Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. పార్లమెంట్‌ నిరవధిక వాయిదా
ADVERTISEMENT 

పార్లమెంట్‌ నిరవధిక వాయిదా

National Sakshi User Sakshi Sakshi Time Apr 5, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ls.jpg

సోనియా గాంధీ వ్యాఖ్యలపై చివరి రోజు బీజేపీ నిరసన

క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

సోనియా వ్యాఖ్యలు దురదృష్టకరమన్న ఓం బిర్లా 

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఈ ఏడాది జనవరి 31వ తేదీన ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వక్ఫ్‌(సవరణ) బిల్లును ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో శుక్రవారం దుమారం రేగింది. ఈ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగంపై దాడేనని, బిల్లును లోక్‌సభలో బుల్డోజ్‌ చేశారు అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 దీనిపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ... సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్ట్టకరం, సభ గౌరవానికి విరుద్ధం అని పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా టారిఫ్‌లపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ ఓంబిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు.

 సభ పునఃప్రారంభమైన తర్వాత స్పీకర్‌ తన ముగింపు వ్యాఖ్యలను చదివారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో 173 మంది, కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో 169 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులు ఆమోదించినట్లు, సభ ఉత్పాదకత 118 శాతానికి పెరిగినట్లు ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

రాజ్యసభలో రెండో సుదీర్ఘ భేటీ 
ఈ సెషన్‌లో రాజ్యసభ మొత్తంగా 119 గంటలపాటు పని చేసిందని, ఉత్పాదకత 119 శాతానికి పెరిగిందని ఎగువ సభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పారు. సభలో రికార్డు స్థాయిలో 49 మంది సభ్యులు ప్రైవేటు మెంబర్‌ బిల్లులు ప్రవేశపెట్టారని వివరించారు. వక్ఫ్‌(సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ గురువారం ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు విరామం లేకుండా సుదీర్ఘంగా సమావేశమైందని, ఇదొక రికార్డు అని అన్నారు. పార్లమెంటరీ రికార్డుల ప్రకారం.. రాజ్యసభలో ఇది రెండో సుదీర్ఘ భేటీ. మొదటి సుదీర్ఘ భేటీ 1981 సెప్టెంబర్‌ 18న జరిగింది. 

అప్పట్లోసభ మరుసటి రోజు తెల్లవారుజామున 4.43 గంటల వరకు కొనసాగింది. అత్యవసర సేవల నిర్వహణ బిల్లు–1981పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించారు. ఇదిలా ఉండగా, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ధ్రువీకరిస్తూ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ఆమోదించారు. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. మణిపూర్‌లో ఘర్షణకు తెరదించడమే లక్ష్యంగా రెండు ముఖ్యమైన తెగల మధ్య సమావేశం త్వరలో జరగబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో వెల్లడించారు. ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందన్నారు.     
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Parliament Budget sessions
Waqf assets
amendment bill
Sonia Gandhi
Om Birla
bjp
MPs
protest
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

ఉద్ధవ్‌ ‘సేన’లో చీలిక 

ఉద్ధవ్‌ ‘సేన’లో చీలిక 

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.