మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఊర్వశి రౌతేలా. అఖిల్ మూవీ ఏజెంట్‌లోనూ ప్రత్యేక సాంగ్‌తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో హాజరైన ముద్దుగుమ్మ తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
(ఇది చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమె నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్)
అయితే తాజాగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్‌ను కూడా షేర్ చేసింది. అహ్మదాబాద్‌లోని మాల్లో ఉన్నట్లు లోకేషన్‌ను పంచుకుంది. ఇప్పటికే అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు.

కాగా.. ఊర్వశి రౌతేలా.. సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత ఆమె సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది.
(ఇది చదవండి: నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్ )
📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice
Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023