దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అధికార ఎన్డీఏ కూటమి జయభేరి మోగించింది. డబుల్ సెంచరీతో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేసేలా జయ కేతనం ఎగుర వేసింది. మహాగఠ్‌బంధన్ ఊహించని విధంగా ఘోర పరాజయం చవిచూసింది.
ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో విజయం సాధించగా, మహాగఠ్‌బంధన్ 35 స్థానాలకు పరిమితమైంది. ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జన్ సురాజ్‌పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం తన 5 స్థానాలను నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం విశేషం.
యువనేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయకత్వంలోని లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ(ఆర్వీ) 28 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాగా, చిరాగ్ పాశ్వాన్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశముందని వార్తలు వ స్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం పార్టీల వారీగా ఫలితాలు ఇలా..
|
పార్టీ |
ఆధిక్యం | |
| 1 | భారతీయ జనతా పార్టీ -బీజేపీ |
89 |
| 2 | జనతాదళ్ (యునైటెడ్)- జేడీయూ |
85 |
| 3 | రాష్ట్రీయ జనతాదళ్- ఆర్జేడీ |
25 |
| 4 | లోక్ జనశక్తి (రామ్ విలాస్) |
19 |
| 5 | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
6 |
| 6 | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
5 |
| 7 | హిందుస్థానీ అవామ్ మోర్చా- హెచ్ఏఎంఎస్ |
5 |
| 8 | రాష్ట్రీయ లోక్ మోర్చా- ఆర్ఎస్హెచ్టీఎల్కేఎం |
4 |
| 9 | సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ |
2 |
| 10 | ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ - ఐఐపీ |
1 |
| 11 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
1 |
| 12 | బహుజన సమాజ్ పార్టీ- బీఎస్పీ |
1 |
|
Total |
243 |