Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. డీప్‌ఫేక్, ఏఐలతో బాలికలకు వేధింపులు 
ADVERTISEMENT 

డీప్‌ఫేక్, ఏఐలతో బాలికలకు వేధింపులు 

National Sakshi User Sakshi Sakshi Time Oct 13, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
JUSTICE-NAGARATHNA11.jpg

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న ఆవేదన 

అరికట్టేందుకు తగిన చట్టాలు అవసరం 

బాలికలపై ఏఐ, ఇతర టెక్నాలజీల దురి్వనియోగాన్ని గుర్తించాలి 

ఇందుకు సలహా కమిటీ ఏర్పాటు అవకాశాలను సుప్రీంకోర్టు పరిశీలించాలి 

బాలికల హక్కులపై జరిగిన జాతీయ సదస్సులో జస్టిస్‌ బీవీ నాగరత్న సూచనలు 

న్యూఢిల్లీ: డీప్‌ఫేక్, కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత సాంకేతికతతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపుల పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు తగిన చట్టాలు అవసరమన్నారు. బాలికలపై జరుగుతున్న ఈ తరహా సాంకేతిక పరమైన దురి్వనియోగాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకునే దిశలో ‘‘ఏఐ సైబర్‌క్రైమ్‌ అడ్వైజరీ కమిటీ ఆన్‌ గర్ల్‌ చైల్డ్‌’’అనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్‌ సూచించారు. న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నారు. 

లింగ ఆధారిత బ్రూణ, శిశు హత్యలపై ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు బాలికలకు పోషకాహారం అందించాల్సిన ఆవశ్యకతనూ ఉద్ఘాటించారు. ఆయా అంశాలు అన్నింటిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపునకూ కృషి జరగాలని ఉద్భోదించారు. యూనిసెఫ్‌ ఇండియాతో కలిసి సుప్రీంకోర్టు జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ (జేజేసీ) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బాలిక రక్షణ– సురక్షిత, ప్రోత్సాహక వాతావరణం’అనే అంశంపై ఇక్కడ జరిగిన రెండు రోజుల జాతీయ వార్షిక భాగస్వామ్య సదస్సులో జస్టిస్‌ బీవీ నాగరత్న ముగింపు ఉపన్యాసం చేశారు. జేజేసీ సభ్యులు కూడా అయిన జస్టిస్‌ నాగరత్న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... 

→ తరచుగా మారుతున్న టెక్నాలజీల వల్ల కలిగే ప్రమాదాలు.. నిరంతరం తలపై వేలాడుతున్న ఖడ్గం లాంటిది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత టెక్నాలజీల ద్వారా బాలల హక్కులు దురి్వనియోగం కాకుండా తగిన చట్టాలను రూపొందించాలి. ఆయా అంశాలపై 24 గంటల సమాచారం వ్యవస్థ, నిరంతరం స్పందించే జాతీయ ట్రాకింగ్‌ వ్యవస్థను తప్పనిసరి చేయాలి.  

→ చట్టం ఒక్కటే సమాజాన్ని మార్చలేదు. తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బాలిక భారమనే అపోహను తొలగించే దిశలోకి తల్లిదండ్రుల దృక్పథం మారాలి. 

→ బాలికను కాపాడటం అంటే తరతరాలను కాపాడడమంటూ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయం హర్షణీయం.  

→ ఆహారమే ఉత్తమ ఔషధం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిల్లలలో పోషకాహారంపై అవగాహన పెంచడానికి పాఠశాల సిలబస్‌లో పోషకాహార విద్యను చేర్చాలి. పాఠశాలల చుట్టూ జంక్‌ఫుడ్‌ ప్రకటనలను నిషేధించాలి.  

→ బాలికల అక్రమ రవాణా నిరోధక చర్యలు మరింత ఫలప్రదం కావాలంటే ఆయా నేరాలకు సంబంధించిన దర్యాప్తును ఫోరెన్సిక్, ఫైనాన్షియల్‌ ట్రేసింగ్‌తో అనుసంధానించి ప్రొఫెషనల్‌గా నిర్వహించాలి. అలాంటి బాలికల పునరావాసాన్ని ప్రభుత్వ బాధ్యతగా వ్యవస్థ పటిష్టం కావాలి. ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించే వ్యవస్థను నెలకొల్పాలి. 

→ బాధితుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి కేంద్రీకరించే విధంగా ప్రతి జిల్లాలో పిల్లలకు, మహిళలకు వైద్య, మానసిక, న్యాయ సేవలు అందుబాటులో ఉండాలి.  

→ పోలీసులకు, న్యాయ వ్యవస్థ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, విభాగాల మధ్య సమన్వయం, బాధితుల సంతృప్తి తీరుపై వార్షిక సమీక్ష అవసరం.  

→ అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వికలాంగుల విభాగాలకు సంబంధించిన బాలికలకు రాజ్యాంగం, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందాల ప్రకారం తగిన గుర్తింపు ఇవ్వాలి. ఆయా ప్రయోజనాలు వారికి అందేట్లు చూడాలి.  

→ లింగ నిష్పత్తి మెరుగుదల కోసం జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో గణాంకాల ను సమీక్షిస్తూ సంస్థల పనితీరును నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది.  

సైబర్‌ నేరాలపై పటిష్ట దర్యాప్తు పద్దతులు లేవు: జస్టిస్‌ పార్దీవాలా  
సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పార్దీవాలా మాట్లాడుతూ క్లిష్టమైన సైబర్‌ నేరాలను ఎదుర్కొనే దర్యాప్తు విధానాలు దేశంలో సమర్థంగా లేవని అన్నారు. ప్రస్తుత సైబర్‌ యుగంలో బాలికలు బాధితులుగా మారే ప్రమాదం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలుసహా భారతదేశంలోని అనేక స్థానిక తెగలలో బాలిక పుట్టినప్పుడు సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటారని, అది అందరూ నేర్చుకోవాల్సిన విషయమని సూచించారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Deepfake
Artificial Intelligence (AI)
Technology
Crimes against women
Harassment
Supreme court of India
nagaratna
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.