Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. టీనేజర్లను.. కాస్త అర్థం చేసుకోండి!
ADVERTISEMENT 

టీనేజర్లను.. కాస్త అర్థం చేసుకోండి!

National Sakshi User Sakshi Sakshi Time Nov 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
teen.jpg

యుక్త వయసు.. జీవితంలో చాలా కీలకమైన దశ. కానీ, ఈ తరుణంలో శరీరంలో వచ్చే మార్పులు యువతను చాలా ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో తల్లిదండ్రులు, సమాజం వారి నుంచి ఆశించడమూ మొదలవుతుంది. ఇవన్నీ కలిసి వారిలో ఒత్తిడి, ఆందోళన పెంచుతాయి. ఏ సందర్భంలో విఫలమైనా నిరాశ పరిచి, కుంగదీస్తాయి. యువత ఎలాంటి సమస్యనైనా సింహాల్లా పరిష్కరించగలరు అన్నారు స్వామి వివేకానందుడు. వారు సింహాల్లా ఎదగాలంటే ఏం చేయాలి.. 

ఎవరి పాత్ర ఏమిటి?
ఏషియన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకియాట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 70 శాతం మంది విద్యార్థుల్లో నిత్యం మధ్యస్థం నుంచి తీవ్ర స్థాయి ఆందోళన కనిపించిందట. సగానికిపైగా విద్యార్థుల్లో నిరాశా నిస్పృహలు పట్టి పీడిస్తున్నాయి.  మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. 65 శాతం మంది తమ భావోద్వేగాలను లేదా ప్రవర్తనను నియంత్రించుకోలేకపోతున్నారట. 

అనేక కారణాలు
‘టీనేజర్‌ జీవితం చాలా కీలకమైనది. వారి శరీరంలో జరిగే మార్పుల ప్రభావం ఒక ఎత్తయితే.. సమాజంలో గుర్తింపుకోసం వారు పడే ఆరాటం మరొక ఎత్తు. ‘డిజిటల్‌ ప్రపంచం’ వారిని ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది’ అంటున్నారు మానసిక నిపుణులు. మీ పిల్లల్లో అలసట, ఒత్తిడి, ఆందోళన, బాధ, కోపం వంటి వాటికి ఈ కింది అంశాలు కారణాలు కావచ్చు.

» చదువు ఒత్తిడి    
»  సోషల్‌ మీడియా, స్నేహితుల ప్రభావం
» వీడియో గేమ్స్‌ అతిగా ఆడటం
» సంబంధాలను సరిగ్గా మేనేజ్‌ చేయలేకపోవడం
» అతి సమాచారం (చదువు లేదా వినోదం) వల్ల మెదడుపై అధిక ఒత్తిడి 
» బంధువులు లేదా బయటివాళ్లు భయపెట్టడం లేదా తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం
» ప్రమాదాలు లేదా దుర్ఘటనలు 
» ఆర్థికపరమైన అంశాలు
» వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన సమస్యలు

వీటి ఫలితంగా టీనేజర్లు దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు. ఆహారం సరిగ్గా తీసుకోరు. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇవి శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తాయి.

ఇలా చేసి చూడండి!
టీనేజర్లు అంటే రేపటి పౌరులు. వారు అన్ని విధాలా ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిదండ్రులూ, వాళ్లు చదివే కాలేజీల యాజమాన్యాలూ శ్రద్ధ పెట్టాలి.
»  ‘చదువు, చదువు’ అని వారిని ఒత్తిడి చేయడం తగ్గించాలి.
»   శారీరక వ్యాయామం ముఖ్యమనే విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. 
»  కాలేజీల్లో జీవన నైపుణ్యాలు నేర్పించాలి. కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి. 
»  చదువు ఒక్కటే కాకుండా, ఆటలు వంటి పాఠ్యేతర కార్యకలాపాలు కూడా నిర్వహిస్తుండాలి.
»  రోజులో కనీసం 8–9 గంటలు నిద్రపోయేలా చూడాలి. 
»  రాత్రిపూట నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే.. సెల్‌ఫోన్‌ లేదా టీవీ లేదా కంప్యూటర్‌లను దూరం పెట్టాలి. 
»   తల్లిదండ్రులు తాము చెప్పేది శ్రద్ధగా వింటారు.. తమ సమస్యకు పరిష్కారం చూపగలుగుతారు అనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి.
» ముఖ్యంగా అమ్మాయిలు లైంగిక హింస లేదా దాడులకు గురైనప్పుడు వారిని ఓదార్చడం, ఆ క్షోభ నుంచి వారు బయటపడేలా చేయడంలో తల్లిదండ్రులే కీలకం.

తల్లిదండ్రులూ.. గమనించండి!
పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారి వ్యవహార ధోరణి, ఆహారపు అలవాట్లు, ఫోన్‌ వాడకం.. వీటన్నింటినీ పరిశీలించాలి. ఇంటికి వచ్చి వెళ్లే స్నేహితులు, బంధువులమీద కూడా ఒక కన్ను వేయాలి. వారి వల్ల కూడా పిల్లలు ప్రభావితం కావచ్చు. మీ పిల్లల్లో ఈ కింది లక్షణాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. 

»  ప్రతి పనికీ అలసిపోవడం లేదా ఎప్పుడు చూసినా అలసటగా కనిపించడం
» ఏ పనిమీదా శ్రద్ధ పెట్టలేకపోవడం
» భావోద్వేగాలు వెంటవెంటనే మారిపోతుండటం
» ఆకలి లేకపోవడం
»  తరచూ ఒంటి నొప్పులు అనడం
»  ఏ విషయాన్నీ సరిగ్గా వ్యక్తీకరించలేకపోవడం

అమ్మాయిలపైనా ప్రభావం
కేంద్ర నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 2022లో 13,044 మంది విద్యార్థులు బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. 2023లో ఈ సంఖ్య 13,892కు పెరిగింది. సాధారణంగా అబ్బాయిలే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు అనుకుంటారు అందరూ. కానీ, 2021–23 మధ్య.. అమ్మాయిల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Teenage
digital world
Students
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

బరితెగించిన బీటెక్‌ రవి.. విద్యార్థుల మృతిపై అసత్య ప్రచారం

బరితెగించిన బీటెక్‌ రవి.. విద్యార్థుల మృతిపై అసత్య ప్రచారం

కోచింగ్‌ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి

కోచింగ్‌ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి

‘రీ–నీట్‌’ కఠినమే..

‘రీ–నీట్‌’ కఠినమే..

‘మా నాన్నెవరో తెలుసా?’

‘మా నాన్నెవరో తెలుసా?’

ఫీజు కడితేనే సర్టిఫికెట్‌!

ఫీజు కడితేనే సర్టిఫికెట్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.