.. తమన్‌ లైవ్ కన్సర్ట్ రద్దు

హైదరాబాద్‌లో భారీ వర్షం.. తమన్‌ లైవ్ కన్సర్ట్ రద్దు

భారత్‌ తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌ సేథ్‌

భారత్‌ తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌ సేథ్‌

పశ్చిమాసియా ఉద్రిక్తత.. కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ

పశ్చిమాసియా ఉద్రిక్తత.. కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ

మయన్మార్ లో భారీ పేలుడు.. 46 మంది మృతి

మయన్మార్ లో భారీ పేలుడు.. 46 మంది మృతి

మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్‌ డీల్‌ హాట్‌ టాపిక్‌

మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్‌ డీల్‌ హాట్‌ టాపిక్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.