Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. బిహార్‌లో ఒంటరి పోరు
ADVERTISEMENT 

బిహార్‌లో ఒంటరి పోరు

National Sakshi User Sakshi Sakshi Time Jul 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
030720250519-PTI07_03_2025_.jpg

ఆప్‌ కన్వినర్‌ కేజ్రీవాల్‌ ప్రకటన 

ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలకే అని స్పష్టీకరణ 

నష్టపోనున్న కాంగ్రెస్, ఆర్‌జేడీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం విపక్ష ఇండియా కూటమికి ఝలక్‌ ఇచ్చే కీలక ప్రకటన చేశారు. వచ్చే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఉద్దేశించింది మాత్రమేనని పేర్కొన్నారు. ‘ఆప్‌ బిహార్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలకు మాత్ర మే. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు లేదు. పొత్తు ఉంటే కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌లోని విశావదర్‌ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేసింది. 

కాంగ్రెస్‌ కేవలం ఆప్‌ను ఓడించేందుకు పోటీ చేసింది. ఆప్‌ను ఓడించేందుకు, ఓట్లను తగ్గించేందుకు కాంగ్రెస్‌ను బీజేపీ పంపింది’అని అహ్మదాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. బిహార్‌లో ఆప్‌ తన ఎన్నికల అరంగేట్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టిందన్నారు. తమ నిర్ణయం ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను సవాల్‌ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా అభివరి్ణంచారు. అదే సమయంలో గుజరాత్‌లో ఆప్‌ రాజకీయ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 ‘గుజరాత్‌లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. అయినప్పటికీ బీజేపీ పదేపదే గెలుస్తోంది. దీనికి కారణం అక్కడ బలమైన ప్రత్యామ్నా యం లేకపోవడమే. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ జేబులో ఉంది. ఒకవిధంగా బీజేపీని గెలిపించే కాంట్రాక్ట్‌ను కాంగ్రెస్‌ తీసుకుంది. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. కాంగ్రెస్‌కు ఓటేస్తే గెలవరని, గెలిచినా బీజేపీలోకి వెళ్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఆప్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. గుజరాత్‌ను మొదటి 30 ఏళ్లు కాంగ్రెస్, తర్వాత 30 ఏళ్లు బీజేపీ పాలించాయి. ఇప్పుడు ఆప్‌కు అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌కు దెబ్బే
ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్‌జేడీ పార్టీలు ప్రధానంగా యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్‌ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆప్‌ సైతం ఈ ఓట్లపైనే దృష్టి పెట్టే అవకాశముంది. విద్య, ఆరోగ్యం, విద్యుత్‌ వంటి అంశాలపై బిహార్‌లో ప్రజల వద్దకు వెళ్తామని, పట్టణ పేదలు, గ్రామీణుల ప్రజలను చేరుకునేలా తమ వ్యూహం ఉంటుందని కేజ్రీవాల్‌ ఇదివరకే ప్రకటించారు. 

ఆప్‌ నిజంగా అదే వ్యూహంతో ముందుకెళితే ఇండియా కూటమి ఓట్లకు భారీగా గండి పడే అవకాశాలున్నాయి. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఇండియా కూటమి 9 స్థానాలను గెలుచుకుంది. ఆప్‌ పోటీలో నిలిస్తే కాంగ్రెస్, ఆర్‌జేడీ ఓట్ల వాటాను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇది పరోక్షంగా ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 52 శాతం, ఇండియా కూటమి 42 శాతం ఓట్లను సాధించాయి. 

ఇప్పుడు ఆప్‌ పోటీలో ఉంటే ఇండియా కూటమికు నష్టం జరిగే అవకాశం ఉంది. సంక్లిష్టమైన కుల సమీకరణాలు, బలమైన ప్రాంతాయ పార్టీల ఆధిపత్యం ఉండే బిహార్‌ రాజకీయాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఆప్‌ నిర్ణయం ఇండియా కూటమికి నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు సైతం లెక్కలు వేస్తున్నారు. ఆప్‌ కనీసంగా 5–10శాతం ఓట్లు సాధించినా, అది ఎన్డీఏకే కలిసొస్తుందని అంటున్నారు. ఈ ఓట్ల శాతం రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా తనను ప్రకటించుకునేందుకు ఆప్‌కు దోహదపడుతుందని భావిస్తున్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Aam Aadmi Party
Arvind Kejriwal
alliance
Congress Party
Bihar
Assembly Elections
Solo
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.