Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. సుప్రీం పేరుతో డిజిటల్‌ స్కాం
ADVERTISEMENT 

సుప్రీం పేరుతో డిజిటల్‌ స్కాం

National Sakshi User Sakshi Sakshi Time Oct 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
scam.jpg

రూ.కోటికి పైగా నష్టపోయిన వృద్ధ దంపతులు

ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం

కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం పేరుతో ఉత్తుత్తి ఉత్తర్వులు చూపించి వృద్ధ దంపతుల నుంచి రూ.కోటికి పైగా డబ్బు కాజేసిన ఘటనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా న్యాయస్థానాల పేర్లతో జరిగే డిజిటల్‌ నేరాలతో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతామని పేర్కొంది. వ్యవస్థ గౌరవం దెబ్బతింటుందని తెలిపింది. ఇవి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 

డిజిటల్‌ స్కాంలపై తక్షణ ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు శుక్రవారం జస్టిస్‌ సూర్యకాంత్, జాయ్‌మాల్య భాగ్చీల ధర్మాసనం నోటీసులు పంపింది. తమను డిజిటల్‌ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను బాధిత పిటిషనర్లు చూపించారు. 

కేటుగాళ్లు సెప్టెంబర్‌ 3 నుంచి 16వ తేదీ మధ్యలో సీబీఐ, ఈడీ అధికారులుగా, జడ్జీలుగా నటిస్తూ ఆడియో, వీడియో కాల్స్‌ ద్వారా కోర్టు నకిలీ ఉత్తర్వులను చూపించి, అరెస్టు, నిఘా అంటూ బెదిరించారని బాధితులు కొన్ని పత్రాలను చూపారు. వీటితో పలు దఫాలుగా రూ.1.05 కోట్లు కాజేశారన్నారు. హరియాణాలోని అంబాలాకు చెందిన వృద్ధ దంపతులు ఇటీవల ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌కి ఈ మోసంపై సెప్టెంబర్‌ 21న లేఖ రాశారు. వృద్ధ దంపతులకు జరిగిన అన్యాయంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాధితుల ఫిర్యాదుపై సుమోటోగా విచారణ చేపట్టింది. 

విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమిది..
న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల పేరిట సృష్టించిన ఫోర్జరీ పత్రాలతో న్యాయస్థానంపై ప్రజలకు గల విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీల సంతకాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారి సంతకాలు, కోర్టు స్టాంప్‌ కూడా వేయడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ‘జడ్జీ్జల సంతకాలతో సృష్టించిన ఫోర్జరీ పత్రాలు న్యాయస్థానంపై ప్రజల విశ్వాసంతోపాటు, వ్యవస్థ మూలాలు దెబ్బ తింటాయి. ఇటువంటి క్రిమినల్‌ చర్యలను సాధారణ మోసం, సైబర్‌ క్రైమ్‌గా పరిగణించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్‌లో న్యాయస్థానాల పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలను ఉపేక్షించరాదని పేర్కొంది. త్వరగా ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. 

ఈవ్యవహారంలో తాము భారత అటార్నీ జనరల్‌ సహాయం కోరుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇది ఈ వృద్ధ దంపతుల సమస్య మాత్రమే కాదని, యావత్‌ దేశ ప్రజానీకం సమస్య అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం పోలీసులను దర్యాప్తు వేగవంతం చేయమని చెప్పి వదిలేయడానికి వీలు లేదని పేర్కొంది. కేవలం ఇదొక్క కేసు మాత్రమే కాదు. ఇటువంటి నేరాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా జరిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇటువంటి విస్తృత ప్రభావం కలిగిన నేరపూరిత చర్యలను పూర్తిగా దర్యాప్తు జరిపి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంగా కృషి చేయాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో సాయం అందించాలని అటార్నీ జనరల్‌ను కోరిన ధర్మాసనం, వృద్ధ దంపతుల కేసు దర్యాప్తు పురోగతిని తెలియజేయాలంటూ హరియాణా ప్రభుత్వం, అంబాలా సైబర్‌ క్రైమ్‌ విభాగాలను ఆదేశించింది.


 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Supreme court of India
oldage couple
Supreme Court
agitation
Scam
Central Government
cbi
notices
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!

హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.