Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అయోధ్య: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి!
ADVERTISEMENT 

అయోధ్య: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి!

National Sakshi User Sakshi Sakshi Time Jan 17, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ayodhya-land.jpg

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో అయోధ్య అభివృద్ధికి అత్యధిక నిధులు ఖర్చుచేసింది. పలు అభివృద్ధి పనులకు సుమారు రూ.31 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. యూపీలోని ఏ జిల్లాలోనూ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు. 

అయోధ్యకు వచ్చే పర్యాటకుల సంఖ్య గత నాలుగేళ్లలో 2.25 లక్షల నుంచి 2.25 కోట్లకు పెరిగింది. భూముల ధరలు పదిరెట్ల మేరకు పెరిగాయి. ఈ నగరం సీతామాత శాపానికి గురైందని స్థానికులు అంటుంటారు. గతంలో ఇక్కడి యువత ఉద్యోగాల కోసం  ఇతర ప్రాంతాలకు పయనమయ్యింది. అయితే రామ మందిరం నిర్మాణం ప్రారంభంతో అయోధ్య ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పర్యాటకులు, రామభక్తులతో సందడిగా మారింది. 

ప్రాపర్టీ డీలర్ బ్రిజేంద్ర దూబే పదేళ్లుగా అయోధ్యలో భూముల క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల కిందట చదరపు అడుగు భూమి 

రూ.1000కి లభించేదని, ఇప్పుడు రూ. రూ.4,000 వెచ్చించినా దొరకడంలేదని తెలిపారు. నగరంలోని రామ్‌పథంలో భూముల ధరలు భారీగా పెరిగాయని చదరపు అడుగు భూమి ధర రూ.1000 నుంచి రూ.6 వేలకు పెరిగిందన్నారు. 

అయోధ్యలోని రామమందిర్ ట్రస్ట్  వైకుంఠథామం సమీపంలో 14 వేల 730 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ భూముల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి రూ.55 కోట్ల 47 లక్షల 800 ఆదాయం వచ్చింది. ఇదేవిధంగా హౌసింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ 1,194 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

లోధా గ్రూప్ నగరంలోకి ‍ప్రవేశించాక  ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్ని అంటాయని ప్రాపర్టీ డీలర్‌ బ్రిజేంద్ర దూబే చెప్పారు. ఈ గ్రూపు అయోధ్య వెలుపల రాంపూర్ హల్వారా, రాజేపూర్ ప్రాంతం మధ్యలో సొసైటీని నిర్మించడానికి భారీగా భూములను కొనుగోలు చేసింది. 

గడచిన కాలంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన స్థానిక యువత అయోధ్య శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడికి తిరిగివస్తోంది. మలవన్‌కు చెందిన అనుప్ పాండే గుజరాత్‌లో పనిచేసేవాడు. అయోధ్యలో ఉపాధి అవకాశాలు పెరగడాన్ని చూసి, అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఇక్కడికి తిరిగివచ్చాడు.  ఒక కారును కొనుగోలు చేసి, దానిని పర్యాటక ప్రాంతాలకు తిప్పుతూ ఉపాధి పొందుతున్నాడు. ఇదేవిధంగా ఇంజనీర్ బ్రిజేష్ పాఠక్ ప్రయాగ్‌రాజ్‌లో తన ఉద్యోగాన్ని వదిలి, అయోధ్యకు చేరుకుని ఆయుర్వేద ఔషధాల తయారీని ప్రారంభించాడు. అవినాష్ దూబే తన ఉద్యోగం వదిలిపెట్టి, అయోధ్యలో బెల్లం తయారీ పరిశ్రమను ప్రారంభించాడు. అరవింద్ చౌరాసియా చండీగఢ్ నుండి ఇక్కడకు తిరిగి వచ్చి, హోటల్‌ ప్రారంభించాడు. 

ఇది కూడా చదవండి: నేడు ఆలయ ప్రాంగణంలోకి బాలరాముని విగ్రహం!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Ayodhya Ram Mandir
Ayodhya
Ram Janmabhoomi
Ram janmabhoomi temple
Development
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

ఆ 60 కేజీల వెండి ఎక్కడ?

ఆ 60 కేజీల వెండి ఎక్కడ?

అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం

అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం

అన్ని లక్షల కోట్లు ఉంటేనా..!!!

అన్ని లక్షల కోట్లు ఉంటేనా..!!!

మంత్రి పదవికంటే విలువైనదా? ఆ శాఖ కోసం ఎందుకింత పోటీ?

మంత్రి పదవికంటే విలువైనదా? ఆ శాఖ కోసం ఎందుకింత పోటీ?

బిహార్‌ అభివృద్ధిపై ఓ కన్నేసి ఉంచుతా : జేడీయూ చీఫ్‌ నితీష్‌

బిహార్‌ అభివృద్ధిపై ఓ కన్నేసి ఉంచుతా : జేడీయూ చీఫ్‌ నితీష్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.